ఒక వ్యవహారంలో అందరి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలుచేస్తాయి.
ఉత్సాహంతో ముందుకు సాగితే సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. లేనిపోని అనుమానాలతో కాలయాపన చేయకండి. గోవింద నామాలు చదవాలి.
మిశ్రమకాలం. మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. కుటుంబ సభ్యులను సంప్రదించకుండా ఏ పనిని తలపెట్టకండి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శ్రీ రామ నామాన్ని జపించాలి.
శుభకాలం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్మీ స్తోత్రము చదివితే మంచిది.
ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాల్లో సమయోచితంగా స్పందించి అధికారుల మెప్పును పొందుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.
చేసే పనిలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. రవిద్యాన శ్లోకం చదివితే మేలు జరుగుతుంది.