తెలంగాణ

telangana

By

Published : Sep 18, 2022, 9:01 PM IST

ETV Bharat / city

Telangana Top news: 9PM టాప్​ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top news: 9PM టాప్​ న్యూస్
Telangana Top news: 9PM టాప్​ న్యూస్

  • 125 సినిమా హాల్స్​లో రాణి అంత్యక్రియలు లైవ్.. 36కి.మీ బారికేడ్లు..

UK queen funeral : బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాచరికపు సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారవ్యవహారాలను పాటిస్తూ రాణికి సోమవారం తుది వీడ్కోలు పలకనున్నారు.

  • పీఎఫ్ఐ కేసులో ఎన్‌ఐఏ సోదాలు..

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా - పీఎఫ్​ఐ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ - ఎన్​ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇవాళ తెల్లవారుజామున నిజామాబాద్​తో పాటు నిర్మల్ జిల్లా భైంసా, జగిత్యాల పట్టణంలో సుమారు 20 ప్రదేశాల్లో సోదాలు చేపట్టింది. ఈ కేసులో అరెస్టైన వారితో పాటు పలువురు అనుమానితుల ఇళ్లలోనూ ఎన్​ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాడుల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

  • మూడో రోజూ ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

Telangana National Unity Vajrotsavam: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు మూడోరోజూ ఘనంగా జరిగాయి. జిల్లాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచాయి. స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సన్మానించుకున్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.

  • బీ అలర్ట్​.. రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన..!

TS Weather Report: రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రాష్ట్రంలోకి వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని ప్రకటించిన వాతావరణ శాఖ.. ఈ నెల 20న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

  • మునుగోడు ప్రజల తీర్పుపైనే రాష్ట్ర భవిష్యత్తు: భట్టి విక్రమార్క

కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని తెరాస మునుగోడు ప్రజలను డబ్బుతో తమవైపు తిప్పుకోవాలని.. రూ.వందల కోట్లు తీసుకొచ్చి వారి ఆత్మగౌరవం పట్ల అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. సిద్ధాంతాల భావజాలానికి మునుగోడు ప్రజలు కట్టుబడి ఉంటారే తప్ప డబ్బులకు అమ్ముడుపోరని తెలిపారు. ధన అహంకారాన్ని ప్రదర్శిస్తున్న తెరాస, భాజపా మెడలు వంచడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

  • 'రాష్ట్ర రాజధాని ఇదీ అని చెప్పుకునే పరిస్థితి ఉందా..?'

Justice Battu Devanand on 3 capitals: ఏపీలోని తాజా పరిణామాలపై ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో తెలుగు వారికి ఇదీ రాష్ట్ర రాజధాని అని చెప్పుకొనే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. బయట వారి వద్ద అవమానాలు ఎదుర్కొనే పరిస్థితికి తెలుగు జాతి చేరిందని ఆవేదన చెందారు.

  • ఉచితాలపై తగ్గని ఆప్.. తటపటాయిస్తున్న భాజపా.. 2022 బాద్​షా ఎవరో?

AAP Freebies in Gujarat: గుజరాత్​లో శాసనసభ ఎన్నికలకు మరో కొన్ని నెలల సమయమే ఉంది. ఇప్పుడు దేశమంతా ఆ ఎన్నికల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉచిత పథక హామీలు కురిపిస్తుంటే.. భాజపా మాత్రం సైలెంట్​గా ఉంది. ఉచితాలను కాషాయ పార్టీ వ్యతిరేకిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఆప్ ఉచితాలకు ప్రజలు ఆకర్షితులై ఆ పార్టీకి పట్టం కడతారా? లేదంటే మళ్లీ భాజపాను గెలిపిస్తారా? భాజపా.. ఉచితాలపై తన వైఖరి మార్చుకుంటుందా?

  • 'క్రెడిట్‌ కార్డ్' vs 'బయ్ నౌ పే లేటర్'.. రెండింట్లో ఏది బెటర్?

పండగలు వచ్చేస్తున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్లూ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇ-కామర్స్‌ దిగ్గజాలు తమ రాయితీ అమ్మకాల తేదీలనూ ప్రకటించాయి. మరోవైపు కొనుగోలుదారులూ వీటిని నిశితంగా గమనిస్తున్నారు. రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పండగ కొనుగోళ్లు అధికంగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు, 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' (బీఎన్‌పీఎల్‌) ప్రధాన పాత్ర పోషించనున్నాయి. మరి ఈ రెండింటిలో ఏది మనకు అనుకూలమో చూద్దాం.

  • విరాట్ కోహ్లీ న్యూ హెయిర్​ స్టైల్​​.. ఫొటోలు వైరల్​!

ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్​కు ముందు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కొత్త లుక్​లో దర్శనమిచ్చాడు. న్యూ హెయిర్ స్టైల్​తో ఆకట్టుకుంటున్నాడు.

  • ఉరేసుకుని యువ నటి ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?

పలు చిత్రాల్లో నటించిన యువ నటి దీప.. తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే గత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న దీప.. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు మాత్రం ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details