తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ప్రధాన వార్తలు - తెలంగాణ వార్తలు

top news
top news

By

Published : Oct 12, 2021, 6:02 AM IST

Updated : Oct 12, 2021, 9:02 PM IST

20:57 October 12

టాప్​ న్యూస్​ @ 9PM

  • ఎన్ని కేసులుంటే అంత గొప్ప...

హుజూరాబాద్​లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో (Huzurabad Campaign) దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తామే గొప్ప అంటూ ఎవరికి వారు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తనపై వందల కేసులున్నాయి... నాపై కూడా ఉన్నాయంటూ మరొకరు ఇలా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. కేసులే ఆధారంగా ప్రచారం చేసుకుంటున్నా నాయకులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

  • తొలిసారి తగ్గిన కరోనా కేసులు

కేరళలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొవిడ్ రెండో దశ మొదలైన తర్వాత ఆ రాష్ట్రంలో తొలిసారిగా యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు దిగువన చేరింది.

  • ఆన్​లైన్​లో 30 కోట్ల​ మోసం..

నిరుద్యోగులే వారి లక్ష్యం. 'పార్ట్​టైమ్​' వల వేస్తారు(bangalore online fraud). సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు చూసి, లైక్​ చేసి షేర్​ చేస్తే డబ్బులిస్తామని ఆశ పెడతారు(bangalore fraud case). ఉద్యోగం కోసం కొంత డబ్బు డిపాజిట్​ చేయాలంటారు. అది నమ్మి వేలాది మంది డిపాజిట్లు చేశారు. చివరికి మోసపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.

  • ప్రకాశ్​రాజ్​ ప్యానల్​ రాజీనామా..

'మా' ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాశ్​ రాజ్​ ప్యానల్​ సభ్యులు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలను ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.

  • మైసమ్మకు విస్కీతో ఆర్జీవీ చీర్స్​...

దేవున్ని నమ్మని ఆర్జీవీ.. గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడితో ఆగకుండా.. ఏకంగా మైసమ్మకు విస్కీ తాగించాడు. అదేంటీ.. దేవతకు మందు తాగించటమేంటీ..? అనుకుంటున్నారా..? అలా ఎందుకు చేశాడో.. తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..



 

20:10 October 12

టాప్​ న్యూస్​ @ 8PM

ఈటలకు హరీశ్​ సవాల్​..

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్​పేటలో వడ్డెర ఆశీర్వాద సభకు మంత్రి హరీశ్​రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్​రావు... ఈటల రాజేందర్​కు (Harish Rao Challenge) సవాల్ విసిరారు.

ఉపఎన్నికలో కేసులే కీలకమటా..

హుజూరాబాద్​లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో (Huzurabad Campaign) దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తామే గొప్ప అంటూ ఎవరికి వారు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తనపై వందల కేసులున్నాయి... నాపై కూడా ఉన్నాయంటూ మరొకరు ఇలా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. కేసులే ఆధారంగా ప్రచారం చేసుకుంటున్నా నాయకులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

ఆ 750 కోట్లు ఎవరివంటే..

ఈ నెల 7న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు విజయేంద్ర సన్నిహితులపై జరిగిన ఐటీ సోదాల్లో.. లెక్కల్లో చూపించని రూ. 750కోట్లు బయటపడ్డాయి. ఇందులో రూ. 487కోట్ల ఆదాయాన్ని తాము లెక్కల్లో చూపించలేదని స్వయంగా ఆయా సంస్థల సభ్యులు అంగీకరించారు.

మైసమ్మకు ఆర్టీవీ చీర్స్​..

దేవున్ని నమ్మని ఆర్జీవీ.. గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడితో ఆగకుండా.. ఏకంగా మైసమ్మకు విస్కీ తాగించాడు. అదేంటీ.. దేవతకు మందు తాగించటమేంటీ..? అనుకుంటున్నారా..? అలా ఎందుకు చేశాడో.. తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..

ఆ క్రికెటర్​కు తండ్రిగా ప్రమోషన్​..

తండ్రిగా ప్రమోషన్​ వచ్చిన రోజే.. జాతీయ జట్టు తరఫున క్రికెట్​ ఆడేందుకు విదేశానికి వెళ్లాడు ఆస్ట్రేలియా క్రికెటర్​ ప్యాట్​ కమిన్స్(Pat Cummins news latest news)​. టీ20 ప్రపంచకప్​ కోసం దుబాయ్​ బయలుదేరిన ఆసీస్​ బృందంలో కమిన్స్​ ఉన్నాడు. 2021 ఐపీఎల్​ సీజన్​లో (Pat Cummins ipl 2021) మధ్యలోనే ఇంటికి వెళ్లిన కమిన్స్.. ఇన్ని రోజులు తన కుటుంబంతో గడిపాడు.


 

18:45 October 12

టాప్​ న్యూస్​ @ 7PM

  • సినిమా బిడ్డల రాజీనా'మా'

'మా' ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాశ్​ రాజ్​ ప్యానల్​ సభ్యులు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలను ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.

