తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News: టాప్​న్యూస్ @5PM - 5PM TOPNEWS

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

By

Published : Jul 28, 2022, 4:59 PM IST

  • బంగాల్​ మంత్రి పార్థా ఛటర్జీ బర్తరఫ్

ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అరెస్టైన బంగాల్​ మంత్రి పార్థా ఛటర్జీని బర్తరఫ్ చేశారు. ఈ మేరకు బంగాల్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది.

  • 'మాధవరెడ్డి దగ్గరున్న కారు స్టిక్కర్​ నాదే..'

క్యాసినో వ్యవహారంలో మాధవరెడ్డి ఇంట్లో దొరికిన ఎమ్మెల్యే కారు స్టిక్కర్​పై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తన ఎమ్మెల్యే కారు స్టిక్కర్​ మాధవరెడ్డి ఇంట్లో ఎందుకుందనే విషయమై వివరణ ఇచ్చారు.

  • గాంధీభవన్​ ముట్టడికి భాజపా ఎస్టీ మోర్చా యత్నం..

భాజపా ఎస్టీ మోర్చా నాయకులు గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్‌ చౌదరి.. రాష్ట్రపతి దౌపది ముర్ముపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై భాజపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను పోలీసులు అడ్డకున్నారు.

  • ప్రమాదకరంగానే మూసీ ప్రవాహం..

ఎగువ నుంచి వస్తున్న వరదతో యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ పరవళ్లు తొక్కుతోంది. వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద లోలేవల్ వంతెన మీదుగా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. రెండురోజులుగా ఉగ్రరూపం దాల్చిన మూసీ ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టింది.

  • 'ఆధార్ అనుసంధానం ఐచ్ఛికమే..'

ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం ఐచ్ఛికం మాత్రమేనని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. అయితే వివరాలు సేకరిస్తున్న సమయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • సోనియా వర్సెస్​ స్మృతి.. లోక్​సభలో 'పర్సనల్​ ఫైట్!'

ఉదయాన్నే సభలు ప్రారంభం.. విపక్షాల నినాదాలు, ఆందోళనలు, వాయిదా.. కాసేపటికే పునఃప్రారంభం, మళ్లీ వాయిదా.. సభ్యుల సస్పెన్షన్.. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో కొద్దిరోజులుగా ఇదే తంతు జరుగుతుంది. ధరల పెరుగుదల వంటి పలు అంశాలపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూసిన కాంగ్రెస్​ సహా విపక్షాలకు అధీర్​ రంజన్​ చౌదరి రూపంలో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

  • 17 ఏళ్లకే ఓటు హక్కు కోసం నమోదు.. ఈసీ కొత్త రూల్స్

17 ఏళ్ల దాటిన వారు కూడా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేలా వెసులుబాటును కల్పించింది ఎన్నికల సంఘం. ఓటు హక్కు దరఖాస్తు చేసేందుకు ఇక నుంచి 18 ఏళ్లు దాటేవరకు వేచిచూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

  • ఆకతాయిని చెప్పుతో చితక్కొట్టిన మహిళ..

గుజరాత్​లో మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. సూరత్​లోని గోడాదరా ప్రాంతంలోనూ ఇలాగే ఓ వ్యక్తి కొన్నిరోజులుగా కొందరితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. బుధవారం.. సారాజాహేర్​ మార్గంలో ఇలాగే చేస్తుండగా.. ఓ మహిళ అతడికి చుక్కలు చూపించింది.

  • స్టాక్​ మార్కెట్లలో ఫుల్​ జోష్​.. సెన్సెక్స్​ 1000 ప్లస్​..

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 1041 పాయింట్లు, నిఫ్టీ 287 పాయింట్లు లాభపడ్డాయి.

  • రవితేజకు షాక్​.. 'రామారావు ఆన్​ డ్యూటీ' సీన్స్​ లీక్​!

'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రబృందానికి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్​మీడియాలో లీకయ్యాయి. ఎడిటింగ్​ రూమ్​ నుంచే ఇవి లీక్​ అయినట్లు చిత్ర బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details