తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్​@ 11AM - latest news in Telugu

ఇప్పటి వరకున్న ప్రధాన వార్తలు...

top news at 11am
top news at 11am

By

Published : Sep 13, 2020, 10:50 AM IST

1.రికార్డుస్థాయిలో కేసులు...

గడిచిన కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రపంచంలోనే రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో భారత్​లోనే అత్యధికంగా వెలుగుచూస్తున్నాయి. కొత్తగా 94 వేల 372 కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.రాష్ట్రంలో కరోనా వ్యాప్తి...

రాష్ట్రంలో కొత్తగా 2,216 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,57,096కు చేరింది. జీ11 మంది మహమ్మారి బారిన పడి మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 961కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.నేడు భారీగా.. రేపు అతి భారీగా...

రాష్ట్రంలో నేడు భారీ, రేపు అతి భారీ వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు

కురుస్తున్నట్లు అధికారులు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.జాప్యం వద్దు...

కరోనా మహమ్మారి బారిన పడిన రోగులకు సకాలంలో చికిత్సను అందించాలని ప్రైవేటు ఆసుపత్రులకు సూచించింది కేంద్రం. బాధితులను ఆసుపత్రుల్లో చేర్చుకోవటంలో అవరోధాలు, చికిత్స అందించటంలో వివక్ష చూపరాదని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.ఒకే ఓటరు జాబితా...

ఓటర్ల జాబితా విషయంలో గందరగోళం అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఓపీ రావత్ పేర్కొన్నారు. ఎన్నికల నేరాల కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. మన ఎన్నికల చట్టాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.న్యాయమూర్తులే బాధితులు...

న్యాయమూర్తుల జీవితాలేమీ పూలపాన్పులు కాదని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పష్టం చేశారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో విమర్శలు, అభాండాలు వస్తుండటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.ఏచూరిపై అభియోగాలు...

దిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో నమోదు చేసిన అనుబంధ ఛార్జిషీట్​లో సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై అభియోగాలు మోపారు పోలీసులు. సీఏఏ వ్యతిరేక నిరసనకారులను రెచ్చగొట్టారనే ఆరోపణలు నమోదు చేశారు. జేఎన్​యూ, జామియా మిలియా విద్యార్థులు ఇచ్చిన స్టేట్​మెంట్ ఆధారంగా ఈ అభియోగపత్రం రికార్డు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.అమెరికా, బ్రెజిల్​లో పంజా...

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 వేగంగా వ్యాప్తి చెందుతోంది. అమెరికా, భారత్​, రష్యాలతో పాటు ఇతర దేశాల్లోనూ వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 90 లక్షలకు చేరువైంది. 9.24 లక్షల మంది మరణించారు. 2 కోట్ల 8 లక్షల మంది వైరస్​ నుంచి కోలుకోవటం ఊరట కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.మరో కోణంలో డ్రగ్స్​ కేసు...

కన్నడ పరిశ్రమలో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కేసును మరో కోణంలో విచారించేందుకు రంగంలోకి దిగింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ). ఇప్పటికే రాగిణి, సంజనా గల్రానీలపై ప్రత్యేకంగా కేసు దాఖలు చేసి వివరాల సేకరణ ప్రారంభించింది. వీరిద్దరూ బినామీల పేర్లతో ఆదాయార్జనకు దిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.సముద్రం అడుగున షూటింగ్​...

ప్రఖ్యాత హాలీవుడ్​ దర్శకుడు జేమ్స్​ కామెరూన్​ దర్శకత్వంలో 'అవతార్​ 2' శరవేగంగా తెరకెక్కుతోంది. సముద్ర అంతర్భాగం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. చిత్రీకరణకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details