తెలంగాణ

telangana

ETV Bharat / city

కన్నీరే మిగులుతోందటున్న టమాటా రైతులు - vishaka tomato farmers difficulties

ఏపీ, విశాఖ జిల్లా దేవరాపల్లి కూరగాయల మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోయాయి. రేటు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులంతా సిండికేట్ అయి.. ధరలు తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Breaking News

By

Published : Mar 25, 2021, 2:18 PM IST

టమాటా రైతుకు కన్నీరే మిగులుతోంది. కనీసం.. కోత ఖర్చులూ రాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు మార్కెట్లు, మాల్స్‌లో కిలో రూ. 30 పలుకుతున్నా.. రైతు వద్దకు వచ్చే సరికి రూ.5 కూడా పడటం లేదని వాపోతున్నారు. ఏపీ, విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లోని టమోటా రైతుల పరిస్థితి ఇది.

దేవరాపల్లి కూరగాయల మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులంతా సిండికేట్ అయి.. ధరలు తగ్గిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దళారీ వ్యవస్థ నుంచి తమను కాపాడి.. ప్రభుత్వం మద్ధతు ధర కల్పించాలని కోరుతున్నారు. కూరగాయలు నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:అప్పులకు బలైన రైతు కుటుంబం.. పరువు కోసం బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details