సత్ఫలితాలను అందుకుంటారు. కొన్ని విషయాల్లో మనోధైర్యం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలు చేసేటపుడు నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.
తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. లలితా దేవిని స్తుతి చేయాలి.
మానసికంగా ధృడంగా ఉంటారు. అభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా ధృడంగా ఉంటారు. అధికారుల అనుగ్రహం పొందడానికి కష్టపడాల్సి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.
మానసికంగా ఆనందంగా ఉంటారు. కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.