ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు బండి సంజయ్ విడుదల కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదలయ్యారు. జైలులో బండి సంజయ్‌ను పరామర్శించేందుకు భగవంత్ కుబ వెళ్లారు. ఆయనతో కలిసి బండి సంజయ్ బయటకు వచ్చారు. జేపీ నడ్డా..కేరాఫ్ ఎర్రగడ్డభాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు. కేసీఆర్ పట్ల జేపీ నడ్డా వ్యాఖ్యలు హేయంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌కు, జేపీ నడ్డాకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. ఒక్కరోజే 1520 కేసులు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మూడు నాలుగు రోజుల ముందు వరకు కేవలం 200 లోపే నమోదైన కొవిడ్ కేసులు.. రెండు రోజుల నుంచి వెయ్యికిపైగా వెలుగుచూస్తున్నాయి. మోదీ పంజాబ్ టూర్‌కు బ్రేక్Modi Punjab visit: పంజాబ్‌లో బుధవారం జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ అనూహ్యంగా రద్దు అయింది. సభకు ప్రధాని మోదీ వెళ్లే మార్గంలో కొంతమంది నిరసనకారులు రోడ్డును దిగ్బంధించారు. దాంతో 20 నిమిషాలపాటు ఓ ఫ్లైఓవర్‌పైనే ఆగిపోయిన ఆయన.. తిరిగి దిల్లీకి బయల్దేరారు.14 కాదు 7 రోజులే.. Home Isolation Guidelines: దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. స్వల్పస్థాయి లేదా కొవిడ్ లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు నూతన మార్గదర్శకాలను జారీచేసింది కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ. హోం ఐసోలేషన్ గడువును 14 రోజుల నుంచి 7రోజులకు తగ్గించింది. కొవిడ్ సోకిన వ్యాక్తి ఏడు రోజుల్లో డిశ్ఛార్జ్ కావొచ్చని తెలిపింది.యథావిధిగా 'సివిల్స్ మెయిన్స్'Civils main exam date 2021: 2021 సివిల్స్ మెయిన్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని యూపీఎస్సీ ప్రకటించింది. ఆంక్షల అమలులో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలు అభ్యర్థులు పరీక్ష రాసేందుకు సహకరించాలని కోరింది.' వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయొద్దు'Bharat Biotech: దేశంలో 15-18 ఏళ్ల వయస్కులకు కొవాగ్జిన్ టీకా పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్. టీకా తీసుకున్న తర్వాత.. ఎలాంటి మందులు వాడాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.మూడో రోజూ 60వేల మార్కు దాటిన సెన్సెక్స్Stock Market Closing: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. మొదట నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. తర్వాత కొద్దిసేపటికే పుంజుకున్నాయి. సెన్సెక్స్ 367పాయింట్లు వృద్ధి చెంది 60వేల 223 వద్ద స్థిరపడింది. నిప్టీ 120 పాయింట్ల లాభంతో 17వేల 925 వద్దకు చేరింది. ఆర్ఆర్ఆర్పై పిల్ఆర్ఆర్ఆర్ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కుమురం భీం చరిత్రను వక్రీకరించారని ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్ దాఖలు చేశారుసఫారీల లక్ష్యం ఎంతంటే?IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది టీమ్ఇండియా. రహానే, పుజారా అర్ధశతకాలతో రాణించగా.. చివర్లో విహారి (40*) అద్భుతంగా పోరాడాడు.