తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

By

Published : Jul 25, 2021, 6:21 AM IST

Updated : Jul 25, 2021, 7:56 PM IST

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

19:51 July 25

టాప్​ న్యూస్​ @8PM 

  • దేశంలోనే ప్రత్యేకమైంది

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు.

  • ఏడాదిలో 5 గంటలే!

దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి.. వాటిలో కొన్ని ఏడాది పొడవునా తెరిచి ఉంటే.. మరికొన్నింటిలో కొన్నినెలలే భగవంతుడి దర్శనానికి అనుమతిస్తారు. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని ఓ దేవాలయంలో మాత్రం ఏడాదిలో కేవలం ఐదు గంటలు మాత్రమే గుడి తలుపులు తెరుచుకుంటాయట. మరి ఆ గుడి విశేషాలేంటో చూద్దాం.

  • సుప్రీం కోర్టుకు రాజ్యసభ ఎంపీ​

పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు పెగాసస్​పై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత పీ చిదంబరం డిమాండ్​ చేశారు.

  • ఏం జరుగుతోంది?

సీఎం పదవి నుంచి బీఎస్​ యడియూరప్ప వైదొలుగుతారనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. యడియూరప్ప సమర్థంగా పని చేశారని పేర్కొన్నారు. ఆయన ప్రతి అంశాన్ని తన పద్ధతిలో పరిష్కరిస్తున్నారని కితాబిచ్చారు.

  • టాస్​ గెలిచిన శ్రీలంక

ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్న తొలి టీ20లో టాస్​ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. వన్డే సిరీస్​ గెలిచిన ఊపులో టీమ్ఇండియా ఉండగా.. చివరి వన్డే విజయంతో లంక ఆటగాళ్లు పోరుకు సై అంటున్నారు.


 

18:49 July 25

టాప్​ న్యూస్​ @7PM

  • కాకతీయ వారసత్వానికి ప్రతీక రామప్ప ఆలయం: ప్రధాని

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు పొందడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రామప్ప ఆలయాన్ని సందర్శించాలని సూచించారు. కాకతీయ వారసత్వానికి ప్రతీక రామప్ప ఆలయమని కొనియాడారు.

  • బిగుస్తున్న ఉచ్చు!

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన రాజ్​కుంద్రా(Raj Kundra news)కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన దగ్గర పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమయ్యారు.

  • బంగారు మరుగుదొడ్డి

ఓ ట్రాఫిక్​ పోలీసు నివాసం బంగారంతో ధగధగా మెరిసిపోయింది. రష్యాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలతో రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలకు మైండ్​ బ్లాంక్​ అయ్యే దృశ్యాలు కనిపించాయి. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో టాయిలెట్​ తెరిచి చూడగా సీటు అంతా పుత్తడితో కట్టి ఉంది. దానిని చూసిన వారు అవాక్కయారు.

  • షూటింగ్​లో మళ్లీ నిరాశ

ఆదివారం జరిగిన షూటింగ్ పోటీల్లోనూ భారత్​కు నిరాశ తప్పలేదు. మహిళల 10 మీటర్ల ఎయిర్​ పిస్టల్ విభాగంలో మను బాకర్, యశస్విని దేస్వాల్.. వరుసగా 12,13 స్థానాల్లో నిలిచారు. దీంతో కచ్చితంగా పతకం వస్తుందనుకున్న విభాగంలో నిరాశే ఎదురైంది.  

  • ఐపీఎల్​ షురూ..!

ఐపీఎల్​ 2021.. యూఏఈ వేదికగా సెప్టెంబర్​ 19న తిరిగి ప్రారంభం కానుంది. రెండో దశలో తొలి మ్యాచ్​ ముంబయి ఇండియన్స్​- చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య జరగనుందని తెలుస్తోంది.

17:51 July 25

టాప్​ న్యూస్​ @6PM 

  • రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుర్తింపు రానే వచ్చింది. శిల్పకళాఖండాలకు నిలయమైన రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. వారసత్వ కట్టడాల ప్రత్యేకతలను పరిశీలించేందుకు... చైనా, ప్యారిస్​లు వేదికగా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ప్రతినిధులంతా... రామప్ప ఆలయ విశిష్టతలను చూసి అచ్చెరువొందారు. ప్రపంచ పర్యాటకులు చూడదగ్గ ప్రదేశంగా భావించారు. తమ ఓట్లతో రామప్ప ఖ్యాతిని మరింత పెంచుతూ... ప్రపంచ వారసత్వ గుర్తింపునిచ్చారు.

