తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ న్యూస్ @ 9AM - today top news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
top news

By

Published : Jan 31, 2022, 8:57 AM IST

  • నిర్మలమ్మ పద్దుపై ఆశలెన్నో..

ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొవిడ్‌ మూడో దశ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ తరుణంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన నాలుగో బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అందరి కళ్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి.

  • గిరాకీని పెంచే బడ్జెట్​పై ఆశలు

కొవిడ్‌ కాలంలో జీవనోపాధి కోల్పోయిన కోట్లాది ప్రజల బతుకులు బాగుపడాలంటే దేశార్థికానికి కొత్త ఊపు తీసుకురావాలి. అంటే, ద్రవ్యోల్బణాన్ని, ఆర్థికాభివృద్ధిని సమతుల పరచుకుంటూ ముందుకు సాగాలి. మరి కేంద్ర బడ్జెట్‌ అందరి ఆశలనూ తీర్చగలదా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న.

  • 'కేంద్రం మోసం చేసింది'

వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. ఇందుకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

  • తాను ఓడినా.. శత్రువు గెలవొద్దు

ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు రోజుకో మలుపు తీసుకుంటూ రసవత్తరంగా మారాయి. అఖిలేశ్​ యాదవ్ ముస్లిం-యాదవ్‌-జాట్‌ సమీకరణకు ప్రయత్నిస్తుంటే.. వీరి ఓట్లకు గండికొట్టే ఎత్తుగడల్లో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నిమగ్నమయ్యారు. ముస్లిం అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో రంగంలోకి దింపుతున్నారు.

  • యువోత్సాహమా? అనుభవ దరహాసమా?

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం పుష్కర్​సింగ్ ధామీ, మాజీ సీఎం హరీశ్ రావత్‌ల మధ్య పోటీ ఆసక్తిని పెంచుతోంది. భాజపాకు తిరిగి అధికారాన్ని కట్టబెట్టాలని ధామీ చూస్తుండగా.. అధికార పీఠం కోసం కాంగ్రెస్ తరఫున రావత్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • రాష్ట్రంలో 4 లక్షల మందిలో కరోనా లక్షణాలు

రాష్ట్రంలో 4 లక్షలకుపైగా మందిలో కరోనా లక్షణాలున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన జ్వర సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. కేవలం 9 రోజుల వ్యవధిలోనే ఇంత మందిలో కొవిడ్ లక్షణాలున్నట్లు గుర్తించామని పేర్కొంది. వారందరిలో వైరస్ నిర్ధారణ కాకపోయినా.. ఔషధ కిట్లు అందజేసినట్లు చెప్పింది.

  • ధర పెరిగినా.. దిగులే..

మార్కెట్‌లో మిర్చి గరిష్ఠ ధరలు క్వింటాకు రూ.18 వేల నుంచి 26 వేల వరకూ పలుకుతున్నా.. రాష్ట్రంలో ఎక్కువ మంది మిరప రైతులు సంతోషంగా లేరు. ఈ గరిష్ఠ ధరలు కొద్ది పంటకే దక్కుతుండడం, మిగతా సరకుకు క్వింటాకు ఏకంగా రూ.4-5 వేలు తగ్గిస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

  • 'ఒలింపిక్స్' హోటల్​ గదుల్లో రోబోల సేవలు

చైనాలోని బీజింగ్‌లో జరిగే వింటర్‌ ఒలింపిక్స్‌ చూసేందుకు వచ్చే వీక్షకులకు సరికొత్త అతిథులు స్వాగతం పలకనున్నాయి. వారికి అన్ని రకాల సేవలు అందించి సపర్యలు చేయనున్నాయి. రూమ్‌ సర్వీస్‌ దగ్గర నుంచి రుచికరమైన ఆహారాన్ని అందించే వరకూ ప్రతి దశలోనూ తోడ్పాటు ఇస్తూ ప్రత్యేకత చాటనున్నాయి.

  • వారు నాకు అండగా నిలిచారు

కష్ట సమయంలో పఠాన్​ సోదరులు తనకు అండగా నిలిచారని, వారికి కృతజ్ఞతలు చెప్పాడు టీమ్​ఇండియా ప్లేయర్​ దీపక్​ హుడా. ఆటగాడిగా సిద్ధం కావడానికి వారిద్దరూ తనకు ఎంతో సహకరించారని అన్నాడు.

  • టాలీవుడ్​లో 'టైమ్ ట్రావెల్' ట్రెండ్

తెలుగులో ఇప్పుడు టైమ్‌ ట్రావెల్‌ కథల హవా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు హీరోలు ఈ టైమ్‌ మెషీన్‌ కథలతో ప్రయాణాలు షురూ చేయగా.. ఇప్పుడు మరికొన్ని కథలు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details