తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - telangana top news

టాప్​ న్యూస్​
టాప్​ న్యూస్​

By

Published : Jul 21, 2021, 6:07 AM IST

Updated : Jul 21, 2021, 10:17 PM IST

22:15 July 21

టాప్​ న్యూస్ ​@ 10pm

  • ఎడతెరిపిలేని వర్షం...  

రాష్ట్రంలో ముసురు పట్టింది. చాలాచోట్ల చిరుజల్లులు .. కొన్నిచోట్ల మోస్తరు వానలు పడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్రవాహనాలపై కార్యాలయాలకు .. ఇతర అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లేవాళ్లు తడిసి ముద్దవుతున్నారు. రోడ్లపైకి వరద నీరు చేరగా.. గుంతలు కనిపించక వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జలాశయాలు నిండుకుండలా మారాయి.

  • 691 కొత్త కేసులు

రాష్ట్రంలో తాజాగా 691 మందికి కరోనా వైరస్‌ (corona) సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 6,38,721‬ కి చేరింది. తాజాగా మహమ్మారితో ఐదుగురు మృతి చెందగా మొత్తం సంఖ్య 3,771కి పెరిగింది.

  • ఈ సంకేతాలుంటే.. మీ ఫోన్‌ హ్యాక్‌ అయినట్లే!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్​ టాపిప్​గా మారిన అంశం.. పెగాసస్​ స్పైవేర్​. ఈ స్పైవేర్​ ద్వారా రాజకీయ ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయినట్లు వార్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ ఫోన్ హ్యాకింగ్​కు గురైందో? లేదో? తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పెగాసస్​ కాకపోయినప్పటికీ అనేక మాల్వేర్​లు ప్రస్తుతం ఇలాంటి హ్యాంకింగ్​లకు పాల్పడుతున్నాయి. అందుకే అందరూ తమ ఫోన్​ను ఎంత సురక్షితమో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మీ ఫోన్​ హ్యాకింగ్​ బారిన పడిందో లేదో తెలుసుకోండిలా..

  • స్వ్కాడ్ ఇంగ్లాడ్...

టీమ్ఇండియాతో టెస్టు సిరీస్​లో భాగంగా తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్​ క్రికెట్ బోర్డు(England and Wales Cricket Board). విద్వేషపూరిత ట్వీట్ల కారణంగా క్రికెట్ నుంచి నిషేధం విధించిన యువ బౌలర్​ రాబిన్సన్​ను (Ollie Robinson) తిరిగి జట్టులోకి తీసుకున్నారు. స్టార్ ఆల్​రౌండర్​ జోఫ్రా ఆర్చర్​ను ఈ సిరీస్​కు కూడా పక్కన పెట్టారు.

  • గాయపడ్డ విశాల్.. వీడియో వైరల్

తమిళ కథానాయకుడు విశాల్​ మరోసారి షూటింగ్​లో గాయపడ్డారు. 'నాట్​ ఏ కామన్​ మ్యాన్​' సినిమా పోరాట సన్నివేశాల్లో విశాల్​కు తీవ్ర గాయమైంది. దీంతో చిత్రబృందం అతడిని ఆస్పత్రికి తరలించింది.

20:54 July 21

టాప్​ న్యూస్ ​@ 9pm

  • రాజకీయంగా లాభం కోరుకుంటాం: కేసీఆర్​

తెరాస సన్నాసుల మఠం కాదని రాజకీయ పార్టీ అని సీఎం కేసీఆర్(KCR)​ స్పష్టం చేశారు. హుజూరాబాద్​ నేత పాడి కౌశిక్​ రెడ్డి హైదరాబాద్​లోని ప్రభగతి భవన్​లో తెరాస చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

  • రైతుల నిరసనకు అనుమతి

జంతర్​మంతర్​ వద్ద రైతులు చేపట్టనున్న నిరసనకు దిల్లీ పోలీసులు అనుమతిచ్చారు. అయితే కరోనా నిబంధనలు పాటించాలని.. రోజుకు 200 మందికి మించి పాల్గొనకూడదని పేర్కొన్నారు.

  • యడియూరప్ప రాజీనామా ఎప్పుడు?

కర్ణాటక అధికార పార్టీలో నాయకత్వ మార్పుపై ఏడాది కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. జులై 26న జరగనున్న భాజపా శాసనసభాపక్ష భేటీలో ఓ స్పష్టత వస్తుందని అనుకున్నా.. ఆ సమావేశాన్ని రద్దు చేశారు సీఎం యడియూరప్ప. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో విందు కార్యక్రమాన్ని సైతం వాయిదా వేశారు. దీంతో సీఎం మార్పు ఊహాగానాలకు ఇప్పట్లో తెరపడేలా కనిపించటం లేదు.

  • అదే రాజ్​ కుంద్రాను పట్టించింది!

అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్​ కుంద్రా గురించి మరిన్ని విషయాలు ప్రస్తుతం బయటకొస్తున్నాయి. ముంబయి శివారులోని మాద్​ దీవిలోని ఓ బంగ్లాలో పోర్న్​ సినిమాలను షూటింగ్​ చేశారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 4న పోలీసులు చేసిన రైడింగ్​ రాజ్​కుంద్రాను పట్టించిందని తెలుస్తోంది.