  • మాలిక్​కు స్వర్ణం

రెజ్లర్​ ప్రియా మాలిక్​ పసిడి పతకం దక్కించుకుంది. ప్రత్యర్థి క్సేనియా పటాపోవిచ్​పై.. హంగేరీ వేదికగా జరిగిన ప్రపంచ క్యాడెట్​ ఛాంపియన్​షిప్స్​లో 5-0తో విజయం సాధించింది.

  • బంగారు మరుగుదొడ్డి

ఓ ట్రాఫిక్​ పోలీసు నివాసం బంగారంతో ధగధగా మెరిసిపోయింది. రష్యాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలతో రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలకు మైండ్​ బ్లాంక్​ అయ్యే దృశ్యాలు కనిపించాయి. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో టాయిలెట్​ తెరిచి చూడగా సీటు అంతా పుత్తడితో కట్టి ఉంది. దానిని చూసిన వారు అవాక్కయారు.

  • ఎన్నికల కోసమే దళితబంధు

హుజూరాబాద్​ ఉప ఎన్నిక కోసమే సీఎం కేసీఆర్​ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని నల్గొండ ఎంపీ ఉత్తమ్​కుమార్​ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్​నగర్​లో కాంగ్రెస్​పార్టీ మఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

  • కప్పా వేరియంట్ కలకలం

దేశంలో రెండో దశ కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ గుజరాత్​లో కప్పా రకం వైరస్​ కలకలం సృష్టించింది. రాష్ట్రంలో కొత్తగా 5 కేసులు వెలుగుచూశాయి. ఒకరు మరణించారు.


 

16:42 July 25

టాప్​ న్యూస్​ @5PM 

  • ఎన్నికలొస్తేనే హామీలు..

భాగ్యనగరంలో లష్కర్​ బోనాలు(Lashkar Bonalu) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. ఈ రోజు ఉదయం 4గంటలకు ఉత్సవాలు ప్రారంభం కాగా.. ఇప్పటివరకు పలువురు ప్రముఖులు మహంకాళిని దర్శించుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay)​ అమ్మవారిని దర్శించుకున్నారు.

  • దూసుకొచ్చిన బండరాళ్లు..

కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం హిమాచల్​ ప్రదేశ్​లో జరిగింది.

  • చోటు కష్టమే

లంకతో వన్డే సిరీస్​లో మనీశ్​ పాండే, హర్దిక్​ పాండ్య పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డాడు సెహ్వాగ్​. ఇక మనీశ్​ పాండేకు వన్డే జట్టులో చోటు దక్కకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.

  • ఓటమి

టోక్యో ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 1-7 తేడాతో మన్​ప్రీత్​ సేన ఓటమి పాలైంది.

  • ఈ వారం విడుదల కానున్న చిత్రాలివే..

అభిమానుల ఆనందాన్ని పెంచేందుకు మరికొన్ని సినిమాలు, షార్ట్​ ఫిలిమ్స్​.. ఓటీటీలో విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో మిమీ చిత్రంతో పాటు పలు వెబ్ సిరీస్​లు కూడా ఉన్నాయి. వాటి గురించి మీరూ చూసేయండి.



 


 

15:44 July 25

టాప్​ న్యూస్​ @4PM 

  • ట్రాక్టర్ కోసం దరఖాస్తు చేస్తే..

డిగ్రీ చదివిన యువకుడు ఆ తర్వాత ఉద్యోగంలో చేరాలనుకున్నాడు. కానీ ఏ ఉద్యోగం దొరకక చివరకు నిరుద్యోగిగా మారాడు. అమ్మానాన్నలకు భారం కాకూడదని.. వారికి ఆసరాగా నిలవాలనుకున్నాడు. ఏదో ఒక పని చేసి వారికి చేదోడవుదామనుకుని.. గిరిజన కార్పొరేషన్​లో ట్రాక్టర్ కోసం రుణానికి దరఖాస్తు చేసుకున్నాడు. రుణం మంజూరయింది. కానీ అతనికి వచ్చింది ట్రాక్టర్​ కాదు.. మేకలు.

  • ఏలూరు కార్పొరేషన్‌ వైకాపాదే..

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైకాపా 20, తెదేపా 2 డివిజన్లలో విజయం సాధించాయి. కార్పొరేషన్‌లో 50డివిజన్లు ఉండగా.. ఇప్పటికే 3 డివిజన్లలో వైకాపా ఏకగ్రీవమైంది. మార్చి 10న 47 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. వైకాపా 47, తెదేపా 43, జనసేన 19, భాజపా 14, స్వతంత్రులు 39 స్థానాల్లో పోటీ పడ్డారు.

  • టీకా కోసం

మహారాష్ట్ర ముంబయిలో కొవిడ్​ టీకా తీసుకునేందుకు అక్కడి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ధారావిలోని ఓ టీకా పంపిణీ కేంద్రం వద్ద.. ఆదివారం భారీ రద్దీ నెలకొంది. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా, రోడ్ల పొడవునా భారీ క్యూలో నిల్చుని, టీకా కోసం ప్రజలు ఎదురు చూశారు.

