గ్రహణం వేళ జపయజ్ఞం
సూర్యగ్రహణం వేళ తిరుమల క్షేత్రం వేదమంత్రాలతో ప్రతిధ్వనించింది. శ్రీవారి పుష్కరిణిలో తితిదే జపయజ్ఞం నిర్వహించింది. ఆలయ అర్చకులు, జియ్యంగార్లు, ప్రముఖ వేద పారాయణదారులు, తితిదే సిబ్బంది ఆధ్వర్యంలో జపయజ్ఞం సాగింది. దీని వల్ల కలిగే ప్రతిఫలం ఏమిటంటే...
ఆ ఆలయం గ్రహణాలకు అతీతం
సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం వస్తే ప్రపంచంలోని అన్ని దేవాలయాలు దాదాపు మూసివేస్తారు. కానీ దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాత్రం దర్శనాలు కొనసాగుతునే ఉంటాయి. ఆ ఆలయం ప్రత్యేకతిదే..
దెబ్బకు దెబ్బే సమాధానం
సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. చైనా సైన్యం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా తీవ్రంగా ప్రతిఘటించేలా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
ఏరివేత..
శ్రీనగర్‌లోని జాదిబాల్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది.
లైవ్ వీడియో: నదిలో పడిన వధూవరుల కారు
ఝార్ఖండ్ పలాము జిల్లాలో పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్తున్న వధూవరుల కారు అదుపు తప్పి నదిలో పడిపోయింది. నదీ ప్రవాహానికి ఆ వాహనం అర కిలోమీటర్ వరకు కొట్టుకుపోయింది. పూర్తి వివరాలు మీకోసం
తస్మాత్ జాగ్రత్త
కరోనా వైరస్ హెచ్చరికలు, ఆర్థిక సేవల పేరిట సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్'(సీఈఆర్‌టీ-ఇన్) హెచ్చరించింది. కరోనాకు సంబంధించిన ప్రభుత్వ సహాయ కార్యక్రమాల పేరుతో హానికరమైన ఈ-మెయిల్స్‌తో ప్రజల్ని మభ్యపెట్టే అవకాశం ఉందని వెల్లడించింది. వారి బారిన పడకుండా ఉండాలంటే ఏమి చేయాలంటే...
పెరుగుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకీ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆదివారం 477 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,929కి చేరింది. ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది.
ఇది కరోనా ట్రెండ్
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా భారీ ఎత్తున జనసమూహాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. భారత్‌లో ఎన్నికల విషయాన్నికొచ్చే సరికి ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈసారి ఎలా సన్నద్ధమవుతున్నామంటే.
ఇది మనందరి బాధ్యత
భావితరాలు సంతోషంగా ఉండాలంటే, ఈ పుడమితల్లిని పచ్చగా ఉంచాలన్నాడు యువహీరో కార్తీకేయ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటుడు విశ్వక్ సేన్ ఛాలెంజ్ స్వీకరించి, జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటి తనవంతు బాధ్యత చాటుకున్నాడు. ఈ సందర్భంగా ఇలా చెప్పుకొచ్చాడు.
బాట్ పట్టేది ఐపీఎల్‌లోనే..
కరోనా ప్రభావంతో ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. తనతో సహా ఆస్ట్రేలియా క్రికెటర్లంతా ఐపీఎల్లో ఆడతారని డేవిడ్ వార్నర్ అన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం చాలా కష్టమన్న వార్నర్... ఇటీవలే ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నాడు.