హైదరాబాద్ జంట నగరాల్లో పురపాలశాఖ మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రూ. 28.38 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేయనున్నారు. దోమలగూడలో రూ.9 కోట్ల 90 లక్షల వ్యయంతో నిర్మించనున్న జీహెచ్ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలకు ఉదయం 10 గంటలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. నారాయణగూడ మోడల్ వెజిటెబుల్ మార్కెట్‌కు 10.20 నిమిషాలకు మంత్రి భూమిపూజ చేయనున్నారు. నారాయణగూడలో సెల్లార్లతో పాటు... నాలుగు అంతస్తుల మార్కెట్‌ను రూ.4 కోట్ల వ్యయంతో ఈ మార్కెట్ నిర్మాణం చేస్తున్నారు. మొదటి అంతస్తులో 11 దుకాణాల ఏర్పాటు, రెండో అంతస్తులో 16 వెజిటెబుల్ మార్కెట్, మూడో అంతస్తులో 16 నాన్ వెజ్ మార్కెట్ దుకాణాలు, నాలుగో అంతస్తులో 11 నాన్ వెజ్ మార్కెట్ దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. దీన్ని ఏడాది లోపు పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
కాసేపట్లో జంట నగరాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన - minister ktr starting double bed room houses in bhaglingampalli
హైదరాబాద్‌లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాసేపట్లో పర్యటించనున్నారు. జంట నగరాల్లో రూ.28.38 కోట్ల విలువైన అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించనున్నారు. బాగ్‌లింగంపల్లిలో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ... అడిక్‌మెట్‌లో నిర్మించిన క్రీడాప్రాంగణాన్ని ప్రారంభించనున్నారు. నారాయణగూడలో మోడల్ మార్కెట్, దోమలగూడలో జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు.
గ్రేటర్లో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి పంపిణీ చేయనున్నారు. బాగ్‌లింగంపల్లి లంబాడి తండాలో రెండు పడక గదులను లబ్ధిదారులకు మంత్రి అందించనున్నారు. లంబాడి తండాలో శిథిలావస్థలో ఉన్న ఇళ్ల స్థానంలో రూ. 10.90 కోట్ల వ్యయంతో 126 డబుల్ బెడ్ రూం ఇళ్లను జీహెచ్ఎంసీ నిర్మించింది. 9 అంతస్తులలో నిర్మించిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఒకొక్కటి రూ. 8 .65 లక్షల వ్యయంతో నిర్మించారు. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడక గదులు, ఒక వంటగది, ఒక బాత్రూం, హాల్ నిర్మించారు.
అడిక్‌మెట్‌లో రూ. 3.50 కోట్ల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను 11.30 గంటలకు కేటీఆర్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు పాల్గొననున్నారు.