  • మోహన్​బాబు బూతులు తిట్టాడు..

'మా' ఎన్నికల్లో పరిణామాలను వెల్లడిస్తున్న క్రమంలో మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు నటుడు బెనర్జీ. తనతో పాటు హీరో తనీశ్​ను​ సీనియర్​ నటుడు మోహన్​ బాబు దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • మళ్లీ కుంభవృష్టి..

కేరళను భారీ వర్షాలు(kerala floods 2021) ముంచెత్తుతున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళలో కుండపోత కురుస్తోంది(kerala floods today). మలప్పురం వద్ద భారీ వర్షాలకు ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మరణించారు. ఎడతెరపి లేని వానకు రహదారులు చెరువులుగా మారగా.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

  • కార్గో సిద్ధం..

జమ్ముకశ్మీర్‌లో పండితులతో సహా ఇతర మైనార్టీలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు నెలల నుంచి సుప్తచేతనావస్థలో ఉన్న స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ)ను మళ్లీ సిద్ధం చేసింది. జమ్ముకశ్మీర్‌ పోలీసుల్లో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో అనుభవం ఉన్నవారితో దీనిని ఏర్పాటు చేశారు. దీని నిక్‌నేమ్‌ 'కార్గో'.!

  • స్వచ్ఛందంగా సేవలు..

ఎమ్​ఎస్​ ధోనీ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్​లో ఎలాంటి గౌరవ వేతనం లేకుండానే టీమ్ ఇండియాకు మార్గదర్శకునిగా పనిచేయనున్నాడు.

18:06 October 12

టాప్​ న్యూస్​ @ 6PM

  • 25 నుంచి ఇంటర్​ పరీక్షలు..

ఇంటర్​ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్​న్యూస్ చెప్పింది. 70 శాతం సిలబస్ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు(Inter Exams 2021 TS) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు పెంచామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు. 

  • జడ్చర్లలో ఉద్రిక్తత..

పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ, విద్యార్థి జంగ్ సైరన్ సభకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుల కార్లను జడ్చర్ల వద్ద పోలీసులు (Jung Siren Tension) అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

  • బీరువాల నిండా నోట్ల కట్టలు..

బీరువాలు, సెల్ఫుల నిండా నోట్ల కట్టలతో ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఆ ఫొటోలు ఎక్కడివీ..? అందులోని డబ్బు ఎవరిదీ..? అసలు ఆ ఫొటోలు ఎవరు రిలీజ్​ చేశారు. అసలు అంత డబ్బు.. ఎక్కడుంది..?

  • పాక్​ ఉగ్రవాదికి రిమాండ్​..

దిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో అరెస్టయిన పాకిస్థానీ ఉగ్రవాది మహ్మద్ అష్రఫ్‌కు 14 రోజుల పోలీసు కస్టడీని విధించింది దిల్లీ కోర్టు. అష్రఫ్ నకిలీ గుర్తింపు కార్డుతో కొన్నాళ్లుగా దిల్లీలో నివసిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.

  • రాజీనా'మా' రచ్చ...

'మా' ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాశ్​ రాజ్​ ప్యానల్​ సభ్యులు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలను ఎలాంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.


 

16:44 October 12

టాప్​ న్యూస్​ @ 5PM

  • ఒక్క ఛాన్స్​ ఇవ్వండి..

హుజూరాబాద్​కు (HUZURABAD BYPOLL) మెడికల్​ కాలేజీ తీసుకువస్తానని తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​యాదవ్​ (HUZURABAD TRS CANDIDATE) హామీ ఇచ్చారు. పేదలకు ఐదు వేల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సొంత జాగాలున్న వారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

  • అమూల్​ గిఫ్ట్​తో నయా స్కామ్​..

వాట్సాప్​లో ఇటీవల ఓ స్కామ్​ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అమూల్ డైరీ వార్షికోత్సవాల పేరుతో ఈ కింది లింక్​ను క్లిక్ చేస్తే ఆరు వేలు గెలుచుకోవచ్చు అంటూ ఓ ఫేక్ మెసేజ్ (whatsapp scam messages) చక్కర్లు కొడుతోంది. ఈ లింక్​పై క్లిక్ చేస్తే అంతే సంగతి!

ఉత్తరాఖండ్​లో రెండు చిరుతపులుల మధ్య భీకర పోరు సాగింది. రెండూ హోరాహోరీ తలపడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. శ్రీనగర్ జిల్లాలోని ఖిర్సు మార్గ్‌లో కారులో వెళుతున్న ప్రయాణికులు ఈ ఘటనను కెమెరాలో బంధించారు. ఈ మధ్య తరచుగా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని.. చిరుతలు ప్రాణాలు కోల్పోతున్నాయని అటవీ అధికారులు తెలిపారు.

  • అమెరికాకు కిమ్​ స్ట్రాంగ్​ వార్నింగ్​...

