- మర్యాద పూర్వకంగా...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(nv ramana)ను సీఎం కేసీఆర్(CM KCR) కలిశారు. రాజ్‌భవన్ అతిథి గృహంలో బస చేసిన ఆయనను.. కేసీఆర్(CM KCR) కలిసి పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- ప్రజల ప్రాణాలను కాపాడాలి...
ప్రజలకు వేగంగా వ్యాక్సిన్‌ను అందించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. కొవిడ్ మూడో విడత ఉద్ధృతి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- రాజకీయ కురుక్షేత్రమే...
మాజీమంత్రి ఈటల రాజేందర్ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నెల 14న తన అనుచరులతో కలిసి భాజపాలో చేరనున్న నేపథ్యంలో శాసనసభాపతి కార్యాలయంలో కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు. సభాపతి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- అద్భుతంగా అభివృద్ధి చేయాలి...
దేశంలోని ఇతర ప్రాజెక్టులకన్నా మానేరు రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ప్రాజెక్టు కేవలం కరీంనగర్ పట్టణానికే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- కొత్తగా 1,771 కరోనా కేసులు...
నిన్నటితో పోలిస్తే రాష్ట్రంలో ఈ రోజు కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ కొత్తగా 1,771 మంది వైరస్ బారిన పడగా.. 13 మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి నుంచి మరో 2,384 మంది బాధితులు విముక్తి పొందారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్!...