ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు'తెలంగాణ అభివృద్ధే మా ప్రాధాన్యత.' Modi Speech in BJP Vijay Sankalpa Sabha: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు భాజపాపై ఎన్నో రెట్లు నమ్మకం పెరిగిందన్నారు.'ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లే మేమే'amit shah on telangana: తెలంగాణలో తదుపరి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయటంపై ఉన్న ధ్యాస.. యువతకు ఉపాధి కల్పించాలన్న విషయంపై లేదని విమర్శించారు. ఈ 8 ఏళ్లకాలంలో కేసీఆర్ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు భాజపాకు ఒక్కసారి అవకాశమివ్వాలని కోరారు.దేశ ప్రజల పాలిట దేవుడు.. మోదీ Bandi Sanjay Speech: సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభలో ప్రసంగించిన బండి సంజయ్.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చేలా ప్రజలు మద్దతివ్వాలన్నారు. అందుకోసం ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు.' విశ్వగురుగా భారత్'రానున్న 30 నుంచి 40 ఏళ్ల పాటు దేశంలో భాజపా శకం కొనసాగి.. భారత్ విశ్వగురుగా అవతరిస్తుందని హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యవర్గ సమావేశాల్లో రాజకీయ తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన.. వంశపారంపర్య, కుల, బుజ్జగింపు రాజకీయాలు దేశానికి శాపంగా మారాయని మండిపడ్డారు. దేశాన్ని దశాబ్దాలుగా పట్టిపీడిస్తోన్న సమస్యలకు అవే మూలమని అమిత్ షా ఆరోపించారు. రేపు జగ్గారెడ్డి సంచలన ప్రకటన..! Jaggareddy Comments: కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్న నేపథ్యంలో.. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి చేస్తున్న కీలక వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. రేవంత్‌రెడ్డిపై ఇప్పటికే తీవ్ర విమర్శలతో నిప్పులు చెరుగుతున్న జగ్గారెడ్డి.. రేపు సంచలన ప్రకటన చేయనున్నట్టు తెలిపారు.గోద్రా అల్లర్ల కేసు దోషికి జీవిత ఖైదుGodhra riots 2002: గోద్రా అల్లర్ల కేసులో రఫిక్ భతుక్కు జీవిత ఖైదు విధించింది ప్రత్యేక సెషన్స్ కోర్టు. ఈ కేసులో 35వ నిందితుడిగా ఉన్న అతడిని దోషిగా ఇటీవల తేల్చింది కోర్టు.మామ కౌన్సిల్ ఛైర్మన్.. అల్లుడు అసెంబ్లీ స్పీకర్ Maharastra Politics: శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలో ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం బలనిరూపణకు వీలుగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరిగింది. ఏక్‌నాథ్ బృందం మద్దతుతో భాజపా నేత రాహుల్ నర్వేకర్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉన్న రామ్‌రాజేనాయక్ అల్లుడే రాహుల్ నర్వేకర్. మరోవైపు, విధాన్భవన్లోని శాసనసభాపక్ష కార్యాలయాన్ని సీల్ చేశారు శివసేన నేతలు.ఎయిర్ ఇండియా ఇంటర్వ్యూలకు ఇండిగో సిబ్బంది.. ఇండిగో విమానాల రాకపోకలకు శనివారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కువ మంది సిబ్బంది.. సిక్ లీవ్‌లో ఉండటమే ఇందుకు కారణం. అయితే.. వారంతా ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు వెళ్లినట్లు తెలిసింది. దీంతో.. డీజీసీఏ స్వయంగా రంగంలోకి దిగింది.నరేశ్-పవిత్రతో తగాదా పడిన రమ్య Naresh Pavitra lokesh relation: ఓ హోటల్లో బస చేస్తున్న తన భర్త-పవిత్రా లోకేష్ దగ్గరకు వెళ్లి తగాదా పడ్డారు నరేశ్ భార్య రమ్య రఘపతి. ఈ క్రమంలోనే ఆమె పవిత్రను కొట్టబోయారని తెలిసింది.హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్Rohit sharma news: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. కరోనా నుంచి కోలుకున్నరోహిత్ ఆదివారంతో క్వారంటైన్ పూర్తిచేసుకున్నాడు.