Sekhar Kammula : యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువకుడు హర్షవర్ధన్‌కు అత్యవసర వైద్యం అందించడంలో చొరవ చూపించిన తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. గత మూడేళ్లుగా శేఖర్ కమ్ముల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకు నిత్యం ఎవరో ఒకరి దగ్గర నుంచి అత్యవసర వైద్య చికిత్స కేసులు వస్తున్నాయి.
హరీశ్‌రావుని సాయం కోరిన శేఖర్ కమ్ముల..
Sekhar Kammula Thanked Harish Rao : యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం క్రిస్టియన్ కాలనీకి చెందిన బాడ హర్షవర్ధన్ తీవ్రమైన ఐబీడీ సమస్యతో బాధ పడుతున్నారు. పేదరికంతో చికిత్స చేయించుకోలేని పరిస్థితి. ఈ విషయం శేఖర్ కమ్ముల దృష్టికి వచ్చింది. శేఖర్ కమ్ముల వెంటనే ఈ యువకుడి పరిస్థితిని మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే స్పందించిన హరీశ్ రావు నిమ్స్‌లో హర్షవర్ధన్‌కు చికిత్స అందించేలా ఆదేశాలు ఇచ్చారు.
హరీశ్ రావు ప్రజల మంత్రి..
Harish Rao Helped Young Man : అడిగిన వెంటనే స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన హరీశ్‌రావుకు సోషల్ మీడియా ద్వారా దర్శకుడు శేఖర్ కమ్ముల కృతజ్ఞతలు తెలిపారు. హరీశ్ రావును ప్రజల మంత్రి అని పిలిచేందుకు ఇలాంటి ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చని ట్వీట్ చేశారు.