  • మోదీ ప్రశంసలు..

'మన్ కీ బాత్'​ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం మాట్లాడారు. ఏపీ వెదర్ పేరుతో వాతావారణ సమాచారాన్ని అందిస్తున్న సాయి ప్రణీత్​ను ప్రశంసించారు. రైతులకు ఆ సమాచారం ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.

  • క్యూ1 ఫలితాలు

కార్పొరేట్ల త్రైమాసిక క్యూ1 ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. వీటితో పాటు కరోనా కేసులు, వ్యాక్సినేషన్ వార్తలు మార్కెట్లకు సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.


 

14:42 July 25

టాప్​ న్యూస్​ @3PM 

  • తగ్గిన వరద ఉద్ధృతి

ఎగువన రెండ్రోజులుగా వర్షాలు లేకపోవడం వల్ల శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఇన్‌ఫ్లో తగ్గడంతో ఎస్సారెస్పీ ప్రధాన గేట్లు మూసివేశారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈనెల 22న రికార్డు స్థాయిలో వరద వచ్చింది.

  • సింధు, మేరీకోమ్ జోష్

ఆదివారం జరిగిన ఒలింపిక్స్​ పోటీల్లో షట్లర్ పీవీ సింధు, టేబుల్​ టెన్నిస్​ ప్లేయర్ మనికా బత్రా మెరిశారు. బాక్సింగ్​లో మేరీ కోమ్​ ప్రిక్వార్టర్స్​కు వెళ్లింది. మరోవైపు సానియా మీర్జా, షూటర్లు ఓటమిపాలై నిరాశపరిచారు.

  • ముక్కుకు తెలుసు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ కోట్లాది మందికి సోకినా.. అందులో కొంత మంది మాత్రమే తీవ్రంగా ప్రభావితమయ్యారు. అలా జరిగేందుకు కారణాలు ఏమిటి? ఎవరిపై ఇలాంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? అనే విషయంపై శాస్త్రవేత్తలు ఇటీవల ఓ పరిశోధన చేశారు. ఆ పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి.

  • పేలుడు కలకలం

వికారాబాద్ జిల్లా పెద్దేముల్​లోని ఓ ఇంటిముందు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన స్థానికులు వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

  • తెరాస ఎంపీపై కేసు

రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్​పై వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్​లో కేసు నమోదయింది. అల్లూరి ట్రస్టు కార్యదర్శి, ట్రస్టీగా పని చేస్తున్న ప్రకాశ్​తో పాటు మరో ఇద్దరు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


 

13:44 July 25

టాప్​ న్యూస్​ @2PM 

  • పోటెత్తిన భక్తులు 

బంగారు బోనాలు(Lashkar Bonalu).. పోతురాజు విన్యాసాలు.. సాంప్రదాయదుస్తుల్లో ముత్తైదువులు.. ప్రముఖుల సందర్శనలు.. పోటెత్తుతున్న భక్తులతో.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. కరోనా నిబంధనల మధ్య బోనాల పండుగ అంబరాన్నంటుతోంది. భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

  • 'నేషన్​ ఫస్ట్​.. ఆల్వేస్​ ఫస్ట్​' 

టోక్యో ఒలింపిక్స్​లో భారత అథ్లెట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. మనసులో మాట 79వ ఎడిషన్​లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. కార్గిల్​ యుద్ధంతో భారత సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయన్నారు.

  • వర్క్​ ఫ్రం వెడ్డింగ్​!

కరోనా పుణ్యమా అని చాలావరకు సాఫ్ట్​వేర్ సంస్థలు ఇంటి నుంచి పని(వర్క్​ ఫ్రం హోం) విధానాన్ని అనుసరిస్తున్నాయి. అయితే పెళ్లిమండపంలో ఓ వరుడు ల్యాప్​టాప్​ ముందేసుకుని సీరియస్​గా పనిచేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అప్పుడు.. వధువు రియాక్షన్​ చూస్తే నవ్వు ఆపుకోలేరు.

  • ఫోన్​ మాట్లాడారని.. 

ఫోన్​లో మాట్లాడుతున్నారని.. ఇద్దరు బాలికలపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాలల సంరక్షణ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేశారు. గుజరాత్‌లోని దహోడ్‌లో ఈ ఘటన జరిగింది.

