తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @7PM - టాప్​న్యూస్ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7pm topnews
7pm topnews

By

Published : Jul 21, 2022, 7:00 PM IST

  • భారీ ఆధిక్యంలో ద్రౌపదీ ముర్ము- రెండో రౌండులో ఎన్ని ఓట్లంటే...

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్​లో ఆంధ్రప్రదేశ్​ సహా మొత్తం 10 రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల ఓట్లు(1138 ఓట్లు, 1,49,575 విలువ) లెక్కించారు. ముర్ముకు 809 ఓట్లు(విలువ 1,05,299) దక్కాయి. సిన్హాకు 44,276 విలువైన 329 ఓట్లు పడ్డాయి.

  • ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదు: హైకోర్టు

వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని తెలిపింది.

  • చంద్రబాబు పర్యటనలో పడవ ప్రమాదం..

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కోనసీమ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. పడవలో వెళ్తున్న తెదేపా నాయకులు నీటిలో పడిపోయారు. వెంటనే స్థానికులు, మత్య్సకారులు వారిని పడవలోకి చేర్చారు. చంద్రబాబు ఆ సమయంలో మరో పడవలో ఉన్నారు.

  • కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదు.. కేంద్రం స్పష్టం

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా అర్హత లేదని కేంద్రం స్పష్టం చేసింది. కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు కూడా లేవని కేంద్ర జలశక్తిశాఖ వెల్లడించింది. జాతీయ ప్రాజెక్టు పథకం కింద చేర్చడానికి కాళేశ్వరానికి అర్హత లేదని కేంద్రం పేర్కొంది.

  • పోలవరంపై మరోసారి అధ్యయనం చేయాలి: పువ్వాడ

ఈ ఏడాది గోదావరి వరద వల్లనే ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాల ముంపునకు గురైనట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్​లో ఆయన మాట్లాడారు. పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణంతో భద్రాద్రి రామయ్య కూడా మునిగిపోతాడని పువ్వాడ అజయ్ తెలిపారు.

  • వరద వదిలినా.. బురద వదలలేదు..!

మంత్రపురిగా పేరొందిన మంథనిలో వరద.. ప్రజలకు తీరని కష్టం మిగిల్చింది. ఇళ్లు, దుకాణాల్లోకి చొచ్చుకు రావటంతో భారీ నష్టం వాటిల్లింది. ప్రస్తుతం నీరు తొలగిపోయినప్పటికీ.. వరద గాయాలు మానలేదు. తమకు నిలువనీడ లేని పరిస్థితి తలెత్తిందంటూ బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

  • మమత ట్విస్ట్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు టీఎంసీ దూరం.. అదే కారణం!

కాంగ్రెస్​ సహా ఇతర విపక్షాలకు షాక్ ఇచ్చింది తృణమూల్ కాంగ్రెస్. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తమ పార్టీ దూరంగా ఉంటుందని ప్రకటించింది.

  • డిప్యూటీ కలెక్టర్​కు చేదు అనుభవం.. నడిరోడ్డుపై చితకబాదిన భార్యాభర్తలు

రోడ్డుపై బైక్​ను జాగ్రత్తగా నడపమని చెప్పిన డిప్యూటీ కలెక్టర్​ను భార్యాభర్తలు రోడ్డుపైనే చితకబాదారు. మధ్యప్రదేశ్​లోని మంద్​సౌర్​లో జరిగిందీ ఘటన.

  • సింధు పసిడి కల నెరవేరేనా? 'మిక్స్‌డ్' టైటిల్ భారత్​​ నిలబెట్టుకునేనా?

ఇంగ్లాండ్​లోని బర్మింగ్​హామ్​ వేదికగా జరగనున్న కామన్​వెల్త్​ గేమ్స్​లో సత్తా చాటేందుకు పీవీ సింధుతోపాటు భారత స్టార్​ షట్లర్లు సమాయత్తమవుతున్నారు. గతంలో కంటే ఎక్కువ పతకాలు సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు.

  • భారీ కటౌట్స్‌, డ్యాన్స్‌లు.. ట్రైలర్‌ వేడుకలో కేక పుట్టించిన 'లైగర్'​​ ఫ్యాన్స్

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్‌' సినిమా ట్రైలర్​ అదిరిపోయింది. ట్రైలర్ విడుదల నేపథ్యంలో విజయ్​ ఫాన్స్​ కేక పుట్టించారు. భారీ కటౌట్స్‌, డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ట్రైలర్​ రిలీజ్​ సందర్భంగా విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ABOUT THE AUTHOR

...view details