తెలంగాణ

telangana

ETV Bharat / city

Top News: టాప్ న్యూస్ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top News
టాప్ న్యూస్ @ 5PM

By

Published : May 24, 2022, 5:09 PM IST

  • శరవేగంగా అయోధ్య ఆలయ నిర్మాణం

Ayodhya Ram Temple update: అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. పనుల పురోగతిపై ఆలయ నిర్మాణ కమిటీ నివేదిక సమర్పించింది. గుడి నిర్మాణం ఎంతవరకు పూర్తైందంటే..

  • 11కిలోమీటర్ల వస్త్రం.. అమ్మవారికి సమర్పించిన సీఎం

Longest chunari: 300 మంది మహిళలు 11 కిలోమీటర్ల పొడవైన వస్త్రాన్ని తయారుచేసి రికార్డు సృష్టించారు. అత్యంత పొడవైన వస్త్రంగా గోల్డెన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కింది. ఈ వస్త్రాన్ని సీఎం భూపేశ్ భఘేల్ దంతేశ్వరి అమ్మవారికి సమర్పించారు.

  • మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు

Rains in Telangana: రాష్ట్రంలో రాగల మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

  • త్వరలోనే హైదరాబాద్​కు వస్తా..!

KTR Davos Tour: స్విట్జర్లాండ్ దావోస్​లో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం దావోస్ వెళ్లిన ఇద్దరు నేతలు... అక్కడ భేటీ అయి రాష్ట్రాల అభివృద్ధి, పథకాలపై చర్చించుకున్నారు. ట్విటర్ వేదికగా కేటీఆర్ ఫొటోలను షేర్ చేశారు.

  • కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వానం

Kerala Invites Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేరళ అసెంబ్లీ నుంచి ఆహ్వానం అందింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ నెల 25 నుంచి 27 వరకూ తిరువనంతపురంలో జాతీయ మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్‌ జరగనుంది. ఈ నెల 26న కాన్ఫరెన్స్​లో కవిత పాల్గొననున్నారు.

  • 'జనాలెవ్వరూ..ఆ​ సెంటర్లకు వెళ్లొద్దు'

Harish Rao Comments: సిద్దిపేట జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రేడియాలజీ హబ్​ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు పెంచే కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా ఆసుపత్రిలో టీ డయాగ్నోస్టిక్ హబ్, రేడియాలజీ హబ్ ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎవ్వరూ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లొద్దని మంత్రి సూచించారు.

  • ఎమ్మెల్సీ డ్రైవర్​ హత్య కేసులో మరో ట్విస్ట్​

Driver Subrahmaniam murder case: ఏపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. హత్య జరిగిన అపార్ట్​మెంట్​ వద్ద సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో అక్కడ గొడవ జరిగినట్లు ఎలాంటి దృశ్యాలు నమోదు కాలేదు. మరోవైపు అక్కడ పని చేస్తున్న వాచ్​మెన్ సైతం​ అపార్ట్​మెంట్​ వద్ద ఎలాంటి గొడవ జరగలేదని చెబుతున్నారు. ఈ పరిణామాలతో డ్రైవర్​ హత్య కేసు మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది.

  • ఉమ్రాన్ కోసం తండ్రి త్యాగం

Umran Malik: ఐపీఎల్​లో సత్తా చాటిన సన్​రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్​కు టీమ్ ఇండియాలో చోటు దక్కడంపై అతని తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. తన కుమారుడ్ని ఏనాడూ తనలా కూరగాయలు అమ్మాలని కోరుకోలేదని, అందుకే షాపు వైపు కూడా రానివ్వలేదని పేర్కొన్నారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని ఉమ్రాన్​కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు.

  • సుప్రీంలో క్రికెటర్ వ్యాజ్యం.. మాకేం తెలీదన్న జడ్జి!

Cricket cut off age SC: దేశవాళీ టోర్నీలలో వయసు నిర్ధరణకు ప్రస్తుతం పరిగణిస్తున్న కటాఫ్ తేదీని మార్చాలని ఓ అండర్ 19 క్రికెటర్ సుప్రీంను ఆశ్రయించారు. అయితే, ఈ పిటిషన్​ను తోసిపుచ్చిన సుప్రీం.. సంబంధిత అధికారులను కలవాలని సూచించింది.

  • ఐదేళ్ల తర్వాత భారత్​కు..!

Justin Bieber India tour: హాలీవుడ్​ పాప్​ సింగర్​, గ్రామీ అవార్డు విజేత జస్టిన్​ బీబర్​.. త్వరలోనే భారత్​కు రానున్నారు. దిల్లీలోని ఓ స్డేడియానికి చేరుకుని ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని తెలిపిన బుక్​ మై షో.. జూన్​ నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details