తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా కన్నా.. కులం అనే వైరస్​ చాలా ప్రమాదకరం: రామ్​ - hero ram tweeted on caste virus

ప్రముఖ నటుడు రామ్​ మరోసారి ట్విటర్​ వేదికగా భావోద్వేగ ట్వీట్​ చేశారు. కరోనా కన్నా కులం అనే వైరస్​ చాలా ప్రమాదమని వ్యాఖ్యానించారు. దీనిని వ్యాప్తి చేసేవారి నుంచి దూరంగా ఉండాలని సూచించారు.

కరోనా కన్నా.. కులం అనే వైరస్​ చాలా ప్రమాదకరం: రామ్​
కరోనా కన్నా.. కులం అనే వైరస్​ చాలా ప్రమాదకరం: రామ్​

By

Published : Aug 17, 2020, 8:00 PM IST

ప్రముఖ నటుడు రామ్​ మరోసారి భావోద్వేగ ట్వీట్​ చేశారు. కులం అనే వ్యాధి చాలా ప్రమాదకరమైనదని.. ఇది కరోనా కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుంది.. అంటుకుంటుంది అని పేర్కొన్నారు. ఈ వ్యాధిని వ్యాప్తి చేసే వారు మనల్ని ఇందులోకి లాగడానికి ఎంత ప్రయత్నించినా.. వారి నుంచి దూరంగా ఉండాలని సూచించారు.

ఇటీవల విజయవాడలో జరిగిన స్వర్ణ ప్యాలెస్​ ప్రమాదం ఘటనపై నటుడు రామ్​ ట్విటర్​ వేదికగా స్పందిస్తున్నారు. సీఎం జగన్​ను తప్పుగా చూపించేందుకు పెద్ద కుట్ర జరుగుతున్నట్లు వరుస ట్వీట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details