తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 7PM - తెలంగాణ టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
టాప్ న్యూస్ @ 7PM

By

Published : May 25, 2022, 6:58 PM IST

  • యాసిన్​మాలిక్​కు జీవితఖైదు

yasin malik separatist: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జమ్ము కశ్మీర్​ వేర్పాటువాద నేత యాసిన్​మాలిక్​కు శిక్ష ఖరారయ్యింది. ఈ మేరకు యావజ్జీవ శిక్ష విధిస్తూ దిల్లీ పటియాల కోర్టు తీర్పును వెలువరించింది.

  • ఆరుగురు సజీవదహనం

ఉత్తరాఖండ్​లో విషాద ఘటన జరిగింది. ఉత్తరకాశీ వెళ్తున్న ఓ బొలెరో వాహనం అదుపుతప్పి హైవే పక్కన ఉన్న కాలువలో పడింది. దీంతో వాహనంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మరణించారు.

  • పదేళ్ల బాలిక ఒంటికాలి పోరాటం...

Divyang girl from Jamui: ఒంటికాలితో గెంతుకుంటూ స్కూల్​కు వెళ్తున్న చిన్నారిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె దీనగాథ విన్న అధికారులు, వితరణశీలులు.. సాయం కోసం ముందుకొస్తున్నారు. తాజాగా సోనూసూద్ సైతం ఆమెకు సాయం చేస్తానంటూ ట్వీట్ చేశారు.

  • 'సీఎం ప్రభుత్వాసుపత్రికి ఎందుకు వెళ్లరు?'

Congress Leaders on KCR: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత లోపించిందని కాంగ్రెస్​ నేతలు మాజీ మంత్రి గీతారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్​ దిల్లీ దవాఖానాలు సందర్శించి బాగున్నట్లు ప్రశంసించారని.. హైదరాబాద్‌లో ఉన్న ఆసుపత్రులను ఎందుకు సందర్శించరని కాంగ్రెస్ నేతలు నిలదీశారు.

  • అందుకే గొడవలు రేపారు

Pawan kalyan: ఏపీలో జిల్లాల పేర్లు పెట్టేటప్పుడే అంబేడ్కర్​ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని జనసేన అధినేత పవన్​కల్యాణ్​ అన్నారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా? అని ప్రశ్నించారు. కులసమీకరణతో రాజకీయాలు చేస్తారా? అని ధ్వజమెత్తారు. భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారని ఆరోపించారు. ఈ ఘటనకు వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

  • మహిళపై వలస కూలీల గ్యాంగ్ రేప్

Crime News: ఓ మహిళపై ఆరుగురు వలస కార్మికులు సామూహిక అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన ఉదంతం వెలుగుచూసింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఆ వలస కార్మికులను అరెస్టు చేశారు.

  • అతడి ఇల్లే 'సైకిళ్ల మ్యూజియం'

Cycles Museum: నాణేలు, కరెన్సీ నోట్లు, తపాలా బిల్లలు, శతాబ్దం నాటి పుస్తకాలు వంటి ప్రాచీన వస్తువులను చాలా మంది సేకరిస్తుంటారు. వాటిని జాగ్రత్తగా పదిలపరుస్తుంటారు. ఇలాంటి మంచి అలవాట్లు ఉన్న వారిని మనం చాలా మందిని చూసుంటాం. కానీ వారందరికీ భిన్నంగా మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి.. 27 ఏళ్లుగా సైకిళ్లను సేకరిస్తున్నారు. అంతే కాకుండా వాటిన భద్రపరచడానికి తన ఇల్లును ఏకంగా మ్యూజియంగా మార్చేశాడు. ఓ సారి ఆ సైకిళ్ల మ్యూజియం గురించి తెలుసుకుందాం పదండి..

  • లైఫ్​లో చైతూ నో కాంప్రమైజ్​

'థ్యాంక్ యూ' సినిమా టీజర్..​ లైఫ్​లో కాంప్రమైజ్​ అయ్యే ప్రసక్తే లేదని అంటున్నారు యువ హీరో నాగచైతన్య. మరోవైపు సామ్​ తన ఇన్​స్టా స్టోరీస్​లో​ 'డెడ్'​ అనే పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్​ చేసింది.

  • సూర్య-బాలా మూవీ నిలిపివేత

Suriya Bala movie Budget problem: మరికొన్ని సినిమా కబుర్లు వచ్చాయి. సూర్య-బాల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్​కు బడ్జెట్​ సమ్యస తలెత్తినట్లు తెలిసింది. దీంతో తాత్కాలికంగా చిత్రీకరణను నిలిపివేశారట! చిరంజీవి 'వాల్తేర్​ వీరయ్య' మూవీటీమ్​ షూటింగ్​ కోసం మలేషియా వెళ్లనున్నట్లు సమాచారం.

  • టైటాన్స్​కు ఫుల్ జోష్​..​ ఫైనల్​కు మోదీ, షా!

IPL Final Modi: ఈనెల 29న అహ్మదాబాద్​ వేదికగా జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్​కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్​ ఇప్పటికే ఫైనల్ చేరిన నేపథ్యంలో సొంత రాష్ట్రానికి చెందిన ఇద్దరు దిగ్గజ నేతల రాకతో జట్టులో ఫుల్​ జోష్​ నిండనుంది.

ABOUT THE AUTHOR

...view details