AP Weather Report: అండమాన్ తీరం వద్ద ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... క్రమంగా మరింత బలపడి బంగ్లాదేశ్, మయన్మార్ వైపు కదులుతోంది. రేపటిలోగా పూర్తి అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఏపీలోని కోస్తాంధ్ర, ఒడిశా తీరంలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం... అక్కడక్కడా వర్ష సూచన
AP Weather Report: అండమాన్ తీరం వద్ద ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... క్రమంగా బలపడి బంగ్లాదేశ్, మయన్మార్ వైపు కదులుతోంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఏపీలోని కోస్తాంధ్ర, ఒడిశా తీరంలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
తక్కువ ఎత్తులో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తుండటంతో... యానాం, దక్షిణ కోస్తాంధ్రల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలోనూ ఈవాళ, రేపు పొడి వాతావరణం ఉండగా... ఎల్లుండి తేలికపాటి వర్షం ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది.
ఇదీ చదవండి: Weather Report: వాతావరణ శాఖ హెచ్చరిక.. ఆ జిల్లాల్లో వడగాల్పులు