  • లంక సారథి, కోచ్‌ మధ్య వాగ్వాదం?.. వీడియో వైరల్​

కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్​లో లంకేయులు ఓడిపోవడం ఆ జట్టు కోచ్​ మైక్​ ఆర్థర్​కు కోపం తెప్పించింది. మ్యాచ్​ అయిపోగానే ఆవేశంగా మైదానంలోకి వెళ్లి కెప్టెన్​ను మందలిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

19:46 July 21

టాప్​ న్యూస్ ​@ 8pm

  • సర్కార్ దృష్టి

ఆదాయ పెంపు మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఖజానాకు వీలైనంత ఎక్కువగా రాబడిని పొందేలా వివిధ చర్యలు తీసుకుంటోంది. భూముల విలువ, రిజిస్ట్రేషన్ రుసుము పెంపు, భూముల అమ్మకం సహా వివిధ కార్యాచరణను అమలు చేస్తోంది. తాజాగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించే దిశగా కూడా సర్కార్ సిద్ధమైంది.

  • ప్రయోగం విజయవంతం

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన.. యాంటీ ట్యాంక్​ గైడెడ్​ మిసైల్​(ఎంపీఏటీజీఎం)ను విజయవంతంగా ప్రయోగించింది డీఆర్​డీఓ. దీన్ని ఆత్మనిర్భర భారత్​లో కీలక ముందడుగుగా పేర్కొంది. మరోవైపు.. ఒడిశాలోని ఇంటిగ్రెటెడ్​ టెస్ట్​​ రేంజ్​ నుంచి అధునాత ఆకాశ్​ మిసైల్​ను ప్రయోగించింది.

  • ఒలింపిక్ క్రీడలు 34 గంటలు నిలిపివేత

శుక్రవారం టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన విశ్వక్రీడల విశేషాలు, వింతలు, ఆసక్తికర సంఘటనలు మీరూ తెలుసుకోండి.

  • బెస్ట్​ కెమెరాతో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్

ప్రస్తుతం కుర్రకారు మంచి కెమెరా ఉండే ఫోన్ల కోసం చూస్తున్నారు. చాలా కంపెనీలు కూడా అందుకు తగ్గట్టుగా మొబైల్స్​ను మార్కెట్​లోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్​లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్​ కెమెరా ఫోన్లు ఏవో ఓ లుక్కేద్దాం.

18:59 July 21

టాప్​ న్యూస్ ​@ 7pm

  • ప్రజల అవసరాలను తీరుస్తున్నాం

రాష్ట్ర అభివృద్ధికి దోహద పడాలనే కౌశిక్‌ రెడ్డి తెరాసలోకి వచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్​లో జరిగిన చేరిక కార్యక్రమంలో కౌశిక్‌ రెడ్డి తండ్రితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి పథకం వెనుక ఎంతో మథనం ఉందని.. ప్రతి పథకం ఆయా వర్గాలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

  • భేషజాలెందుకు?

కేంద్రం కేజీఆర్​ఎంబీ పరిధిని నిర్దేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై మాజీమంత్రి మైసూరారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరితో గ్రేటర్​ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు అంటూ వ్యాఖ్యానించారు.

  • 'పెగాసస్' పెనుభూతం..  

పెగాసస్.. ప్రపంచంతో పాటు.. భారత రాజకీయాలను కుదిపేస్తున్న స్పైవేర్ కుంభకోణం. నేతల నుంచి సామాజిక కార్యకర్తల వరకు.. సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు.. నా ఫోన్ ప్రమాదంలో ఉందా? అని అనుకోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో అసలు ఇది ఎలా పనిచేస్తుంది? పెగాసస్​తో అంత ప్రమాదమా? దీని నిఘా నుంచి తప్పించుకోవడం ఎలా తెలుసుకుందాం..

  • 1000 ఏళ్లలో అతిపెద్ద కుంభవృష్టి

నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి చైనాలోని ఓ రాష్ట్రంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. గత 1000ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో అతిభారీ వర్షాలు కురవడం వల్ల భీకర వరదలు సంభవించాయి. దీంతో రాష్ట్రమంతా.. ఊరు-ఏరు ఒకటైనట్లు కనిపిస్తోంది.

  • ఇంటెల్​తో ఎయిర్​టెల్  

స్వదేశీ 5జీ టెక్నాలజీ కోసం ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్​టెల్.. సెమికండక్టర్ల తయారీ సంస్థ ఇంటెల్​తో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ విషయంలో స్వదేశీ సంస్థలతోనూ కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది ఎయిర్​టెల్.

17:59 July 21

టాప్​ న్యూస్ ​@ 6pm

  • తెరాసలో చేరిన పాడి కౌశిక్​ రెడ్డి

కాంగ్రెస్‌ మాజీ నేత పాడి కౌశిక్‌ రెడ్డి(koushik reddy) తెరాసలో చేరారు. హైదరాబాద్​ ప్రగతి భవన్​లో కేసీఆర్​ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. హుజూరాబాద్​కు పలువురు కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.