అజేయమైన సైన్యాన్ని నిర్మిస్తానని.. ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్ (Kim news today)​ ప్రతిజ్ఞ చేశారు. ఆత్మరక్షణ కోసం ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని స్పష్టం చేశారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలకు అమెరికానే కారణం అని ఆరోపించారు కిమ్​.

  • ఒకే వేదికపై చిరు, బాలయ్య సందడి..

మెగాస్టార్​ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు వీరితో పాటు రామ్​చరణ్​ కూడా పాల్గొంటారని సమాచారం.


 

15:46 October 12

టాప్​ న్యూస్​ @ 4PM

  • 14 నుంచి గెజిట్ అమల్లోకి

ఈ నెల 14 నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని కృష్ణా బోర్డు ప్రకటించింది. శ్రీశైలం,సాగర్ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్ ఔట్ లెట్లు కృష్ణా బోర్డు పరిధిలోకి రానున్నట్టు పేర్కొంది. రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్ ఔట్ లెట్లు కూడా కృష్ణా బోర్డు పరిధిలోకే వస్తాయని తెలిపింది.

  • సజ్జనార్​పై ప్రశ్నల వర్షం..

దిశ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌(justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ ఎండీ, అప్పటి సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ను కమిషన్​ రెండో రోజూ విచారిస్తోంది. ఎన్​కౌంటర్, ఆ తర్వాత పోస్టుమార్టం, మృతదేహాల తరలింపునకు సంబంధించిన వివరాలపై... కమిషన్ తరఫు న్యాయవాదులు సజ్జనార్​ను విచారిస్తున్నారు.

  • కొత్త నిర్ణయాలేం తీసుకోలేదు..

కేఆర్​ఎంబీ సమావేశంలో(KRMB Meeting news) ఇవాళ కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకోలేదని నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌(Rajat Kumar Comments) వెల్లడించారు. ఈనెల 14లోగా స్పష్టమైన నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. కేంద్రానికి, ఏపీకి తమ నిర్ణయాన్ని త్వరలో చెబుతామని స్పష్టం చేశారు.

  • సద్దుల బతుకమ్మ ఎప్పుడంటే..

తెలంగాణ ఆడబిడ్డలు అంబరాన్నంటే సంబురాలు చేసుకునే వేడుక సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma). ఏడు రోజుల నుంచి సందడిగా బతుకమ్మ(Saddula Bathukamma) ఆడుతున్న ఆడపడుచులు.. సద్దుల బతుకమ్మ కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. కానీ.. సద్దుల బతుకమ్మ బుధవారం రోజున జరపాలా.. లేదా గురువారం రోజున జరుపుకోవాలనే దానిపై స్పష్టత లేక అయోమయంలో ఉన్నారు. ఇంతకీ ఈ యేడు సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలి?

  • సచివాలయంలో అగ్నిప్రమాదం

బంగాల్​ రాష్ట్ర సచివాలయం నబన్నాలోని 14వ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయం ఉన్నట్టు అధికారులు తెలిపారు.

  • 'మా'కు పోటీగా 'ఆత్మ'..

మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​ ఎన్నికలు ముగిసినా సభ్యుల మధ్య నెలకొన్న భేదాభిప్రాయలు ఇంకా సద్దుమణగలేదు. ఇప్పటికే 'మా' సభ్యత్వానికి ప్రకాశ్​ రాజ్​, నాగబాబు రాజీనామా చేయగా.. ఇప్పుడు 'మా' ఎన్నికల్లో ప్రకాశ్​ రాజ్​ ప్యానెల్​ నుంచి గెలిచిన సభ్యులూ ఇదే బాట పట్టనున్నారని సమాచారం.

14:36 October 12

టాప్​ న్యూస్​ @ 3PM

  • చిన్నారులకు కరోనా టీకా..

భారత్ బయోటెక్ చిన్నారుల కోసం అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ (Covaxin Children) కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు విషయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. 2-18 ఏళ్ల మధ్య వయసు వారికి ఇచ్చే ఈ టీకాకు (Covaxin Vaccine) అత్యవసర అనుమతులు (Covaxin approval news) జారీ చేయాలని సూచించింది. కొన్ని షరతుల మేరకు ఈ టీకా వినియోగించవచ్చని కమిటీ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

  • విద్యుత్​ సంక్షోభం..

దేశంలో బొగ్గు కొరత కారణంగా(coal shortage in india) విద్యుత్ సంక్షోభం ఏర్పడే ప్రమాదముందని భయాందోళనలు నెలకొన్న తరుణంలో కేంద్రం కీలక సూచనలు చేసింది. మిగులు విద్యుత్​ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు సాయం చేయాలని చెప్పింది. కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్​ను ప్రజల అవసరాల కోసం రాష్ట్రాలు వాడుకోవాలని తెలిపింది(coal shortage news).

  • ఐదుగురు ఉగ్రవాదులు హతం..

ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్లు, పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలకు భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. సోమవారం నుంచి జరిపిన దాడుల్లో ఐదుగురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ తరుణంలో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేయగా.. కశ్మీర్‌(JK encounter news) సిక్కులు 'భారత ఆర్మీ జిందాబాద్‌' అంటూ నినాదాలు చేశారు.

  • కోహ్లీపై డివిలియర్స్​ ఫన్నీ ట్రోల్!

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​గా సోమవారం విరాట్​ కోహ్లీ చివరి మ్యాచ్​ ఆడాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ కెప్టెన్సీపై పలు వ్యాఖ్యలు చేశాడు (ab de villiers on kohli) ఆ జట్టు బ్యాట్స్​మన్ ఏబీ డివిలియర్స్.

  • కొండా షూటింగ్​ షురూ..

హనుమకొండలో ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్ వర్మ(Ram Gopal Varma) సందడి చేశారు. ఆయనకు కొండా సురేఖ దంపతులు ఘనస్వాగతం పలికారు. వర్మను చూడడానికి అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

13:56 October 12

టాప్​ న్యూస్​ @ 2PM

  • వైఎస్ పేరెత్తే అర్హత కేసీఆర్​కు లేదు..

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయని... వీసీలు, ఇతర సిబ్బంది నియామకాలు లేక చదువులు సాగే పరిస్థితి లేకుండా పోయిందని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్​. షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

  • మెట్‌పల్లిలో రైతుల మహాధర్నా...

ముత్యంపేట చక్కెర కర్మాగారం తెరవాలని మెట్‌పల్లిలో చెరకు రైతులు ఆందోళన చేపట్టారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయాలని చెబుతున్న ప్రభుత్వం ముందుగా చక్కెర పరిశ్రమను తెరిపించాలని డిమాండ్‌ చేశారు. 

  • దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర..

మానవ హక్కుల ఉల్లంఘనల పేరుతో కొందరు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధి కోసం చేసే ఇలాంటి చర్యలు మనవ హక్కులతో పాటు ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు.

  • రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

దేశంలో బొగ్గు కొరత కారణంగా(coal shortage in india) విద్యుత్ సంక్షోభం ఏర్పడే ప్రమాదముందని భయాందోళనలు నెలకొన్న తరుణంలో కేంద్రం కీలక సూచనలు చేసింది. మిగులు విద్యుత్​ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు సాయం చేయాలని చెప్పింది. 

  • 'ఆగడు' వివాదంపై ప్రకాశ్ రాజ్ స్పందన..

ఐదుసార్లు జాతీయ అవార్డులు పొంది కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్​(prakash raj movies). ఇలాంటి ఈ నటుడ్ని తెలుగు సినిమా నిర్మాతల మండలి అప్పట్లో బ్యాన్ చేసింది. 

12:45 October 12

టాప్​ న్యూస్​ @ 1PM

  • కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోరుతున్నాం..

ఇవాళ్టి కేఆర్ఎంబీ భేటీలో ఉపసంఘం నివేదికపైనే చర్చ ఉంటుందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ తెలిపారు. కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోరుతున్నామని వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్వహణ ఎలా చేస్తారని అడుగుతున్నామని పేర్కొన్నారు.

  • తెలుగు అకాడమీ స్కామ్​..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారం పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసులో పూర్తి వివరాలు సేకరించేందుకు నిందితులను మరో 4 రోజులు కస్టడీకి తీసుకుంటామని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. కస్టడీ పొడిగింపుపై నేడు నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

  • సజ్జనార్​పై పశ్నల వర్షం...

'దిశ’ అత్యాచార(disha case) కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ ఎండీ, అప్పటి సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ను కమిషన్​ రెండో రోజూ విచారిస్తోంది. ​కమిషన్​ సభ్యులు అడిగి ప్రశ్నలకు సజ్జనార్ సమాధానమిస్తున్నారు. 

  • గుడ్డుకు రూ.500.. కోడి పిల్లకు రూ.1000

రూ.లక్షతో కోళ్ల పెంపకాన్ని చేపట్టి రెండేళ్లలో రూ.15 లక్షల వ్యాపారానికి ఎదిగారా యువకులు. ఉన్నత విద్యనభ్యసించిన ముగ్గురు యువకులు.. ఉద్యోగాలను కాకుండా వ్యాపారాన్ని నమ్ముకొని లాభాల బాట పయనిస్తున్నారు.

  • ప్రముఖ నిర్మాత మృతి...

నిర్మాత మహేశ్ కోనేరు గుండెపోటుతో మరణించారు. వైజాగ్​లోని తన నివాసంలో ఈయన తుదిశ్వాస విడిచారు.
 

11:53 October 12

టాప్​ న్యూస్​ @ 12PM

  • కేఆర్​ఎంబీ ప్రత్యేక సమావేశం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎం.పి.సింగ్ అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో భేటీ కొనసాగుతోంది. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చిస్తున్నారు.

