తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS

By

Published : Jul 19, 2022, 6:58 PM IST

  • జగన్‌తో చర్చించి ఐదు గ్రామాలు ఇప్పించలేరా?: పువ్వాడ అజయ్

ఏపీ మంత్రులు బొత్స, అంబటి రాంబాబు వ్యాఖ్యలు బాధాకరమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. నా మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదని ఏపీ మంత్రులకు సూచించారు. హైదరాబాద్‌ ఇస్తారా అని బొత్స అనటం.. అసందర్భం, అర్థరహితమని స్పష్టం చేశారు.

  • 5 గ్రామాలు ఇవ్వమంటే భద్రాచలం మాది అంటాం.. ఇస్తారా ?: ఏపీ మంత్రి అంబటి

పోలవరం ప్రాజెక్టుతోనే భద్రాచలానికి ముంపు పొంచి ఉందని మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై పువ్వాడకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స కౌంటర్ ఇవ్వగా.. తాజాగా ఆ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

  • 'ఇన్ని రోజులు మీరు ఏం చేస్తున్నారు..?'

మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పందించారు. వరదలకు కారణం పోలవరం ఎత్తు పెంచటమేనని మంత్రి చెప్పిన మాటలు నమ్మాలా..? విదేశాల కుట్రతో క్లౌడ్​ బరస్ట్​ కావటం వల్లేనన్న ముఖ్యమంత్రి మాటలు నమ్మాలా..? అంటూ ప్రశ్నించారు.

  • 'కొవిడ్, స్వైన్‌ఫ్లూలాగే మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉండాలి..'

దేశంలో రెండు మంకీపాక్స్ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల అధికారులకు మంకీ పాక్స్ లక్షణాలపై అవగాహన కల్పించటంతో పాటు... ఇతర దేశాల నుంచి వచ్చేవారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తోంది.

  • మున్సిపల్ సిబ్బందిపై దాడి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆక్రమణలు తొలగిస్తుండగా ఓ దుకాణదారుడు ఒక్కసారిగా మున్సిపల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. మున్సిపల్ కమిషనర్, పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరగడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

  • 'లోదుస్తులన్నీ ఓకే చోట.. చున్నీ కూడా లేదు'..

కేరళలో నీట్ పరీక్ష వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. విద్యార్థులు తమకు ఎదురైన అవమానకరమైన అనుభవాలను 'ఈటీవీ భారత్'​తో పంచుకున్నారు. మరికొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. మరోవైపు, కళాశాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది.

  • చిన్నారిపై ఆరేళ్లుగా తండ్రి, బాబాయి రేప్..

బంగాల్​లో దారుణం జరిగింది. బాలికపై తండ్రి, బాబాయి కలిసి ఆరేళ్లుగా అత్యాచారం చేస్తున్న ఘటన ఆలస్యంగా బయటపడింది. మరోవైపు, అత్యాచారాన్ని తప్పించుకునేందుకు భవనం పైనుంచి దూకేసింది ఓ బాలిక.

  • అగ్నిపథ్​కు 'కులం' చిచ్చు!..

తీవ్ర వ్యతిరేకత మధ్య అమలులోకి వచ్చిన అగ్నిపథ్​పై మరోసారి రాజకీయ దుమారం చెలరేగింది. అగ్నివీరుల నియామకంలో కులానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు భాజపా నేత ఒకరు సహా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్​నాథ్​ ఈ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు.

  • నుపుర్​ శర్మకు ఊరట..

భాజపా మాజీ నేత నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆమెపై ఆగస్టు 10వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది. తనపై నమోదైన కేసులను ఒకే కోర్టుకు మార్చాలని నుపుర్ దాఖలు చేసిన పిటిషన్​పై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది సుప్రీం.

  • ఆసియా గేమ్స్​ రీషెడ్యూల్​ తేదీలు ఖరారు

వాయిదా పడిన 2022 ఆసియా గేమ్స్‌ రీషెడ్యూల్​ తేదీలను ప్రకటించింది ఒలింపిక్​ కౌన్సిల్​ ఆఫ్ ఆసియా. 2023 సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్​ 8 వరకు నిర్వహించబోతున్నట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details