  • ఆగస్టు నుంచి వారికి సీబీఎస్​ఈ పరీక్షలు!

ప్రైవేటు విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్​ఈ బోర్డు బుధవారం వెల్లడించింది. ఆ విద్యార్థులకు అసెస్మెంట్​ల ఆధారంగా ఫలితాలను నిర్ణయించే అవకాశం లేదని స్పష్టం చేసింది.

  • 'నిఘా రాజ్యంగా మార్చటమే మోదీ లక్ష్యం'

ప్రజాస్వామ్య దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పెగాసస్​ వ్యవహారాన్ని(Pegasus Spyware) సుమోటోగా స్వీకరించాలని సుప్రీం కోర్టును కోరారు. 2024 ఎన్నికల్లో భాజపాను గద్దె దించేందుకు విపక్షాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

  • పెన్షనర్లు లైఫ్​ సర్టిఫికెట్ పొందటం ఇక ఈజీ

పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు జీవన్​ ప్రమాణ్​ సేవలను ఇకపై పోస్టాఫీసుల్లోనూ పొందొచ్చు. వారందరికీ సమీపంలో ఉన్న పోస్టాఫీసుల్లో ఈ సేవలను పొందేలా వీలు కల్పిస్తున్నట్లు 'ఇండియా పోస్ట్​' అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • బెజోస్​ రోదసి యాత్ర ఎన్ని కిలోమీటర్లు సాగిందంటే?

అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్ విజయవంతంగా రోదసి యాత్రను పూర్తి చేశారు. ఈ వ్యోమనౌక మొత్తం 106 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయాణించింది. ​100 కిలోమీటర్ల ఎత్తులో బెజోస్ బృందం కొన్ని క్షణాల పాటు మైక్రోగ్రావిటీ స్థితిని అనుభవించినట్లు బ్లూ ఆరిజిన్ వెల్లడించింది.

  • ఆర్జీవీ మెచ్చిన లవ్​ సాంగ్​..

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, సినిమాలతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మొదటిసారి ఓ ప్రేమ పాటకు ఫిదా అయ్యారు. పాట సూపర్‌గా ఉందంటూ ట్వీట్‌ చేశారు.

16:56 July 21

టాప్​ న్యూస్ ​@ 5pm

  • పోటెత్తుతున్న వరద..

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో ఉత్తర తెలంగాణలోని ఎల్లంపల్లి (Ellampalli project), కడెం జలాశయాలు నిండు కుండలా మారాయి. ఎల్లంపల్లి, కడెం జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి.

  • రైల్వేశాఖ అప్రమత్తం...

వర్షాకాల నేపథ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ప్రత్యేక కార్యాచరణ రూపొందించి... అవసరమైన చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖ నిర్ణయించింది. వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జోన్ పరిధిలో డివిజన్ల వారీగా ప్రణాళికలు రూపొందించారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తినా వెంటనే ట్రాక్​లు, వంతెనలు పునరుద్ధరించేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.

  • భారత్​లో టిక్​టాక్ రీఎంట్రీ..

టిక్​టాక్​ ప్రియులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ప్రముఖ షార్ట్​ వీడియో మేకింగ్​ యాప్​ టిక్​టాక్​ తిరిగి భారత్​లో రీఎంట్రీ ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ పేటెంట్స్​, డిజైన్​, ట్రేడ్​మార్క్స్​ (సీజీపీడీటీఎం)కు దరఖాస్తు చేసిందనే వార్త సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తోంది.

  • పోర్న్​ చిత్రాలతో రోజుకు రూ.8 లక్షలు?

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్​ కుంద్రా అశ్లీల చిత్రాలు నిర్మించాడన్న వాదనలు నిజమేనని స్పష్టం చేశారు ముంబయి జాయింట్​ పోలీస్​ కమీష​నర్ మిలింద్. ఈ వ్యాపారం ద్వారా అతడు రోజుకు రూ.7-8 లక్షలు ఆర్జించేవాడని వెల్లడించారు.

  • ఐసీసీ  వన్డే ర్యాంకింగ్స్

ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా ఓపెనర్​ శిఖర్ ధావన్​ 16వ ర్యాంకుకు చేరుకున్నాడు. కెప్టెన్​ కోహ్లీ,​ రోహిత్ శర్మ స్థానాలలో ఎలాంటి మార్పు లేదు. బౌలింగ్ విభాగంలో చాహల్​ నాలుగు స్థానాలు మెరుగయ్యాడు. ప్రస్తుతం 20వ ర్యాంకులో ఉన్నాడు.

15:55 July 21

టాప్​ న్యూస్ ​@ 4pm

  • తల్లిదండ్రులను కోల్పోయిన  లక్షల మంది చిన్నారులు

కొవిడ్​ మహమ్మారి యావత్​ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మందికిపైనే చిన్నారులు.. తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయినట్లు లాన్సెట్​ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ఒక్క భారత్​లోనే 1.19లక్షల మంది పిల్లలపై ప్రభావం పడినట్లు పేర్కొంది.

