ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు75 అడుగులు దాటితే 50 ఏళ్ల రికార్డు బ్రేక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. 1976 నుంచి 2022 వరకు గోదావరి నీటిమట్టం వివరాలు ఎలా ఉన్నాయో కింది కథనం చదివి తెలుసుకుందాం.బాసర ఆర్‌జీయూకేటీ విద్యార్థులకు అస్వస్థతబాసర ఆర్‌జీయూకేటీ విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. ఆర్‌జీయూకేటీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అత్యవసరంగా క్యాంపస్‌లోనే విద్యార్థులకు చికిత్స చేస్తున్నారు. పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థులు అస్వస్థత చెందారు. యానాంను ముంచెత్తిన వరద.. గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంను గోదావరి జలాలు ముంచెత్తాయి. ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 20 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలటంతో.. యానాంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అమిత్‌షా.. నేరుగా ఆయనకే ఫోన్..!జగిత్యాల జిల్లా ఎర్దండిలో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై జరిగిన దాడిని కేంద్రమంత్రి అమిత్‌షా ఖండించారు. స్వయంగా అర్వింద్‌కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్లాన్ ప్రకారమే తనపై దాడి చేశారని అర్వింద్ అమిత్ షాకు వివరించారు.రోజాకు నిరసన సెగ.. పార్టీని నమ్ముకుంటే ఇలా చేస్తారా..? ఏపీ మంత్రి రోజాకు సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తాకింది. అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు రాలేదంటూ ఓ మాజీ సర్పంచ్ రోజాను నిలదీశారు. పార్టీని నమ్ముకుంటే అప్పుల పాలు చేశారంటూ వాపోయారు.టెన్త్ క్లాస్ విద్యార్థినిపై కారులో గ్యాంగ్ రేప్పదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసి.. ఆపై కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది. మరోవైపు, లవర్‌తో మాట్లాడుతున్నందుకు కుమార్తెను గొంతు కోసి చంపేశాడు ఆమె తండ్రి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.'మనం భూమ్మీద ఉన్నదే పిల్లల్ని కనడానికి'.. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్(76) తనకు సంబంధించిన ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. తన 35 ఏళ్ల కూతురుతో (రెండో భార్య కుమార్తె) సహజీవనం చేసినట్లు, ఆమెతో ఓ బిడ్డను కూడా కన్నట్లు ఎరోల్ మస్క్ తాజాగా వెల్లడించారు. 'మనం భూమి మీద ఉన్నదే పిల్లల్ని కనడానికి' అంటూ చెప్పుకొచ్చారు.ఎస్బీఐ రుణాలు మరింత భారం.. వడ్డీ రేట్లు పెంపుఎస్బీఐలో రుణాలు మరింత భారం కానున్నాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును పది బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ ఆ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. సవరించిన రేట్లు జులై 15 నుంచే అమలవుతాయని పేర్కొంది.కోహ్లీకి ఒకరు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు: రోహిత్ విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. కోహ్లీ లాంటి ఆటగాడికి ఒకరు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు.హాలీవుడ్ రేంజ్‌లో అఖిల్ 'ఏజెంట్' టీజర్అఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా 'ఏజెంట్'. ఈ మూవీ టీజర్‌ను శుక్రవారం విడుదలైంది. హాలీవుడ్ రేంజ్‌లో.. ఉన్న టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.