 

  • దూసుకెళ్లిన టీమ్​ఇండియా

శ్రీలంక- టీమ్​ఇండియా మధ్య జరిగిన వన్డే సిరీస్​ తర్వాత ఐసీసీ ప్రపంచకప్​ సూపర్​ లీగ్​ (ICC Super League) పాయింట్ల పట్టికలో పలు జట్ల ర్యాంకింగ్స్​ మారిపోయాయి. ఏ జట్లు ఏయే స్థానాల్లో ఉన్నాయంటే?

12:37 July 25

టాప్​ న్యూస్​ @1PM 

  • పైకి తేలింది.. 

కాళేశ్వరం బ్యారేజీలో భాగంగా నిర్మించిన సరస్వతి పంప్ హౌస్ వద్ద పైపులైన్(PipeLine) పైకి తేలింది. ప్రాజెక్టులోకి భారీ వరద చేరడం వల్లే ఇలా జరిగిందని అధికారులు భావిస్తుండగా.. నాణ్యత లోపమే కారణమని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  • అంతులేని ఆఖరి కథ

కర్ణాటక అధికార పార్టీలో నాయకత్వ మార్పు, ముఖ్యంగా యడియూరప్పను సీఎం కుర్చీ నుంచి తొలగిస్తారని ఏడాది కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం అని ఆయన ప్రకటించేశారు. రాజీనామా చేయాలని అధిష్ఠానం సూచిస్తే తన నిష్క్రమణపై సోమవారం కీలక ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు 'ఆదివారం సాయంత్రంలోగా పార్టీ అధిష్ఠానం నుంచి సలహా వస్తుందని ఆశిస్తున్నా' అని ఆయన వ్యాఖ్యానించడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.

  • ఇక రాజస్థాన్​ వంతు 

పార్టీలో అంతర్గత విభేధాలపై కాంగ్రెస్​ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇటీవలే పంజాబ్​లో వర్గ పోరుకు స్వస్తి పలికింది. ఇప్పుడు రాజస్థాన్​లోను సీఎం గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలకు తెరదించేందుకు ఆదివారం కీలక భేటీ నిర్వహించనుంది. ఆ రాష్ట్రంలో కేబినెట్‌ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

టీసీఎస్​, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్ టెక్​​​ వంటి కంపెనీలు ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాలను ప్రకటించాయి. అయితే వాటికి అర్హులు ఎవరు? ఫ్రెషర్స్​తో పాటు ఎక్స్​పీరియన్స్ ఉన్న​ వాళ్లకు అవకాశాలు ఉన్నాయా? ఏ కోర్సులు చేసినవారికి ప్రాధాన్యం? ప్యాకేజీలు ఎలా ఉంటాయి? అనే వివరాలు తెలుకుందాం.

  • కట్టెల మోతతో మొదలై.. 

మీరాబాయి చాను.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు. టోక్యో ఒలింపిక్స్​లో వెండి గెలుచుకున్న ఈ మణిపురి వెయిట్​లిఫ్టర్(Tokyo olympics Meerabai chanu)​.. విశ్వక్రీడల్లో భారత పతకాల పట్టికను తెరిచింది. గత రియో ఒలింపిక్స్​లో కనీస ప్రదర్శన ఇవ్వలేక చతికిలపడిన మీరా.. ప్రస్తుతం ఈ ఘనత సాధించడం వల్ల కోట్లాదిమంది ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే దీని వెనక మీరా అసాధారణ కృషి దాగి ఉంది. దాని గురించే ఈ కథనం..

11:43 July 25

టాప్​ న్యూస్​ @12PM 

  • రైస్​ ఏటీఎం 

హైదరాబాద్‌ నగరంలో ఎటువైపు వెళ్లినా ఏటీఎమ్‌లు కనిపిస్తాయి. కానీ ఎల్బీనగర్‌ ప్రాంతంలోని రాక్‌టౌన్‌ కాలనీలో మాత్రం వాటికి భిన్నమైన ఏటీఎమ్‌ ఒకటి దర్శనమిస్తుంది. ఈ ఏటీఎమ్‌లో బియ్యం లభిస్తాయి. వీటిని తీసుకోవడానికి ఎలాంటి కార్డులూ అక్కర్లేదు. ఆఖరికి తెల్ల రేషన్‌ కార్డు కూడా. కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదల ఆకలి తీర్చడానికి నగరానికి చెందిన దోసపాటి రాము ఏర్పాటుచేసిందే ఈ ‘రైస్‌ ఏటీఎమ్‌’.

  • ఆటగాళ్లకు మద్దతుగా 'విక్టరీ పంచ్' 

టోక్యో ఒలింపిక్స్​లో భారత అథ్లెట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా మద్దతు తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. మనసులో మాట 79వ ఎడిషన్​లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. కార్గిల్​ యుద్ధంతో భారత సైన్యం శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయన్నారు.