  • భర్త వీర్యం కోసం భార్య పిటిషన్

ఏడాది క్రితమే ఆ మహిళకు పెళ్లైంది. అంతలోనే భర్త.. కొవిడ్​ బారిన పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది. ఈ పరిస్థితుల్లో.. భర్త వీర్యం కావాలని హైకోర్టులో ఆ మహిళ వ్యాజ్యం దాఖలు చేసింది.

  • మిర్చి వంకాయ రంగు, బెండకాయ ఎర్ర రంగు

పచ్చిమిర్చి ఏ రంగులో ఉంటుంది.. పచ్చ రంగులో.. బెండకాయ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తెలిసింది ఏం చెబుతావు విషయానికి రండి అంటారా.. ఆగండి అక్కడికే వస్తున్నా.. సాధారణంగా పచ్చిమిర్చి, బెండకాయ పచ్చ రంగులో ఉంటాయి. కానీ మీరు ఇప్పుడు చూడబోయే పచ్చి మిర్చి వంకాయ రంగు, బెండకాయ ఎర్ర రంగులో ఉంటాయి.. మరి ఇవీ ఎక్కడ పండిస్తున్నారో చూద్దాం పదండి...

  • మీ డబ్బులకు డబ్బులు కాస్తాయి

తెలివితో కొంత డబ్బును సంపాదిస్తే.. ఆ డబ్బే భారీగా సంపదను సృష్టిస్తుంది. పెట్టుబడులకు సంబంధించి ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. అయితే పెట్టుబడి స్టాక్ మార్కెట్లకు సంబంధించినది అయితే.. ఈ ఆరు సూత్రాలను పాటిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు. మరి అవి ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

14:53 July 21

టాప్​ న్యూస్ ​@ 3pm

  • అతి భారీ వర్షాలు!

రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్టు తెలిపారు. ఈశాన్య, తూర్పు తెలంగాణా జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల.. అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

  • ఎర్రకోట బంద్​- కారణమిదే.

దిల్లీలోని ఎర్రకోటను తాత్కాలికంగా మూసివేశారు. స్వతంత్ర దినోత్సవం నేపథ్యంలో భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం జీవనకాల గరిష్ఠాల వద్ద కొనసాగుతున్నాయి. ఈ ధరల మోత నుంచి ఉపశమనం ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు సామాన్యులు. అయితే త్వరలోనే వారికి పెట్రో బాదుడు నుంచి ఊరట లభించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు గల కారణాలు ఇలా ఉన్నాయి.

  • 2032 ఒలింపిక్స్​ ​ఎక్కడో తెలుసా!

2032 ఒలింపిక్స్​ను బ్రిస్బేన్​లో నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది. చివరిసారిగా 2000 సంవత్సరంలో సిడ్నీ విశ్వక్రీడలకు వేదిక కాగా.. తిరిగి 32 ఏళ్ల తర్వాత మరోసారి ఆస్ట్రేలియాకు ఈ సువర్ణావకాశం వచ్చింది.

  • బెజోస్‌ కీలక ప్రకటన!

అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. 'కరేజ్ అండ్ సివిలిటీ' అనే అవార్డును స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. తొలి అవార్డును ప్రముఖ చెఫ్‌ జోస్‌ ఆండ్రెస్‌, సామాజిక కార్యకర్త వ్యాన్‌ జోన్స్‌ అనే ప్రముఖులకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ అవార్డు కింద ఇరువురికి చెరో 100 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నారు.

13:57 July 21

టోక్యో ఒలింపిక్స్​ చూసేందుకు సిద్ధమవుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి. అంతకంటే ముందు ఈ సినిమాలు చూడండి. మీకు మంచి కిక్కిస్తాయి! స్పోర్ట్స్​ డ్రామాలుగా తెరకెక్కిన ఈ చిత్రాల్లో.. ఒలింపిక్స్​ నేపథ్యమే కాకుండా అందులోని కొన్ని అరుదైన సంఘటనల్ని కళ్లకుకట్టినట్లు చూడొచ్చు!

  • పోటాపోటీ

పంజాబ్ కాంగ్రెస్​లో అమరిందర్ సింగ్, నవజోత్ సింగ్ మధ్య అభిప్రాయభేదాలు తొలగిపోలేదని తెలుస్తోంది. పీసీసీ చీఫ్​గా నియమితులైన తర్వాత పార్టీ ప్రజాప్రతినిధులతో సిద్ధూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం 62 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మరోవైపు, పార్టీ ఎంపీలతో సమావేశానికి అమరిందర్ సింగ్ పిలుపునిచ్చారు.

  • బాదుడుకు బ్రేక్​..?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం జీవనకాల గరిష్ఠాల వద్ద కొనసాగుతున్నాయి. ఈ ధరల మోత నుంచి ఉపశమనం ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు సామాన్యులు. అయితే త్వరలోనే వారికి పెట్రో బాదుడు నుంచి ఊరట లభించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు గల కారణాలు ఇలా ఉన్నాయి.

