తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 9PM - తెలంగాణ సమాచారం

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
టాప్ న్యూస్ @ 9PM

By

Published : May 25, 2022, 8:52 PM IST

  • ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం... పీఎం పర్యటనకు ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం(మే 26) హైదరాబాద్‌కు రానున్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్​బీ ద్విదశాబ్ది వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2022 సంవత్సరానికి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మోదీ పట్టాలు పంపిణీ చేయనున్నారు

  • రేపు బెంగళూరుకు సీఎం కేసీఆర్​..

CM KCR Bengaluru Tour: సీఎం కేసీఆర్​ గురువారం బెంగళూరుకు వెళ్లనున్నారు. మాజీ ప్రధానమంత్రి హెచ్​డీ దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు.

  • రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ..

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకొచ్చింది. దావోస్​లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్టాడ్లర్ రైల్ అనే సంస్థ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది.

  • రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు

Rajya Sabha Elections: తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు తెరాస అభ్యర్థులు దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్, సబిత పాల్గొన్నారు.

  • హనుమాన్ ఆలయాల్లో భక్తుల కిటకిట

Hanuman Jayanthi 2022 : శ్రీఆంజనేయ.. జై ఆంజనేయ.. జైహనుమాన్.. జైశ్రీరామ్‌.. అనే నామస్మరణలతో తెలంగాణ మార్మోగిపోతోంది. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని అంజనీపుత్రుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు గుడి బాట పట్టి.. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

  • కశ్మీర్​ వేర్పాటువాద నేత యాసిన్​మాలిక్​కు జీవితఖైదు

yasin malik separatist: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జమ్ము కశ్మీర్​ వేర్పాటువాద నేత యాసిన్​మాలిక్​కు శిక్ష ఖరారయ్యింది. ఈ మేరకు రెండు కేసుల్లో యావజ్జీవ శిక్ష విధిస్తూ దిల్లీ పటియాల కోర్టు తీర్పును వెలువరించింది. మొత్తం ఏడు ఆరోపణలపై శిక్షలు విధించింది.

  • కాంగ్రెస్​కు సిబల్ బై బై

కాంగ్రెస్​కు మరో సీనియర్ నేత షాక్​ ఇచ్చారు. చాలా ఏళ్లుగా ఆ పార్టీలో కీలకంగా ఉన్న నాయకుడు, ప్రముఖ న్యాయవాది​ కపిల్​ సిబల్​ రాజీనామా చేశారు. బుధవారం సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ సమక్షంలో లఖ్​నవూలో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు

  • ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు హతం

Jammu Kashmir encounter: ఉగ్రవాదంపై పోరులో భారత భద్రతా బలగాలు కీలక పురోగతి సాధించాయి. జమ్ముకశ్మీర్​ బారాముల్లాలో ముగ్గురు పాకిస్థానీ ముష్కరుల్ని మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ఒక పోలీసు అమరుడయ్యారు.

  • చిత్రా రామకృష్ణకు నోటీస్‌..

Chitra ramkrishna ED statement: ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ చిత్రా రామకృష్ణకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ నోటీసు పంపింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలో పాలనా పరమైన అవకతవకలకు సంబంధించిన కేసులో రూ.3.12 కోట్లు కట్టాలని విఫలమైతే అరెస్ట్​ చేయాలంటూ ఆదేశాలిచ్చింది.

  • లఖ్​నవూ ఫీల్డింగ్

టీ20 లీగ్‌లో భాగంగా జరగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్​నవూ టాస్​ గెలిచి ఆర్సీబీకి బ్యాటింగ్​ అప్పగించింది. ఈ మ్యాచ్​లో గెలిచి క్వాలిఫయర్​ 2 మ్యాచ్​కు అర్హత సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. మరి ఎవరు గెలుస్తారో చూడాలి..

ABOUT THE AUTHOR

...view details