  • చిన్నారులకు వినూత్న శిక్షణ

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు పుణె మున్సిపల్ కార్పొరేషన్‌ ఓ సరికొత్త ప్రయోగం చేపట్టింది. భవిష్యత్తులో రహదారి ప్రమాదాలను నివారించేందుకు 12 ఏళ్లలోపు చిన్నారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్, సిగ్నేజ్, క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్స్, ఫుట్‌పాత్‌లు సైకిల్ ట్రాక్‌లను నిర్మించి చిన్నారులకు అనుభవ పూర్వకంగా రోడ్డు భద్రతపై శిక్షణ ఇస్తోంది.

  • టాప్​ టెన్నిస్​ ప్లేయర్లకు నిరాశ 

ఇద్దరు టాప్​ టెన్నిస్​ ప్లేయర్లకు​ నిరాశ ఎదురైంది. మహిళా క్రీడాకారిణి, వింబుల్డన్​ మహిళల సింగిల్స్​ విజేత బార్టీ.. 48వ ర్యాంకర్​ చేతిలో ఓడిపోయింది. మరో స్టార్​ ప్లేయర్​.. ముర్రే విశ్వక్రీడల నుంచి తప్పుకున్నాడు.

  • సాహితీ వరం 

దేశ విభజనలో కుటుంబంలోని అందరూ అమృతసర్‌, దిల్లీ వెళితే, తను మాత్రం ఆయన కన్న కలలను నిజం చేసుకోవడానికి బాలీవుడ్‌ చిత్రపరిశ్రమ పరిఢవిల్లుతున్న నాటి బొంబాయికి చేరాడు. బతుకుతెరువు కోసం ఓ మెకానిక్‌ షెడ్‌లో చేరాడు. అక్షర తూణీరం ఏఏ బతుకు మనసు మూలల్లోకి వెళ్లగలదో అక్కడి జీవితాలను, అక్కడి భావావేశాలను కాగితాలపై రచనలుగా వెళ్లబోశాడు. ఆయనే గుల్జార్ సాహెబ్.

10:39 July 25

టాప్​ న్యూస్​ @11AM 

  • శాంతించిన గోదావరి 

ఎగువ నుంచి వచ్చే భారీ వరదతో రెండు రోజులుగా భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి... ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ ఉదయం మూడు అడుగుల నీటిమట్టం తగ్గి ప్రస్తుతం 45.3 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

  • పెరిగిన కరోనా కేసులు 

దేశంలో కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 39,742 మందికి వైరస్ సోకగా 39,972 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 535 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • ఇంకెన్నాళ్లు వర్క్​ ఫ్రం హోమ్​

కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ఎత్తివేత, ఆంక్షల సడలింపు వేగవంతమైంది. దీంతో ఆయా రంగాలు ఒక్కొక్కటిగా పూర్తిస్థాయిలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. పోస్ట్ కొవిడ్ పరిస్థితుల్లో ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోనివి ఐటీ కంపెనీలే. రీఓపెన్ దిశగా అడుగులేస్తోన్న ఐటీ కంపెనీలకు.. కొవిడ్ థర్డ్ వేవ్, డెల్టా వేరియంట్ విజృంభణ భయాలు వెంటాడుతున్నాయి. సెప్టెంబర్ కల్లా 50 శాతం వర్క్ ఫోర్స్​తో ఆపరేట్ చేద్దామనుకున్న కంపెనీలు తిరిగి పునరాలోచనలో పడుతున్నట్లు తెలుస్తోంది. 

  • మర్మాంగాన్ని కోసి దారుణ హత్య

ప్రేమ వ్యవహారంలో ఓ యువతి సోదరులు క్రూరత్వానికి పాల్పడ్డారు. తన సోదరి ప్రేమించిన వ్యక్తిపై దాడి చేసి, మర్మాంగాన్ని కోసి హత్య చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితుని కుటుంబ సభ్యులు.. అతడి మృతదేహాన్ని నిందితుడి ఇంటి వద్దే దహనం చేశారు.

  • యువ నటికి తీవ్రగాయాలు!

యువ నటికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదంలో తన స్నేహితురాలు ఘటన స్థలంలోనే మరణించారు.

09:48 July 25

టాప్​ న్యూస్​ @10AM 

  • దాడి చేశారు.. ఆపై దోచేశారు.. 

నల్గొండ జిల్లా వాడపల్లిలో దారుణం జరిగింది. పాఠశాలకు సమయానికి రమ్మన్నందుకు కక్ష పెంచుకున్న ఉపాధ్యాయురాలు.. తన భర్తకు చెప్పి ప్రధానోపాద్యాయురాలిపై దాడికి ఉసిగొల్పింది. దాడికి పాల్పడిన వారు అంతటితో ఆగకుండా బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.