  • బోటులోనే అంత్యక్రియలు!

భారీ వర్షాల కారణంగా శ్మశానవాటికలో వరద నీరు చేరి.. ఓ గ్రామప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని వరదనీటిలోనే, బోటుపై తీసుకువెళ్లి అంతిమసంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన బిహార్​లోని దర్భంగా జిల్లాలో జరిగింది.

12:42 July 21

టాప్​ న్యూస్​ @1PM 

  • రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు 

రాష్ట్ర వ్యాప్తంగా చిరు జల్లులు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముసురుపట్టడంతో జనజీవనానికి ఇబ్బందిగా మారింది. సింగరేణి ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

  • షర్మిల పోడుయాత్ర

వైఎస్​ఆర్​టీపీ వ్యవస్థపక అధ్యక్షురాలు షర్మిల మరో పోరుకు సిద్ధమయ్యారు. పోడుభూముల కోసం పోరాటం చేయనున్నారు. గురువారం తాడ్వాయి మండలం లింగాలలో పోడుయాత్ర నిర్వహించనున్నారు.

  • ఉగ్ర చెర నుంచి విడిపించి.. 

ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు సిద్ధమైన 14 మంది యువకులను జమ్ముకశ్మీర్​ పోలీసులు రక్షించారు. వారికి కౌన్సిలింగ్​ ఇప్పించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

  • జపాన్​ బోణీ

రెండు రోజులు ముందే ఒలింపిక్స్​లోని(Tokyo olympics) కొన్ని క్రీడలు ప్రారంభమైపోయాయి. బుధవారం సాఫ్ట్​బాల్​ పోటీలు మొదలవ్వగా ఆరంభ మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై ఆతిథ్య జపాన్​ గెలుపొందింది. రెండో మ్యాచ్​లో ఇటలీపై అమెరికా విజయం సాధించింది.

  • సోనూ ఎమోషనల్​ పోస్ట్​

తన తల్లి సరోజ్​సూద్​ జయంతి సందర్భంగా సోనూసూద్ భావోద్వేగానికి లోనయ్యారు. 'ఆమె లేని జీవితంలో శూన్యం ఏర్పడిందని' అన్నారు.

11:47 July 21

టాప్​ న్యూస్​ @12PM 

  • జైళ్ల శాఖలో కుర్చీలాట!

జైళ్ల శాఖలో రెండో ఉన్నత స్థానమైన ఐజీ పోస్టు కోసం అంతర్గత వివాదం నడుస్తోంది. ఈ పోస్టు ఖాళీ కావడంతో ఇద్దరు డీఐజీలు పోటీ పడుతున్నారు. సాధారణంగా జైళ్ల శాఖ డీజీ పోస్టులో ఐపీఎస్‌ అధికారిని నియమిస్తుండగా... ఆ తర్వాతి స్థానంలోని ఐజీ పోస్టులో జైళ్ల శాఖ నుంచి ఎంపికైన ఉన్నతాధికారులే ఉంటున్నారు. జైళ్ల శాఖ అధికారుల పరంగా ఐజీ పోస్టు మాత్రమే అత్యున్నతం కావడంతో కీలకంగా మారింది.

  • ప్రైవేటీకరణ ఖాయం 

విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణను పునఃపరిశీలించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరిందని, అయితే అందులో తమకున్న 100% వాటాలను అమ్మాలని నిర్ణయించినట్లు స్పష్టంగా చెప్పామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కిషన్‌రావ్‌ కరాడ్‌ తెలిపారు. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

  • పెళ్లి భోజనం తిని.. 

వివాహ వేడుకలో కలుషిత ఆహారం కారణంగా 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాజస్థాన్​ దౌసా జిల్లా మురళిపుర​ గ్రామంలో జరిగింది. బాధితులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • ఆఫర్ల సందడి 

మరోసారి ఆన్​లైన్ షాపింగ్ పండుగకు తెరలేచింది. బంపర్​ల బొనాంజా మోగనుంది. జులై 25 నుంచి ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్' సేల్.. జులై 26 నుంచి అమెజాన్ 'వార్షిక ప్రైమ్ డే' ప్రారంభం కానున్నాయి.

  • గ్రౌండ్​లో కుమ్ములాట 

క్రికెట్​ మైదానం రణరంగంగా మారింది. ఇరు జట్టు ఆటగాళ్ల మధ్య మాటమాట పెరిగి బ్యాట్​లతో తీవ్రంగా కొట్టుకునే పరిస్థితికి దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అయింది. ఇంతకీ ఈ ఘర్షణ ఎప్పుడు, ఎక్కడ జరిగిందంటే?

10:45 July 21

టాప్​ న్యూస్​ @11AM 

  • రన్నింగ్​లోనే ఊడిన చక్రాలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్​ నుంచి తొర్రూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు మార్గమధ్యలోనే ఊడిపోయాయి. గమనించిన డ్రైవర్.. వెంటనే అప్రమత్తమవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనలో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.  

