తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top news: 9PM టాప్​ న్యూస్ - టాప్​ న్యూస్ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS

By

Published : Sep 4, 2022, 8:58 PM IST

  • డివైడర్​ను ఢీకొట్టిన కారు.. టాటా సన్స్​ మాజీ ఛైర్మన్​ మిస్త్రీ కన్నుమూత

టాటా సన్స్​ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త​ సైరస్​ మిస్త్రీ(54) కన్నుమూశారు. మహారాష్ట్ర ముంబయి సమీపంలోని పాల్ఘర్​ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అహ్మదాబాద్​ నుంచి ముంబయి వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్​ కారు డివైడర్​ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

  • 'గతంలో గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీ.. మన్మోహన్‌ సింగ్‌ ఫొటో పెట్టారా?'

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ఆర్థికమంత్రి వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఉపయోగిస్తే మోదీ ఫోటో పెట్టాల్సిందే అని మాట్లాడటంలో ఔచిత్యం లేదన్నారు.

  • కేంద్రమంత్రి గారు.. మోదీ సర్కార్ చేసిన అప్పుల సంగతేంటి..?

ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ అప్పులపై మాట్లాడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్రం అప్పులపై కూడా స్పందించాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. మోదీ పుణ్యమా ఇప్పుడు ప్రతీ భారతీయుడిపై లక్షా 25వేల అప్పు ఉందని ట్వీట్ చేశారు.

  • నిమ్స్​లో కు.ని బాధితులకు గవర్నర్ పరామర్శ.. ఆర్థిక సాయం ప్రకటన

ఆపరేషన్‌లు అధికంగా చేయాలనే లక్ష్యంతో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదు అని గవర్నర్‌ తమిళిసై అన్నారు. నిమ్స్‌లో చికిత్స పొందతున్న ఇబ్రహీంపట్నం కు.ని బాధితులను పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న 11 మంది బాధితులకు గవర్నర్ ఆర్థిక సాయం ప్రకటించారు.

  • ఖైరతాబాద్​కు పోటెత్తిన భక్తులు..

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకునేందుకు జంట నగరాల నుంచి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున వచ్చారు. భక్తుల రద్దీ ఎక్కువైపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

  • ఫోన్​లో గేమ్​ ఆడుతూ చనిపోయిన బాలుడు.. అసలేమైందంటే?

ఫోన్​లో గేమ్​ ఆడి ప్రాణాలు కోల్పోయాడు ఓ బాలుడు. పాము కాటు వేస్తున్నా పట్టించుకోకుండా ఫోన్​లో ఫ్రీ ఫైర్​ ఆడుతున్నాడు. పాము కాటేసే సమయంలో అతడు అలాగే గేమ్​ కొనసాగించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​ ఇందోర్​లోని చందన్​నగర్​లో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

  • 'దేశంలో విద్వేషం పెరుగుతోంది.. ఆ ఇద్దరు మాత్రం లాభపడుతున్నారు'

భాజపా, ఆరెస్సెస్ దేశాన్ని విడగొడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల దేశంలో విద్వేషం అధికమవుతోందని అన్నారు. దీని వల్ల ఇద్దరు పారిశ్రామికవేత్తలు లాభపడుతున్నారని ఆరోపించారు.

  • మాజీ మంత్రి కేకే శైలజ సంచలన నిర్ణయం.. ఏం చేశారంటే?

కేరళ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, సీపీఎం సీనియర్‌ నేత కేకే శైలజ ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసే అవార్డును తిరస్కరించారు. 'ఫిలిప్పీన్స్‌లో కమ్యూనిస్టులపై క్రూరత్వానికి పాల్పడిన దివంగత అధ్యక్షుడు రామన్‌ మెగసెసే పేరుతో ఇస్తున్న ఈ అవార్డును స్వీకరించేందుకు నిరాకరిస్తున్నట్టు' తెలిపారు.

  • బ్రిటన్ తదుపరి ప్రధానిగా.. లిజ్ ట్రస్ ఎన్నిక లాంఛనమేనా?

బ్రిటన్​ తదుపరి ప్రధానమంత్రి ఎవరనే ఉత్కంఠకు సోమవారం తెరపడనుంది. బోరిస్ జాన్సన్‌ వారసుడి పదవికి లిజ్‌ ట్రస్‌, భారత సంతతి నేత రిషి సునాక్‌ పోటీ పడ్డారు. శుక్రవారంతో కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల ఓటింగ్ ప్రక్రియ ముగియగా.. సోమవారం ఫలితాలు ప్రకటించనున్నారు. సునాక్‌పై లిజ్‌ ట్రస్‌ విజయం సాధిస్తారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

  • 'బ్రహ్మాస్త్ర' మేకింగ్​ వీడియో విడుదల.. తెర వెనక కష్టమిదీ

భారీ బడ్జెట్​తో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్‌, అలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీరాయ్‌ కలిసి నటించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అయాన్‌ ముఖర్జీ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details