ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలుకాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా కాల్చివేత పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా కాల్చి చంపారు దుండగులు. మాన్సా జిల్లాలో సిద్ధూ మూసే వాలాను కాల్చి చంపేశారు. 'కాశీ, మథుర మేల్కొంటున్నాయి'Kashi Waking up Adityanath: జ్ఞానవాపి మసీదు విషయంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామ మందిర నిర్మాణం తర్వాత కాశీ నగరం మేల్కొంటోందని అన్నారు. మథుర, బృందావనం వంటి పలు తీర్థక్షేత్రాలు సైతం మేల్కొంటున్నట్లు పేర్కొన్నారు.భారీ పేలుడు శబ్దం.. 22 మంది పరిస్థితి? Nepal Plane Crash: నేపాల్‌లో ఆచూకీ గల్లంతైన విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. పర్వత శ్రేణుల్లోని లమ్చే నది వద్ద భారీ పేలుడు శబ్దం వినిపించిందని, అక్కడే కూలిపోయి ఉంటుందని ఆర్మీకి సమాచారం అందించారు స్థానికులు. విమానం కూలిపోయిందని భావిస్తున్న ప్రదేశంలో.. మంచు కురుస్తున్న కారణంగా శోధన, సహాయక చర్యలను ఈరోజుకు నిలిపివేశారు.యువతిపై నలుగురితో లైంగికదాడి చేయించి మరీ..!ఒక చెట్టు వాడిపోకుండా ఉండాలంటే కావాల్సింది నీళ్లు.. అదే దంపతుల మధ్య విరిసిన ప్రేమ వాడిపోకుండా కలకాలం ఉండాలంటే.. కావాల్సింది నమ్మకం. అది గనకపోయి.. ఆ స్థానంలో అనుమానం అనే చీడ మొదలైందా.. సంసార వృక్షాన్ని మొత్తం నిర్వీర్యం చేసి నేలకూలుస్తుంది రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదు Central Minister Kishan Reddy: రాష్ట్రాల నుంచి వసూలు చేసిన పన్నులను మౌలిక వసతుల కల్పన, దేశ రక్షణ కోసం ఉపయోగిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో....42 శాతం పన్నులను ఇస్తున్నామని వెల్లడించారు. పల్లెప్రగతి బిల్లులు చెల్లించండి..Uttam Letter to CM KCR: ఐదో విడత పల్లె ప్రగతి మొదలు పెట్టక ముందే గ్రామాలకు రావాల్సిన పల్లె ప్రగతి బిల్లులను చెల్లించాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉత్తమ్ లేఖ రాశారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పనులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారని తెలిపారు. 'అఖండ' వేడుకల్లో బాలయ్య సందడి.. BALAKRISHNA: ఏపీలోని గుంటూరు జేకీసీ రోడ్డులో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్‌ను నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం చిలకలూరిపేటలో అఖండ సినిమా 175 రోజుల వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యSuicide on Railway Track: ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేయసి లేని జీవితం వ్యర్థమని భావించాడో ఏమో.. రైలు పట్టాలపై పడి ఛిద్రమై పోయాడు. కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.రాష్ట్రంలో తొలి ఇగ్లూ థియేటర్ Igloo Theater In Rajarampally: ప్రస్తుతం ఎక్కడా చూసినా మల్టీప్లెక్స్ థియేటర్ల హవా నడుస్తోంది. విలాసవంతమైన సౌకర్యాలతో పట్టణ ప్రజలు ఆకర్షితులవుతున్నారు. గ్రామీణవాసులు మాత్రం సినిమా చూడాలంటే పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు పల్లెటూరు ప్రజలకు వినోదాన్ని ముంగిట్లోకి తెచ్చేందుకు రాష్ట్రంలో తొలి ఇగ్లూ థియేటర్ అందుబాటులోకి రాబోతోంది. ఎస్కిమోలు నిర్మించుకునే ఇగ్లూ ఇళ్ల తరహాలో.. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేస్తున్న థియేటర్ విశేషంగా ఆకర్షిస్తోంది.'కిల్లర్ మిల్లర్' టు 'జోస్ ది బాస్'IPL 2022 Final: ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ సీజన్లలో 2022 ఒకటని చెప్పొచ్చు. లీగ్ ఆరంభ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్, అరంగేట్ర జట్టు గుజరాత్ టైటాన్స్ మధ్య నేడే (ఆదివారం) టైటిల్ పోరు జరగనుంది. ఇరు జట్లలోనూ డేవిడ్ మిల్లర్ నుంచి జోస్ బట్లర్ వరకు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఫైనల్స్‌లో ఆకట్టుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లపై ఓ లుక్కేయండి.