  • పక్షం రోజుల్లో పూర్తి చేయాలి

ఎల్ఆర్ఎస్​లో భాగంగా ప్లాట్ల క్రమబద్దీకరణకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన పక్షం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రక్రియ మొత్తాన్ని పక్షం రోజుల్లో పూర్తి చేసి కలెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని... ఆ తర్వాత తదుపరి మార్గదర్శకాలు జారీ అవుతాయని తెలిపింది.

  • భవిష్యత్ 'చమురు' ప్రత్యామ్నాయం

సాంకేతిక పరిజ్ఞానం విషయంలోనే కాదు, ఇంధన వినియోగంలోనూ టోక్యో ఒలింపిక్స్‌ సరికొత్త చర్చకు నాంది పలుకుతోంది. పర్యావరణ హిత హరిత హైడ్రోజన్‌ వాడకానికి పెద్ద పీట వేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఒలింపిక్‌ జ్యోతి పాక్షికంగా హరిత హైడ్రోజన్‌తో వెలుగుతుండగా.. క్రీడాకారుల బస ఏర్పాట్లకు, వాహనాలకూ పూర్తిగా ఇదే ఇంధనమవుతోంది. 

  • తగ్గిన పసిడి ధరలు 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి 69 వేల లోపునకు పడిపోయింది.

  • తొలి టెస్టు ఆడేనా?

ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​కు(England test series) ముందు టీమ్​ఇండియా సారథి కోహ్లీ, అజింక్య రహానె, ఫాస్ట్​ బౌలర్ అవేశ్​ ఖాన్ గాయాల బారిన పడటం టీమ్​ఇండియాను కలవరపెడుతోంది. ఇప్పటికే విరాట్​, రహానె వార్మప్​ మ్యాచ్​కు కూడా దూరమయ్యారు.

09:45 July 21

టాప్​ న్యూస్​ @10AM 

  • నిరాడంబరంగా బక్రీద్​ 

దేశవ్యాప్తంగా వివిధ మసీదుల్లో ముస్లింలు బక్రీద్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దిల్లీ జామా మసీదు సహా చాలా చోట్ల బక్రీద్ సందడి కరవైంది. కేరళలో భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేశారు. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ప్రధాని మోదీ.. ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

  • పెరిగిన కరోనా కేసులు 

భారత్​లో కరోనా కేసులు(Covid Cases) క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగాయి. కొత్తగా 42,015 మందికి వైరస్​ సోకింది. మరో 3,998 మంది ప్రాణాలు విడిచారు. కొత్తగా 36,977 మంది వైరస్​ను జయించారు.

  • తెలుగు తేజం 

ఏపీలోని విశాఖ మన్యం కుర్రాడు అగ్రరాజ్యంలో తన సత్తాచాటాడు. తెలుగు తేజం కీర్తిని ఎల్లలు దాటేలా చేశాడు. మన్యం యువకుడు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి, కాన్సాస్ సిటీ (UMKS) నుంచి డాక్టరేట్​ను సాధించాడు. యూఎంకేఎస్ చరిత్రలో తొలి డాక్టరేట్ సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా భరద్వాజ రికార్డు సృష్టించాడు.

  • భీకర వరదలు 

కుండపోత వర్షాలకు చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. వందేళ్లలో ఎప్పుడు లేనంతగా కురిసిన వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఊరు-ఏరు ఏకమయ్యాయి. ప్రవాహ ఉద్ధృతిలో పెద్దపెద్ద కార్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. వివిధ ఘటనల్లో 12 మంది మరణించారు.

  • విశ్వ క్రీడల్లో వింత నిబంధనలు 

గోళ్లకు రంగు వేసుకోవద్దు.. గడ్డం క్లీన్‌ షేవ్‌ చేసుకోవాలి.. స్కర్టులే ధరించాలి.. ఏంటి ఇవన్నీ? ఒలింపిక్స్‌లో నిబంధనలండీ. వింతగా, హాస్యాస్పదంగా ఉన్న ఇలాంటి మనకు తెలియని రూల్స్‌ ఎన్నో ఉన్నాయి. ఓసారి వాటిపై ఓ లుక్కేద్దామా!

08:38 July 21

టాప్​ న్యూస్​ @ 9 AM

  • ఎస్సై, కానిస్టేబుళ్ల డిస్మిస్

అడ్డగూడూరు దళిత మహిళ మరియమ్మ లాకప్‌ డెత్‌ వ్యవహారంలో ఎస్సై సహా ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మరియమ్మను దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె పోలీసు కస్టడీలో మృతి చెందింది. 

  • ఆకాశంలో విమాన ఛార్జీలు

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులకు ఆ దేెశం చేదు కబురు అందించింది. అమాంతంగా విమాన టికెట్​ ధరలు పెంచి వారిపై ఆర్థిక భారం మోపింది. కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం ఓ కారణం కాగా.. విమాన సర్వీసులు పరిమితంగా ఉండటం మరో కారణమైంది. దీంతో ఒకేసారిగా దాదాపు 4 రెట్ల మేర ఛార్జీలు పెరిగాయి.