  • యువకుల వికృత విన్యాసాలు

బైక్ అంటే ఇష్టపడని యువకులుండరు. బైక్​ ఉంటే అదో ప్రెస్టీషియస్​గా ఫీలవుతారు. దాంతో స్టంట్లు(Bike stunts in secunderabad) చేస్తూ అదో ట్రెండ్​లా భావిస్తుంటారు. స్టంట్లు చేసే క్రమంలో కిందపడతామన్న భయం.. చేస్తున్నప్పుడు ఎదురుగా వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడతారన్నది గమనించరు. 

  • ఎన్ఐఏ విస్తృత తనిఖీలు

జమ్ము కశ్మీర్​లో మైనారిటీలపై దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. (NIA raids in Kashmir) దిల్లీ, యూపీ, కశ్మీర్​లోని 18 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. మరోవైపు ముంద్రా కేసులో భాగంగా దిల్లీలో తనిఖీలు చేస్తోంది జాతీయ దర్యాప్తు సంస్థ.

  • హర్షల్ పటేల్ అదిరిపోయే రికార్డు..

ఐపీఎల్​లో సరికొత్త రికార్డు సృష్టించాడు రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్(Harshal Patel IPL Wickets ). ఈ సీజన్​లో(IPL 2021) 32 వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు.

  • రాజీనామా వెనుక లోతైన అర్థం ఉంది

'మా' సభ్యత్వానికి(maa elections 2021) తాను ఎందుకు రాజీనామా చేశానో త్వరలోనే తెలియజేస్తానని అన్నారు నటుడు ప్రకాశ్​రాజ్(maa elections prakash raj)​. రిజైన్​ చేయడం వెనుక లోతైన అర్థం ఉందని చెప్పారు.

10:54 October 12

టాప్​ న్యూస్​ @ 11AM

  • సాగర్​కు కొనసాగుతున్న వరద..

నాగార్జునసాగర్ జలాశయానికి(Nagarjuna Sagar Dam) వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరగా.. అధికారులు 10 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలో ప్రస్తుతం 311.14 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

  •  మా ఎమ్మెల్యే వేధిస్తున్నారు.. 

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తనను వేధింపులకు గురిచేస్తున్నారని తిప్పర్తి మండలం యల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తాను అధికార పార్టీలో చేరకపోవడంతో ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగారని పేర్కొన్నారు. 

  • వైద్యం కోసం రోజుల తరబడి నిరీక్షణ..

అన్ని రంగాల్లో సాంకేతికత పెరిగినా ఇప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులు ఓపీ చీటీలు ఇవ్వడంలో పాత పద్ధతినే పాటిస్తున్నాయి. చాంతాడంత క్యూల్లో ఓపీ చీటీ తీసుకొని, వైద్యుడికి చూపించుకొని, టెస్టులు చేయించుకొనేందుకు గంటల సమయం పడుతోంది.

  • భారీగా తగ్గిన కరోనా కేసులు..

భారత్​లో తాజాగా 14,313 మంది​ కరోనా బారిన (Coronavirus update) ​పడ్డారు. కొవిడ్​ ధాటికి(Covid cases in India) మరో 181 మంది మృతి చెందారు. మరో 21వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • టీనేజర్ల కోసం ఇన్​స్టా సరికొత్త ఫీచర్.. 

యువత కోసం కొత్త ఫీచర్లను(Instagram new features for youth) తీసుకువస్తున్నట్లు ప్రకటించింది ఇన్​స్టాగ్రామ్. హాని కలిగించే కంటెంట్​కు టీనేజ్​​ దూరంగా ఉండేలా ప్రోత్సహించడానికి ఈ ఫీచర్స్​ ఉపయోగపడనున్నాయి.

09:50 October 12

టాప్​ న్యూస్​ @ 10AM

  • భారీగా పెరిగిన బంగారం ధర...

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధర (Gold rate today) భారీగా పెరిగింది. హైదరాబాద్​లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,630గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • పెట్రోల్ దాడిలో కేసులో మామ మృతి

భార్యపై కక్ష కట్టి గొడవ పడటానికి వెళ్లి అత్తమామలపై అల్లుడు వల్లకొండ సాయికృష్ణ పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కేసులో తీవ్రంగా గాయపడ్డ తీగల సాగర్‌రావు (55) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందారు. ఆయన భార్య రమాదేవి చికిత్స పొందుతున్నారు. 

  • ఆర్టీసీ బస్సు బోల్తా.. అందులో ప్రయాణికులు...

జనగామ జిల్లా చిల్పూరు మండలం కొండాపూర్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా (TSRTC bus)పడింది.  ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు కాగా సురక్షితంగా ప్రయాణికులు బయటపడ్డారు. హుస్నాబాద్‌ నుంచి జగద్గిరిగుట్టకు వెళ్తుండగా ప్రమాదం (ACCIDENT) చోటుచేసుకుంది.

