తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @7PM - టాప్ న్యూస్ 7

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
టాప్ న్యూస్ @7PM

By

Published : May 4, 2022, 6:59 PM IST

  • యాదాద్రి భక్తులకు ఊరట..

యాదాద్రిలో పార్కింగ్ ఫీజు విషయంలో యాదగిరిగుట్ట దేవస్థానం కమిటీ వెనక్కి తగ్గింది. పార్కింగ్ ఫీజు నిబంధనల్లో అధికారులు మార్పులు చేశారు. పార్కింగ్​కు అదనపు గంటగా నిర్ణయించిన రూ.100 అదనపు రుసుము ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు.

  • 'తెరాస ల‌క్ష్యంగా వరంగల్ సభ'

రాహుల్ సభను విజయవంతం చేసేందుకు సమన్వయం చేసుకునేందుకు కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ కార్యక్రమాల క‌మిటీ ఛైర్మన్‌ ఏలేటి మ‌హేశ్వర రెడ్డి తెలిపారు. వారికి బాధ్యతలు ఇప్పటికే అప్పగించామని వెల్లడించారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

  • 'లైఫ్​ ఆఫ్​ గర్ల్​'.. వారికి కొండంత ధైర్యం..

విద్యార్థినుల, మహిళా సిబ్బంది భద్రత కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓ సరికొత్త యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘"లైఫ్‌ ఆఫ్‌ గర్ల్‌"’ పేరిట భద్రతకు సంబంధించిన సూచనలు ఇవ్వడంతో పాటు మానసిక సమస్యలను పరిష్కరించుకునేలా యాప్​లో వినూత్న ఫీచర్లను పొందుపరిచింది.

  • మామిడి ప్రియులకు గుడ్​న్యూస్...!

రుచిలో ఫల రారాజు మామిడి. అందులోనూ వందల రుచులను అందిస్తోంది సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం. ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా... 450కి పైగా రకాల మామిడి పండ్ల స్వచ్ఛమైన రుచిని.... మామిడి ప్రియులకు చేరువ చేస్తోంది.

  • 'ఐక్యత ద్వారానే యాదవుల అభివృద్ధి'

Yadava Mahasabha: యాదవుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తూ... రాజకీయంగా విశేషంగా ప్రోత్సహిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ చెప్పారు. యాదవులు ఐక్యంగా ఉండడం వల్లే అభివృద్ధి చెందుతారని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు.

  • కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి.. ఏఈపై దాడి

Attack on AE in karepally: విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి మరణానికి ఏఈనే కారణమని ఆరోపిస్తూ మూకుమ్మడిగా దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఏఈ పరుగులు తీశారు. చివరికి వారి దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగింది.

  • చిదంబరానికి నిరసన సెగ.. సొంత పార్టీ న్యాయవాదుల నుంచే..

కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు పి.చిదంబరానికి నిరసన సెగ తగిలింది. ఓ కేసు వాదించడానికి కోల్​కతా హైకోర్టుకు ఆయన బుధవారం వెళ్లారు. ఒక్కసారిగా చుట్టుముట్టిన సొంత పార్టీ న్యాయవాదులు నిరసన తెలిపారు.

  • జాక్​మాపై వదంతులు.. 26 బిలియన్ డాలర్లు ఆవిరి!

Alibaba Jack ma: ఈ-కామర్స్​ దిగ్గజం అలీబాబా అధినేత జాక్​మా అరెస్టయ్యారనే వదంతులు హాంకాంగ్ స్టాక్​మార్కెట్​లో ప్రకంపనలు సృష్టించాయి. సంస్థ షేర్లు 9.4శాతం కుప్పకూలాయి. 26 బిలియన్​ డాలర్ల మదుపర్ల సంపదం ఆవిరైంది. చివరకు అసలు నిజం తెలిసి అలీబాబా షేర్లు మళ్లీ పుంజుకున్నాయి. చైనాలో ఈ నాటకీయ పరిణామాలకు కారణమేంటంటే..?

  • టోల్​ ఛార్జీలకు కొత్త రూల్స్.. వాటికి మాత్రమే వసూలు!

ఫాస్టాగ్​తో టోల్​ ఛార్జ్​ వసూలు విధానంలో ఇప్పటికే విప్లవాత్మక మార్పులు తెచ్చింది కేంద్రం. ఇప్పుడు మరో కీలక సంస్కరణకు సిద్ధమవుతోంది. టోల్​గేట్​ వద్ద ప్రతి వాహనానికి ఫిక్స్​డ్​ ఛార్జీ వసూలు చేసే విధానాన్ని మార్చాలని భావిస్తోంది

  • ఆ తేదీకి ముందే ఓటీటీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. కానీ ఓ కండీషన్​!

జూనియర్​ ఎన్టీఆర్​, రామ్​చరణ్​ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్​ఆర్​ఆర్ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ జీ5, నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి అందుబాటులో ఉండనుందని సమాచారం. అయితే ఈ సినిమాను చూడాలంటే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్​ చిన్న మెలిక పెట్టినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details