  • ఆ సినిమాలో అంతగా ఏముంది

హాలీవుడ్​ కథలు మనల్ని ఆకర్షించడం కొత్తేమీ కాదు. వాటిని ఏదో ఒక భాషలో రీమేక్​ చేయడం చూస్తుంటాం. కానీ ఒకే సినిమాను ఏకంగా భారత్​లోని ఐదు భాషల్లో తెరకెక్కిస్తుండటం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏంటి?

  • అదిరిందయ్య రాహుల్‌ 

ఇంగ్లాండ్​ సిరీస్​కు(England vs India) ముందు కౌంటీ సెలెక్ట్​ ఎలెవన్​తో ఆడిన వార్మప్​ మ్యాచ్​లో(Warm up match) టీమ్​ఇండియా 9 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. కేఎల్​ రాహుల్​ సెంచరీతో(KL Rahul) మెరవగా.. ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్​ ఆడాడు.

  • ఈ ఉద్యోగానికి అన్ని ఆఫర్లా..!

తమ సంస్థలో చేరే ఉద్యోగులకు భారీ ప్యాకేజ్​లు ప్రకటించింది ఓ ఫైన్​టెక్​ అంకుర సంస్థ. బీఎండబ్ల్యూ బైక్​ సహా ఇంకా ఎన్నో ఆఫర్లు కల్పించింది. కొత్తగా 100 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

07:48 July 21

టాప్​ న్యూస్​ @8AM

  • ఆపరేషన్​ మాంటె కార్లో

విదేశీ రాయబారుల పేరుతో దిగుమతి చేసుకున్న ఖరీదైన కార్ల కుంభకోణం గుట్టు రట్టు చేసేందుకు ముంబయి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు చేపట్టిన 'ఆపరేషన్ మాంటె కార్లో'లో హైదరాబాద్ లోని ప్రముఖులకు ఉన్న సంబంధాలు బయటపడుతున్నాయి. 

  • నడవని నడవాలు 

తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం ప్రతిపాదించిన హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌- నాగ్‌పుర్‌ పారిశ్రామిక నడవా (కారిడార్‌)లు ఇంకా కాగితాలపైనే నానుతున్నాయి. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం 11,500 ఎకరాల భూమిని సేకరించింది. సమగ్ర సమాచారం అందించి, కారిడార్ల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేసినా కేంద్రం నుంచి పూర్తిస్థాయి అనుమతులు రాలేదు.

  • భారీ వర్షాలు 

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది.

  • తొలి బర్డ్​ఫ్లూ మరణం

బర్డ్​ ఫ్లూతో భారత్(Bird flu in India)​లో తొలి మరణం సంభవించింది. ఈ వ్యాధి బారిన పడిన 12 ఏళ్ల బాలుడు దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

  • ప్రపంచంలోనే హైస్పీడ్​ రైలు 

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ రైలును రూపొందించింది చైనా. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొంది.

06:39 July 21

  • ప్యాసింజర్​ రైలు.. ఎక్స్​ప్రెస్​ ఛార్జి 

ప్రత్యేక రైళ్ల పేరుతో రైల్వే శాఖ ప్రత్యేక వడ్డింపు ప్రారంభించింది. పేద, మధ్య తరగతి వర్గాలపై మరింత భారాన్ని మోపుతోంది. గతంలో ప్యాసింజర్ రైళ్లుగా నడిచిన రైళ్లకే.. కొన్ని స్టాప్​లను తగ్గించి.. ప్రత్యేక రైళ్ల పేరుతో నడిపిస్తున్నారు. ఛార్జీలు మాత్రం ఎక్స్​ప్రెస్ రైళ్ల మాదిరిగా వసూలు చేస్తున్నారు.

  • త్వరలో నిర్ణయం

కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి శుభవార్త. సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేలా నగదు రూపంలో సాయం అందించే విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం ఈ మేరకు స్పందించారు.

  • పెగాసస్​ ప్రకంపనలు

కర్ణాటకలో గత కాంగ్రెస్‌ - జేడీఎస్‌ ప్రభుత్వానికి చెందిన కొందరు కీలక నేతల ఫోన్‌ నంబర్లు కూడా పెగాసస్ హ్యాకింగ్​ టా​ర్గెట్ జాబితాలో ఉన్నట్లు ప్రముఖ వార్త సంస్థ ది వైర్​ పేర్కొంది. దీంతో ఆ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి ఈ హ్యాకింగ్‌ వ్యవహారానికి సంబంధముందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • గబ్బిలాల్లో కరోనా!

భూలోకాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ పుట్టుపూర్వోత్తరాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే.. చైనాలో బయటపడ్డ కొవిడ్‌ మహమ్మారి తొలుత గబ్బిలాల నుంచి మానవులకు సోకిందనే వార్తలు వచ్చాయి. కానీ, దీనికి ఎటువంటి రుజువులు లభించలేదు. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19కు కారణమైన నావెల్‌ కరోనా వైరస్‌ రకాన్ని బ్రిటన్‌ గబ్బిలాల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు.