  • ఎక్కువ సార్లు శృంగారంలో​ పాల్గొంట...

ఆయుష్షు(regular sex benefits) పెంచుకోవాలంటే ఎక్కువ సార్లు రతిలో పాల్గొనాలని అంటున్నారు పరిశోధకులు. వారానికి ఒకటి కన్నా తక్కువసార్లు సెక్స్​లో పాల్గొనేవారితో పోలిస్తే వారానికి ఒకట్రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారిలో రోగనిరోధకశక్తి(immunity booster) బలోపేతమవుతుందని వెల్లడించారు. 

  • 'ఆ ఒక్క ఓవరే మా అవకాశాలను దెబ్బతీసింది'

కోల్​కతా ఇన్నింగ్స్​లో సునీల్​ నరైన్ ఆడిన 12వ ఓవరే తమ అవకాశాలను దెబ్బతీసిందని రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB vs KKR) కెప్టెన్ విరాట్ కోహ్లీ(Kohli Captaincy) చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌తో ఆర్సీబీ సారథిగా ఇన్నింగ్స్‌ ముగించడంపై స్పందిస్తూ కోహ్లీ ఒకింత భావోద్వేగం చెందాడు. 

08:53 October 12

టాప్​ న్యూస్​ @ 9AM

  • కొవిడ్‌ చికిత్సకు మధుమేహం ఔషధాలు!

కొవిడ్ చికిత్స  కోసం మధుమేహం, ఊబకాయానికి వాడే ఔషధాలు వినియోగించవచ్చని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పరిశోధకులు పేర్కొన్నారు. వృద్ధాప్యాన్ని తగ్గించేందుకు వాడుతున్న రేపమైసిన్‌ ఔషధం, రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే మెట్‌ఫార్మిన్‌ను కొవిడ్‌ చికిత్సలో వాడొచ్చని చెప్పారు.

  • గాంధీ గూగ్లీకి ఆ ఐపీఎల్‌ క్లీన్‌బౌల్డ్‌

జాతీయోద్యమాన్నే కాదు... భారత్‌లో నేడు మనం చూస్తున్న క్రికెట్‌ పరిణామ క్రమాన్నీ మార్చారు గాంధీజీ! పైకి ప్రజాకర్షణీయంగా కన్పించినా... బ్రిటిష్‌వారి కుటిలనీతి దాగిన నేపథ్యంలో ఆనాటి ఐపీఎల్‌లాంటి అత్యంత ఆదరణగల క్రికెట్‌ టోర్నీని ఆపించేశారాయన! 

  • మూసీ సుందరీకరణ నిధులు జేబుల్లోకి

గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌లోని సబర్మతీ నది గతంలో మురికికూపంగా ఉండేది. ఇప్పుడు మంచినీటితో కళకళలాడుతోంది. నదీతీరంలో అనేక పార్కులు ఏర్పాటయ్యాయి. దేశవిదేశాల సందర్శకులు లక్షలాదిగా వచ్చి ఆ పార్కులను సందర్శిస్తున్నారు. ఇదే తరహాలో మూసీని సుందరీకరించాలని సీఎం కేసీఆర్‌ అయిదేళ్ల కిందటే ప్రకటించారు. 

  • 80 ఏళ్ల వయసులోనూ శృంగార కోరికలు..

స్త్రీ, పురుషుల్లో శృంగార కోరికలు కలగడం సర్వసాధారణం. కొందరు దంపతులు పెళ్లైన తర్వాత కొంత కాలానికి చాలా అరుదుగా సెక్స్​ చేస్తుంటారు. పిల్లలు పుట్టి, పెద్దవాళ్లు అవుతుంటే శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా స్త్రీలలో సెక్స్​పట్ల అనాసక్తి పెరిగిపోతుంది. 

08:51 October 12

కొవిడ్‌ చికిత్సకు మధుమేహం, ఊబకాయ ఔషధాలు!

07:41 October 12

టాప్​ న్యూస్​ @ 8AM

  • పాలమూరులో నేడు జంగ్ సైరన్

తెలంగాణలో ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి, బోధన బకాయిల చెల్లింపు సమస్యలపై కాంగ్రెస్​ గొంతెత్తుతోంది. కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్(Congress Jung Siren in Mahabubnagar) పేరుతో ఆందోళనలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ మహబూబ్​నగర్ జిల్లా అమిస్తాపూర్​లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిస్తోంది.

  • బొగ్గు కొరతకు ప్రధాన కారణమేంటి?

బొగ్గు సంక్షోభం తీవ్రస్థాయిలో ఉరుముతోంది. అకాల విద్యుత్‌ కోతలు ఏం జరుగుతుందోనన్న అయోమయంలో పడేస్తున్నాయి. కొరత మరింత పెరిగితే చీకట్లే అన్న హెచ్చరికలు సమస్య తీవ్రత చెప్పకనే చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సగానికి పైగా థర్మల్ విద్యుత్‌ కేంద్రాల వద్ద బొటాబొటి నిల్వలే అని చెబుతున్నాయి. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి సంబంధించి బొగ్గు సరఫరాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు నిజంగా అంత కలవరపడాల్సినవేనా? అనవసరంగా ఆందోళన చెందుతున్నామా? కేంద్రం ప్రభుత్వం ఏం చెబుతోంది?

