తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @5 PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS @5PM
టాప్‌టెన్ న్యూస్ @5 PM

By

Published : Jun 12, 2021, 5:00 PM IST

Updated : Jun 12, 2021, 5:07 PM IST

  • యాదాద్రికి జస్టిస్ ఎన్వీ రమణ...

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(nv ramana) సోమవారం(జూన్​ 14న) యాదాద్రి వెళ్లనున్నారు. ఈ మేరకు న్యాయమూర్తి దంపతులు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ప్రజల ప్రాణాలు కాపాడాలి...

ప్రజలకు వేగంగా వ్యాక్సిన్​ను అందించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు కేంద్రాన్ని కోరారు. కొవిడ్ మూడో విడత‌ ఉద్ధృతి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ఆత్మగౌరవం కోసం పోరాటం...

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నెల 14న తన అనుచరులతో కలిసి భాజపాలో చేరనున్న నేపథ్యంలో శాసనసభాపతి కార్యాలయంలో కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు. సభాపతి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ఆ జిల్లాల్లో భారీ వర్షాలు...

శుక్రవారం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని... హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నేడు, రేపు ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ఆర్టికల్​ 370 పునరుద్ధరణ!...

ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రత్యేక హోదా రద్దు అంశంపై కాంగ్రెస్ పునరాలోచిస్తుందని దిగ్విజయ్ పేర్కొనడంపై భాజపా మండిపడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • మామిడి కాయలు ఆశచూపి అత్యాచారం...

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు ఓ వ్యక్తి. మామిడి కాయలు ఇస్తానని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్​ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరిగింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • మనసు దోచేసింది...

యజమానిపై ఓ శునకం చూపించిన ప్రేమ నెటిజన్లను కట్టిపడేస్తోంది. టర్కీలో అనారోగ్యం బారినపడిన యజమానిని తరలిస్తున్న అంబులెన్సును వెంటాడింది శునకం. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • ఔషధాలపై జీఎస్​టీ తగ్గింపు...

జీఎస్​టీ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. కొవిడ్​ ఔషధాలు, పరికరాలపై జీఎస్​టీ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • బాల్​ నా ప్రధాన అస్త్రం...

శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో యువ క్రికెటర్​ కృష్ణప్ప గౌతమ్​ చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ముఖాముఖిలో పాల్గొన్నాడు ఈ యువ బౌలర్​. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • పవన్​ కల్యాణ్​తో మానస!...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Klayan) హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతుంది. అయితే ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణ నటించబోతుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిందీ నటి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 12, 2021, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details