తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News: టాప్​న్యూస్ @5PM - Telangana News

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

By

Published : Jul 29, 2022, 4:58 PM IST

  • హైదరాబాద్‌లో ఈదురుగాలులతో భారీ వర్షం..

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. మధ్నాహ్నాం వరకు ఎండ కొట్టగా.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చినుకులతో మొదలైన భారీగా వర్షం మారింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

  • కుంచిత రాజకీయాల కోసమే ఐటీఐఆర్ రద్దు: కేటీఆర్‌

హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయంగా విభేదిస్తున్నామన్న కారణంతో మోదీ సర్కార్‌ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసి.... తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు.

  • క్యాసినో వ్యవహారంలో మంత్రులు, ఎమ్మెల్యేల పాత్రపై అధికారుల ఆరా..!

రాష్ట్రంలో సంచలనంగా మారిన క్యాసినో వ్యవహారంపై ఈడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తిగా ఉన్న చికోటి ప్రవీణ్​కు తెలుగురాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో గల సన్నిహిత సంబంధాలపైన అధికారులు ఆరా తీస్తున్నారు.

  • వీడు మామూలు దొంగ కాదండోయ్​..

ఓ దొంగ చేసిన బైక్​ చోరీ అందరు అవాక్కయ్యేలా చేస్తోంది. చేయాలనుకున్న దొంగతనాన్ని.. సులువుగా.. ఎలాంటి ఆధారం లేకుండా జాగ్రత్తపడిన విధానం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. సీసీ కెమెరాకు కూడా దొరకకుండా.. ఆ చోరుడు వాడిన దొంగ తెలివితేటలు చూసి.. నోరెళ్లబెట్టాల్సిందే..!

  • '24 గంటల్లో ఆ ట్వీట్లు తొలగించండి.. లేదంటే'..

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుటుంబంపై ఆరోపణలు నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలకు సమన్లు జారీ చేసింది దిల్లీ హైకోర్టు. ఆగస్టు 18న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. స్మృతి ఇరానీ వ్యవహారంలో చేసిన ట్వీట్లను 24 గంటల్లోగా డిలీట్ చేయాలని సూచించింది.

  • 700 అడుగుల లోతు బోరుబావిలో బాలిక.. రక్షించిన ఆర్మీ

12 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన ఘటన గుజరాత్​లోని సురేంద్రనగర్​లో జరిగింది. సుమారు ఐదుగంటల పాటు శ్రమించిన సహాయక సిబ్బంది.. బాలికను సురక్షితంగా బయటకు తీశారు.

  • సెన్సెక్స్​ 712 పాయింట్లు ప్లస్

స్టాక్​ మార్కెట్లు వరుసగా మూడో సెషన్​లోనూ లాభాల్లో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 712 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 229 పాయింట్లు వృద్ధి చెందింది.

  • 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్​కు మూడో ర్యాంక్‌.. మరి ఇప్పుడో?

దాదాపు 70కిపైగా దేశాలు.. 5వేల మందికిపైగా క్రీడాకారులు.. 20 క్రీడల్లో 280 ఈవెంట్లు.. ఇలా పది రోజులపాటు జరిగే మినీ క్రీడా సంగ్రామం కామన్వెల్త్‌ గేమ్స్‌.. శుక్రవారం బర్మింగ్‌హామ్‌ వేదికగా పోటీలు ప్రారంభకానున్నాయి. అయితే ఇప్పటి వరకు కామన్వెల్త్‌ పోటీల్లో భారత్‌ ఎన్ని పతకాలను సొంతం చేసుకుంది? గతసారి జరిగిన క్రీడల్లో ఎన్ని వచ్చాయి? తదితర విశేషాలను తెలుసుకుందాం రండి.

  • 'జైలుపై ఉక్రెయిన్​ బాంబు దాడి.. 40 మంది మృతి.. అందరూ సొంతవాళ్లే!'​

ఉక్రెయిన్ చేసిన​ బాంబు దాడి వల్ల ఓ జైలులో ఉన్న 40 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని రష్యా మద్దతు గల వేర్పాటువాదుల ప్రతినిధి తెలిపారు. ఆ ఘటనలో 130 మంది గాయపడ్డారని కూడా చెప్పారు.

  • ​తిన్న తర్వాత వాకింగ్​ చేయొచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా?

సాధారణంగా చాలా మందికి వాకింగ్​ విషయంలో అనేక సందేహలు ఉంటాయి. పరగడుపున నడవాలా? ఏదైనా తిన్న తర్వాతైనా నడవొచ్చా? రోజులో ఏ సమయంలోనైనా నడవొచ్చా? ఇంట్లో కూడా వాకింగ్​ చేయొచ్చా? వీటిన్నంటిపైన నిపుణులు ఏమంటున్నారంటే..

ABOUT THE AUTHOR

...view details