ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తన అభిమానికి వీడియో కాల్ చేసి పరామర్శించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన మురళీ.. జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని. ఇటీవల ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి రెండు కిడ్నీలు దెబ్బతినడం వల్ల విజయవాడలోని రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మురళి.. తన చివరి కోరికగా.. జూనియర్ ఎన్టీఆర్ను కలవాలని వైద్యులకు చీటి రాసి చూపించాడు. ఆ విషయాన్ని వైద్యులు.. మురళీ బంధువులకు చెప్పారు. వెంటనే వారు తూర్పు గోదావరి జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘానికి... మురళీ చివరి కోరికను తెలియజేశారు.
ధైర్యం చెప్పిన ఎన్టీఆర్..