Women's day 2022: రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు రేపు సెలవు ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8 న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులకు ప్రత్యేక సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం రోజు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సర్కారు ప్రత్యేక సెలవు ఇస్తోంది. ఈ ఏడాది కూడా ఉద్యోగినులకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మహిళా బంధు సంబరాలు
కాగా తెరాస ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహిళా బంధు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మార్చి 6 ఆదివారం మొదలైన వేడుకలు.. రేపటివరకు సాగనున్నాయి. తెరాస నేతలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. మహిళా అభ్యున్నతికి సర్కార్ అమలుచేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జిల్లాల్లోనూ మహిళా బంధు- కేసీఆర్ పేరిట వేడుకలు నిర్వహిస్తున్నారు. మానవహారాలు, ప్రదర్శనలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు సత్కారాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలతో... ఊరూరా సంబరాలు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి:Mahila Bandhu Celebrations : తెరాస ఆధ్వర్యంలో ఘనంగా మహిళాబంధు సంబురాలు