  • కాంగ్రెస్​ దళిత దండోరా 

దళిత బంధు పేరుతో సీఎం కేసీఆర్(cm kcr) మోసం చేస్తున్నారని కాంగ్రెస్(congress) ఆరోపించింది. సీఎం కేసీఆర్ అసలు రంగు బయటపెడతామని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేసిన నిధులపై... శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ, జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

  • జనాభా నియంత్రణ సాధ్యమేనా?

జనాభా నియంత్రణపై ఉత్తర్‌ప్రదేశ్‌, అసోం రాష్ట్రాల తాజా నిర్ణయాలతో దేశంలో మరోసారి జనాభా చర్చనీయాంశంగా మారింది. నిరక్షరాస్యత, పేదరికం, వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వంటి మూడు అంశాలు సంతానం పెరిగేందుకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. వీటిని నియంత్రించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్య, ఆర్థిక అభ్యున్నతి, మహిళా సాధికారత వంటివే ఈ విషయంలో మేలైన ఫలితాల్ని ఇస్తాయని నిర్దుష్టంగా చెప్పవచ్చు. 

  • దేశానికే తలమానికం 

ఒలింపిక్స్‌లో రజతాన్ని గెల్చుకుని దేశం గర్వపడేలా చేసిన మీరాబాయి చానుని గుర్తించి, అర్థం చేసుకుని శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దిన తొలి గురువు అనితాచాను. అయితే ఆమెలో స్ఫూర్తిని నింపిన మరో గురువు కుంజరాణీ దేవి..

  • వంటింట్లో ఎక్స్​పర్ట్స్​

తమ చేస్తున్న రంగాల్లో అత్యుత్తమంగా నిలిచి, ఎంతోపేరు తెచ్చుకున్న పలువురు ప్రముఖులు.. వంటింట్లోనూ అద్భుతాలు చేస్తున్నారు! ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా వెల్లడించారు. ఇంతకీ వాళ్లెవరు? ఏయే వంటలు చేస్తున్నారు?

08:45 July 25

టాప్​ న్యూస్​ @9AM 

  • దివ్యాంగ బిడ్డలకు కొండంత ధైర్యం.!

బిడ్డలంటే కలల పంట.. పండంటి సంతానమే అందరి ఆకాంక్ష.. దురదృష్టవశాత్తూ పిల్లలు అవయవలోపాలతో పుడితే? వారి పెంపకం తల్లితండ్రులకు సవాలే. ఎన్ని కష్టాలెదురైనా, కన్నపేగు కాదనుకుంటుందా? వికలమైన మనసును విజయం దిశగా నడిపిస్తుంది. మరింత శ్రద్ధ, పట్టుదలతో శ్రమించేలా ఆ తల్లిదండ్రుల సంకల్పం దృఢమవుతుంది. అలాంటి వారు తమ బిడ్డలు అన్నింటా రాణించాలని శక్తియుక్తులన్నీ ధారపోస్తారు. నేడు తల్లిదండ్రుల దినోత్సవ సందర్భంగా అలాంటి అమ్మానాన్నలపై ప్రత్యేక కథనం.

  • 'ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికే' 

రాజద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) వంటివి రద్దు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ ఆఫ్తాబ్‌ ఆలం, జస్టిస్‌ గోపాలగౌడ, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ మదన్‌ బి.లోకుర్‌ డిమాండ్‌ చేశారు. ఈ చట్టాలు దుర్వినియోగం కాకుండా న్యాయవ్యవస్థే అడ్డుకోవాలని అభిప్రాయపడ్డారు. వీటిని సమీక్షించి, అందులో ఉన్న రాజ్యాంగ వ్యతిరేక అంశాలను కొట్టేయాలని చెప్పారు.

  • అంతరిక్ష వ్యాపారం 

చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ నెల 11న ఒక ప్రైవేటు సంస్థ (వర్జిన్‌ గెలాక్టిక్‌) ప్రయోగించిన రాకెట్‌లో యాత్రికులు భూకక్ష్యలోకి ప్రవేశించారు. ప్రస్తుతం 35,000 కోట్ల డాలర్లుగా ఉన్న అంతరిక్ష వ్యాపార పరిమాణం 2040కల్లా లక్ష కోట్ల డాలర్లకు పెరుగుతుందని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ అంచనా. ఈ వ్యాపారంలో ప్రధాన పోటీదారులు.. ప్రైవేటు కంపెనీలే..

  • పోలీసులపై దాడి

తమ గ్రామస్థుడు కస్టడీలోనే మృతిచెందాడనే ఆగ్రహంతో పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు ప్రజలు. ఈ దాడిలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బిహార్​ జహానాబాద్​లో జరిగింది.