  • మందుల ధరలు పెరిగే ప్రమాదం!

సమీప భవిష్యత్​లో ఔషధాల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. మందులు ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి రసాయనాలు, సాల్వెంట్లను తయారు చేసే కంపెనీలపై కాలుష్యం పేరుతో చైనా కఠిన నిబంధనలు విదించింది. దీంతో చైనా నుంచి ముడిరసాయనాల సరఫరా సమస్యగా మారింది. ఫలితంగా రసాయనాల ధరలు పెరగడం.. తద్వారా ఔషధ కంపెనీల ఉత్పత్తి వ్యయం కూడా పెరిగే అవకాశముంది.

  • మరో విజయం దిశగా ఆస్ట్రాజెనెకా..!

కొవిడ్​పై పోరుకు మరో ఆయుధాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా. ఓ ఔషధంపై తాజాగా ఆ సంస్థ చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న వారిలో ఈ ఔషధం.. కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు తేలింది.

  • అలా అనేసరికి కన్నీళ్లు ఆగలేదు

డ్యాన్సర్‌, సింగర్‌, యాక్టర్‌, స్పోర్ట్స్‌ పర్సన్‌(mahasamudram aditi rao hydari).. ఇలా ఎవరి బయోపిక్​లోనైనా నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పింది హీరోయిన్​ అదితి రావు హైదరి. సవాళ్లతో నిండిన పాత్రలంటే చాలా ఇష్టం అని వెల్లడించింది. ఈనెల 14న 'మహాసముద్రం'(mahasamudram movie release date) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా కెరీర్​ సహా చిత్ర విశేషాలను తెలిపింది.

07:38 October 12

టాప్​ న్యూస్​ @ 7AM

  • ఆ ఊళ్లో కాళ్ల కింద నేల కదిలిపోతుందా?

ఎనిమిది దశాబ్ధాల కింద ఏర్పడిన గ్రామం. 300 కుటుంబాలు తరతరాలు నివసిస్తోన్న ఊరు. ఎక్కణ్నుంచో ఇక్కడికి వచ్చారు. పైసాపైసా కూడబెట్టి భూములు కొనుకున్నారు. ఇళ్లు కట్టుకున్నారు. కాలం గిర్రున తిరిగింది. ఉన్నట్టుండి ఆ ఊళ్లో అలజడి మొదలైంది. నడుస్తున్న నేల తమది కాదేమోనని భయం పట్టుకుంది. ఇన్నేళ్లు తాము బతికిన ఇళ్లు పోతుందేమోనన్న బాధ.. తమ పొట్ట నింపి.. తమ పిల్లల భవిష్యత్​కు ఓ బాటు చూపించిన పొలం లాక్కుంటారేమోనన్న ఆవేదన.. ఇంతకీ ఆ ఊళ్లో ఏం జరుగుతోంది?

  • 'ఆ పనులు ఆపేందుకు సుప్రీంలో పిటిషన్ వేయండి'

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను ఆపేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయాలంటూ సీఎం కేసీఆర్‌కు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి (Former Minister Nagam Janardhan Reddy) సోమవారం లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా బేసిన్‌ నుంచి నీటిని పెన్నా బేసిన్‌కు, ఇతర ప్రాంతాలకు తరలిస్తోందని.. ఈ చర్యలను తక్షణమే అడ్డుకోవాలని లేఖలో పేర్కొన్నారు. 

  • 'ఆస్తులు టాటాలకు.. అప్పులు ప్రజలకా?'

ఎయిర్ ఇండియాను టాటాలకు మోదీ ప్రభుత్వం బహుమానంగా ఇచ్చిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury news) విమర్శించారు. రూ.60 వేల కోట్ల అప్పుల్లో టాటాలు రూ.15 వేల కోట్లకే బాధ్యత తీసుకుంటారని, ఇది ప్రభుత్వం చేసిన దారిదోపిడీ అని మండిపడ్డారు. (Air India sold to Tata)

  • పదునెక్కుతున్న విపక్ష గళం

ఆందోళన చేస్తున్న రైతుల మీదకు వాహనం దూసుకువెళ్ళడం, తదనంతర పరిణామాల్లో తొమ్మిది మంది అసువులు బాయడంపై దేశవ్యాప్తంగా భిన్నవర్గాల్లో తీవ్ర నిరసన వెల్లువెత్తింది. చాలాకాలం తరవాత ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతిపక్షం మొత్తం సర్కారును తూర్పారపట్టింది. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఈ కేసులో ప్రధాన నిందితుడు కావడం, అతడి అరెస్టు విషయంలో మీనమేషాలు లెక్కపెట్టి- చిట్టచివరకు అరెస్టుచేయడం అందరినీ విస్మయపరుస్తున్న అంశం.