  • ఒలింపిక్స్​ రద్దు అవ్వొచ్చు!

టోక్యో ఒలింపిక్స్​ను ఆఖరి నిమిషంలో రద్దు చేయోచ్చనే వార్తలను నిర్వాహక కమిటీ అధ్యక్షుడు తోషిరో ముటో తోసిపుచ్చలేకపోయారు. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న ఈ మెగా ఈవెంట్​ అర్ధాంతరంగా ఆపే సూచనలున్నాయని ఆయన పరోక్షంగా తెలియజేశారు.

05:18 July 21

టాప్​ న్యూస్​

  • హ్యాపీ బక్రీద్..

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్​లు ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగానికి ప్రతీక అని.. ఇస్లాం సంప్రదాయంలో ఈ పండుగకు ప్రత్యే స్థానముందన్నారు. కొవిడ్ నేపథ్యంలో అందరూ నిబంధనలకు లోబడే పండుగను జరుపుకోవాలని తమిళిసై తెలిపారు.

  • భూమి రేటు పైపైకి..

ఎనిమిదేళ్ల తరువాత తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ రుసుములు పెరిగాయి. సుదీర్ఘంగా కసరత్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సవరించిన నూతన విలువలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి.

  • అంతర్గత పరీక్షలే!

ఇంటర్మీడియట్​లో అర్ధ సంవత్సరం లేదా ఇంటర్నల్ పరీక్షల విధానం ప్రవేశపెట్టాలని బోర్డు భావిస్తోంది. ఈ విద్యా సంవత్సరం 220 పని దినాలు ఉండేలా విద్యా క్యాలెండరును ప్రణాళిక చేస్తోంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దసరా, సంక్రాంతి సెలవులను కుదించాలని యోచిస్తోంది.

  • రోబో సీన్ రిపీట్..

చక్కగా చదువుకుని కొలువు సాధించరా అంటే.. చావు తెలివి తేటలు ప్రదర్శించి చిప్పకూడు తినే పరిస్థితి తెచ్చుకున్నాడు హరియాణాకు చెందిన ఓ యువకుడు. అత్యంత పకడ్బందీగా నిర్వహించే వైమానికదళ పరీక్షల్లోనే కాపీ కొట్టేందుకు ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు.

  • మరో ఏడాది..

కృష్ణా ట్రైబ్యునల్‌ కాలపరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రజల్‌శక్తి శాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. 2021 ఆగస్టు 1 నుంచి మరో ఏడాది పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య కృష్ణా జలాల పంపిణీకి 2004 ఏప్రిల్‌ 2న ఏర్పాటైన ట్రైబ్యునల్‌..ఆరేళ్లు విచారణ జరిపి 2010 డిసెంబర్‌ 30న తీర్పు వెలువరించింది. 

  • సుప్రీం కీలక తీర్పు

బహుళ రాష్ట్రాల సహకార సంఘాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. రాష్ట్రాల పరిధిలోని అంశాల్లో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేసే చట్టాలు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. సహకార సంఘాల నిర్వహణ విషయమై యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 97వ రాజ్యాంగ సవరణ తీరును తప్పుపట్టింది. ఆ రాజ్యాంగ సవరణను పాక్షికంగా రద్దు చేసింది.

  • ఆ అధికారం కోర్టుకు లేదు

మధ్యవర్తిత్వ, రాజీ చట్టం-1996 పై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. మధ్యవర్తిత్వ తీర్పులను మార్పుచేసే అధికారం కోర్టుకు లేదని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్​ ఆర్​.ఎఫ్​. నారిమన్​, జస్టిస్​ బి.ఆర్. గవాయ్​ల ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

  • క్షిపణి పరీక్ష విజయవంతం..

అత్యాధునిక హైపర్‌సోనిక్‌ క్షిపణిని పరీక్షించింది రష్యా. ధ్వని వేగానికి 7 రెట్ల అధిక వేగంతో ప్రయాణించి 350 కి.మీ. దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని సమర్థవంతంగా పూర్తిచేసిందని ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. తెల్లసముద్రంలో అడ్మిరల్‌ గోర్షకోవ్‌ యుద్ధ నౌక నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 

  • టీమ్ఇండియాదే సిరీస్​..

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని 49.1 ఓవర్లలో చేధించింది. దీంతో 2-0తో గబ్బర్​ సేన సిరీస్​ను కైవసం చేసుకుంది. 

  • 'హ్యాపీ' బర్త్​డే

'హ్యాపీడేస్'​తో హిట్​ కొట్టి.. 'కొత్త బంగారులోకం' సినిమాతో యువతను తనవైపు తిప్పుకున్న హీరో వరుణ్​ సందేశ్​(Varun Sandesh). నేడు(జులై 21) వరుణ్​ సందేశ్​ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని సినీ కెరీర్​తో పాటు వ్యక్తిగత జీవితంపై ఓ లుక్కేద్దాం.

Last Updated : Jul 21, 2021, 10:17 PM IST

ABOUT THE AUTHOR

...view details