  • రాజమౌళి మెరుపులు 

స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. మరోసారి తెరపై మెరవనున్నారు. హీరోహీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది!

07:41 July 25

టాప్​ న్యూస్​ @8AM 

  • సింధు శుభారంభం

టోక్యో ఒలింపిక్స్​లో భారత స్టార్ షట్లర్​ పీవీ సింధు శుభారంభం చేసింది. ఇజ్రాయెల్​కు చెందిన పోలికర్పోవాను వరుస సెట్లలో ఓడించింది.

  • లష్కర్​ బోనాల వైభవం 

బోనాల ఉత్సవం(Lashkar Bonalu)తో.. భాగ్యనగరం సందడిగా మారింది. తెల్లవారుజాము 4 గంటలకే మంత్రి తలసాని సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే నగర ప్రజలు బోనమెత్తి మహంకాళి ఆలయానికి పోటెత్తుతున్నారు.

  • నిలకడగా నీటిమట్టం 

ఎగువ నుంచి వచ్చే భారీ వరదతో రెండు రోజులుగా భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి(Godavari floods)... ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ ఉదయం రెండు అడుగుల నీటిమట్టం తగ్గి ప్రస్తుతం 46.7 అడుగులకు చేరింది. శనివారం సాయంత్రం నీటిమట్టం 48.30 అడుగులు దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

  • భారత్​, చైనా పోటాపోటీగా.. 

భారత్​, చైనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ రాజుకుంటున్నాయి. తూర్పు లద్దాఖ్​లో ఇరు దేశాలు తమ కార్యకలపాలను విస్తృతం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో కొత్త వైమానిక స్థావరాలను నిర్మించడం, ప్రస్తుతమున్నవాటిని విస్తరించడం వంటి చర్యలకు దిగుతోంది చైనా. మరోవైపు భారత్​.. ఈ ప్రాంతంలో అదనంగా 15వేల మంది సైనికులను రంగంలోకి దించింది.

  • గట్టిగా ఏడ్చేసిన రకుల్​

ఎప్పుడూ చలాకీగా కనిపించే హీరోయిన్​ రకుల్​ప్రీత్​ సింగ్(Rakulpreet singh cried)​ ఒక్కసారిగా చిన్నపిల్లలా గట్టిగా ఏడ్చింది. దానికి సంబంధించిన వీడియోను సోషల్​మీడియాలో షేర్​ చేసింది. ఇంతకీ ఏమైంది?

06:43 July 25

టాప్​ న్యూస్​ @7AM 

  • కౌన్​ బనేగా బకరా 

క్యాన్సర్​తో పోరాడుతున్న తల్లిని బతికించుకోవాలనుకుంది. తల్లి చికిత్సకు.. తన సంపాదనలో దాచుకుంది కొంత.. మరికొంత అప్పుచేసి సగం డబ్బు పోగుచేసింది. మిగిలిన నగదు కోసం ఏం చేయాలో తెలియని స్థితిలో ఓ ఫోన్​ కాల్ వచ్చింది. ఆ కాల్.. తనకు రూ.25 లక్షలు ఆఫర్ చేసింది. కానీ.. ఆ 25 లక్షల రూపాయలు పొందేందుకు ప్రయత్నించి.. ఆమె దాదాపు 8 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఇంతకీ ఆ కాల్ చేసింది ఎవరు? రూ.25 లక్షలు ఎందుకు ఇస్తామన్నారు? ఆమె రూ.8 లక్షలు ఎలా కోల్పోయింది?

  • స్పేస్​లో అవి కూడా చేయొచ్చా?

రోదసి పర్యాటకాన్ని ప్రోత్సాహించే దిశగా బిలియనీర్ల అంతరిక్ష యాత్రలు ఈ నెలలో విజయవంతం అయ్యాయి. దీంతో చాలా మంది స్పేస్​ టూరిజం వైపు అడుగులు వేస్తున్నారు. కొందరైతే ఇప్పటికే ఆయా సంస్థలకు పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించి టికెట్లు కూడా బుక్​ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అంతరిక్ష పర్యాటకం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..

  • షరతులు లేని చర్చలకు సిద్ధం 

కేంద్రం తీరుపై భారతీయ కిసాన్ యూనియన్​ జాతీయ ప్రతినిధి రాకేశ్​ టికాయిత్ మండిపడ్డారు. షరతులు లేని చర్చలకు కేంద్రం సిద్ధమవనంతవరకు దిల్లీ సరిహద్దులను రైతులు వీడబోరని మరోమారు స్పష్టం చేశారు.

  • వరదల బీభత్సం

కర్ణాటకలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.

త్వరలో త్రిష పెళ్లి !

సీనియర్ నటి త్రిష పెళ్లి టాపిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. ఈమె ఓ దర్శకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతోందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది.