  • సెట్స్​పైకి బాలయ్య కొత్త సినిమా..

బాలకృష్ణ-గోపిచంద్​ మలినేని(balakrishna gopichand malineni) కాంబోలో తెరకెక్కనున్న సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబరులో షూటింగ్​ ప్రారంభంకానుందని తెలిసింది. ఈ చిత్రానికి 'జై బాలయ్య'(jai balayya) అనే టైటిల్​ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.



 


 

04:49 October 12

టాప్​ న్యూస్​ @ 6AM

  • కశ్మీర్​లో చేదుగతం

కశ్మీర్‌ లోయలో ముష్కర మూకలు స్వైరవిహారం చేస్తున్నాయి. సాధారణ పౌరులను సులభ లక్ష్యాలుగా ఎంచుకుంటూ హేయదాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల ఆరు రోజుల్లోనే ఏడుగురు అమాయకులను అవి పొట్టన పెట్టుకున్నాయి. ప్రకోపిస్తున్న ఉగ్రవాద తండాల పైశాచికత్వం- అల్పసంఖ్యాక వర్గాలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

  • బోర్డు పరిధిలోకి పెద్దవాగు ఆ ఒక్కటే

గోదావరి బోర్డు పరిధిలోకి మొదటి దశలో పెద్దవాగు ప్రాజెక్టు ఒక్కటే వెళ్లనుంది. బోర్డు ప్రతిపాదనకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకరించగా నిర్వహణ బాధ్యతల అమలు ఇక లాంఛనమే కానుంది. సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహించిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశంలో (grmb meeting) రెండు రాష్ట్రాలు ప్రాజెక్టుల అప్పగింతపై చర్చించారు.

  • తారాస్థాయికి మాటల యుద్ధం

హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోరు... నువ్వానేనా అనే స్థాయిలో జోరుగా సాగుతోంది. ప్రధానంగా హరీశ్‌రావు, ఈటల మధ్య... మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. ఇరువురు నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక ఉప ఎన్నికపోరులో 61 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. బరిలో 42 మంది మిగిలారు (huzurabad by election nominations). ఈ నెల 13న నామపత్రాల ఉపసంహరణ కార్యక్రమం ఉంది.

  • ఆ విషయంలో దిగులు వద్దు..

తెలంగాణ థర్మల్‌ కేంద్రాలకు సమృద్ధిగా బొగ్గు నిల్వలు ఉన్నాయని.. సింగరేణి సంస్థ డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖరరావు, ఎన్‌.బలరామ్‌ స్పష్టం చేశారు (SINGARENI DIRECTORS REVIEW). అన్ని కేంద్రాల్లోనూ కనీసం 5 రోజులకు సరిపడా నిల్వలు సింగరేణి సంస్థ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. 

  • నల్గొండలో షర్మిల దీక్ష

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్​. షర్మిల(ys Sharmila) నేడు నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేయనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం-నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

  • ఎయిర్​ ఇండియా విక్రయం అధికారికం

ఎయిర్​ ఇండియా అధికారిక విక్రయంలో మరో ముందడుగు పడింది. 100 శాతం పెట్టుబడిని ధ్రువీకరిస్తూ ప్రభుత్వం టాటా గ్రూప్​కు లెటర్​ ఆఫ్​ ఇంటెంట్​ను జారీ చేసింది.

  • 'అందుకే ఇంధన ధరలు పెరుగుతున్నాయి..!'

దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర మంత్రి రామేశ్వర్ తెలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అందరికీ ఉచితంగా కొవిడ్-19 టీకా ఇస్తోందని.. దాని కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని అన్నారు.

  • అక్కసు వెళ్లగక్కిన డ్రాగన్​ మీడియా

సరిహద్దుల్లో భారత్‌ వ్యవహరిస్తున్న తీరుపై (Bharat China Border News) చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ మరోమారు తన అక్కసును వెళ్లగక్కింది. భారత్‌ తన ఇష్టానుసారం సరిహద్దుల నిర్ణయం తీసుకోవడం కుదరదని చైనా మీడియా పేర్కొంది.

  • ఇంటి ముఖం పట్టిన బెంగళూరు

ఐపీఎల్​ ఎలిమినేటర్​ మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు చేతులెత్తేసింది. అటు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ విఫలమయ్యి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. 139 పరుగుల లక్ష్యాన్ని కోల్​కతా నైట్​రైడర్స్​ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  

  • యష్.. సరికొత్త రికార్డు

ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్(forbes india) తాజా ఎడిషన్​లో దక్షిణాది స్టార్స్ మెరిశారు. యష్, నయనతార, దుల్కర్ సల్మాన్​ చోటు దక్కించుకున్నారు.

Last Updated : Oct 12, 2021, 9:02 PM IST

ABOUT THE AUTHOR

...view details