తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS

By

Published : Jul 17, 2022, 6:58 PM IST

  • కేసీఆర్​ "క్లౌడ్​ బరస్ట్​" కథేంటీ..? ఇది ఆ దేశం పనేనా..?

"క్లౌడ్ బరస్ట్" (Cloudburst)అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. కుండపోత వర్షాలకు ఏవో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. కేసీఆర్‌ చేసిన ప్రకటన సంచలనాత్మకమైంది. గతంలోనూ జమ్మూకశ్మీర్‌లోని లేహ్, లద్దాఖ్‌.. ఉత్తరాఖండ్‌లో ఇలా చేశారని గుర్తుచేశారు.

  • వరద బాధితులకు సీఎం కేసీఆర్​ పరామర్శ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్​ పర్యటన కొనసాగుతోంది. మొదట భద్రాచలంలో పర్యటించిన సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్​లో ఏటూరునాగారంలోని రామన్నగూడెంకు చేరుకున్నారు. వరద బాధితులను పరామర్శించారు.

  • ఇవీ చాలా సిల్లీ కామెంట్స్​: ఉత్తమ్​

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అంటున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి ఆరోపించారు. అంతర్జాతీయ కుట్రతో వరదలు వచ్చాయనడంలో అర్థం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు.

  • 'కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వరా..'

ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్​పై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఉన్న శ్రద్ధ.. ఇలాంటి సమయంలో కనబడదా అని నిలదీశారు. మూడు రోజులుగా వరద నీటిలో నానుతున్నామని.. కనీసం మంచినీళ్లు అయిన సక్రమంగా పంపిణీ చేయలేదని బాధితులు మంత్రిని నిలదీశారు.

  • గూడు చెదిరి.. గుండె పగిలి.. విలవిలలాడిన లంక గ్రామాలు

సాధారణంగా లంక ప్రజలు వరదలను పెద్దగా లెక్కచేయరు. తరతరాలుగా గోదావరి గట్లని ఆనుకొనే నివాసాలు.. అక్కడే సాగు.. వాటికి అనుసంధానంగా పాడి పశువులు పెంచుతూ.. పట్టణ వాతావరణానికి కాస్త దూరంగానే ఉంటారు.

  • రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం..

భారతదేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు సహా వివిధ రాష్ట్రాల శాసనసభల్లో పోలింగ్ జరగనుండగా పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. ఉదయం 8గంటలకు..మాక్ పోలింగ్ జరగనుండగా ఆ తర్వాత 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.

  • విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫు ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా(80) ఎంపికయ్యారు. ఈ మేరకు అల్వాను బరిలోకి దించనున్నట్లు ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు.

  • పుల్వామాలో ఉగ్రదాడి..

భద్రతా విధుల్లో ఉన్న సీఆర్​పీఎఫ్​ జవాన్లపై ముష్కరులు కాల్పులు జరిపారు. జమ్ముకశ్మీర్​లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఏఎస్​ఐ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో మృతి చెందారు.

  • 'ప్రీ- డయాబెటిక్' అంటే ఏంటి?..

చిన్న వయసు వారి నుంచి పెద్దల వరకూ మధుమేహం సమస్య అందరికీ సాధారణమైపోయింది. ఈ వ్యాధి రాకముందే ప్రీ డయాబెటిక్​ దశలో వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో చూద్దాం.

  • హీరో యశ్​పై ఫిర్యాదు​!.. బ్యాడ్​ గాయ్​ అని ఏడుస్తూ..

కన్నడ రాకింగ్ స్టార్​ యశ్​కు సంబంధించిన సోషల్​మీడియాలో ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ఇందులో యశ్​ను ఉద్దేశిస్తూ.. ఆయన బ్యాడ్​ గాయ్​ అని ఒకరు కన్నీరుపెట్టుకుంటూ చెప్పారు. ఇంతకీ అలా అన్నదెవరంటే?

ABOUT THE AUTHOR

...view details