05:36 July 25

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

  • లష్కర్​ బోనాలు షురూ..

లష్కర్​ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ అమ్మవారికి తొలిబోనాన్ని సమర్పించారు. రెండు రోజుల పాటు జరగనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి వివరించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సకల వసతులు కల్పించామన్నారు.

  • 3 లక్షల మందికి కొత్త రేషన్​కార్డులు..

రాష్ట్రంలో రేషన్‌కార్డు లబ్ధిదారుల నిరీక్షణకు తెరపడనుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం.. 3 లక్షల 4 వేల 253 కుటుంబాలు.. కొత్తగా రేషన్‌ కార్డుకు అర్హత సాధించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ నెల 26 నుంచి నెలాఖరు వరకు కార్డుల పంపిణీకి సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.

  • ప్రాజెక్ట్​ చరిత్రలోనే తొలిసారి..

ఎడతెరిపిలేని వర్షాలతో ఈసారి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. గోదావరి ఉప్పొంగడంతో రెండు రోజుల్లోనే జలాశయం పూర్తిగా నిండిపోయింది. ఈ నెల 22న ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారి రికార్డు స్థాయిలో వరద చేరిందని అధికారులు చెబుతున్నారు. జులై నెలలో ఇంత ఎక్కువ వరద రావడం కూడా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరిగిందని వెల్లడించారు.
 

  • పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ..

ఎగువన కురుస్తోన్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్​ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో.. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటోంది. శ్రీశైలానికి క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. నాగార్జున సాగర్‌కూ వరద ప్రవాహం కొనసాగుతోంది.

  • లక్ష కోట్లయినా వెచ్చిస్తాం..

దళిత బంధు కోసం ఏకంగా రూ. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా వెనకాడమని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఉద్యమించామో.. దళితుల అభ్యున్నతి కోసం ఉద్యమ తరహా ముందుకెళ్తామన్నారు. దళిత బంధు ద్వారా ఇచ్చే నగదు.. పూర్తి ఉచితమేనన్న ముఖ్యమంత్రి.. వాటితో ఉపాధి మార్గాలను పరిపుష్టం చేసుకోవాలని సూచించారు.

  • 'మహా' వరద బీభత్సం..

మహారాష్ట్రను వరదలు అల్లకల్లోలం చేస్తున్నాయి. వరదల ధాటికి ఇప్పటివరకు 112 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా, రాయ్​గఢ్​లో పర్యటించిన సీఎం ఉద్ధవ్​ ఠాక్రే నష్టపోయిన వారికి పరిహారం ప్రకటించారు.

  • తుపాకుల మోత!

అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. ఈ సారి ఏకంగా శ్వేత సౌధం సమీపంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటన చోటు చేసుకొన్న సమయంలో సీఎన్‌ఎన్‌ శ్వేత సౌధం ప్రతినిధి జిమ్‌ అకోస్టా అక్కడే ఉన్నారు.

  • గ్యాస్‌ సిలిండర్‌ పేలి.. 9మంది మృతి..

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి తొమ్మిది మంది చనిపోయారు. వీరిలో నలుగురు పిల్లలు ఉన్నారు.

  • బోణీ ఎవరిదో?​

లంకతో జరిగిన వన్డే సిరీస్​ను 2-1తో గెలుచుకున్న టీమ్ఇండియా.. ఇక ఇప్పుడు టీ20 సిరీస్​పై కన్నేసింది. ఈ సిరీస్​ను కూడా గెలిచి లంక పర్యటనను క్లీన్​స్వీప్​ చేయాలని యోచిస్తోంది. భారత జట్టులో చాలా మంది కుర్రాళ్లకు ఐపీఎల్​ ఆడిన అనుభవం ఉంది. దీంతో లంకేయులను ఓడించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. సొంత గడ్డపై ఆడనున్న సింహళీయులను కూడా తక్కువ అంచనా వేయలేం. ప్రేమదాస స్టేడియం వేదికగా తొలి టీ20 ఆదివారం రాత్రి 8.00లకు ప్రారంభం కానుంది.

  • టాలీవుడ్ యముడు..

టాలీవుడ్​లో యముడు పాత్ర అంటే గుర్తొచ్చేది కైకాల సత్యనారాయణ. తన గంభీరమైన వాచకంతో, నవరసభరితమైన నటనతో, హావభావాలను చిలికిస్తూ నటనకే భాష్యం చెప్పిన నవరస నటనా సార్వభౌముడు ఆయన. వందలాది సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఈ రోజు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా కైకాల వ్యక్తిగత జీవితంతో పాటు సినీ కెరీర్​పై ప్రత్యేక కథనం మీకోసం.

Last Updated : Jul 25, 2021, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details