తెలంగాణ

telangana

ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 7PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
టాప్ న్యూస్ @ 7PM

By

Published : May 26, 2022, 7:00 PM IST

  • కేసీఆర్ సంచలన కామెంట్స్​

దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేని సీఎం కేసీఆర్​ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • ట్రాక్​పై నిలిచిపోయిన మెట్రో రైలు

మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. నాంపల్లి మెట్రో స్టేషన్‌లో ట్రాక్‌పై మెట్రో రైలు నిలిచిపోయింది.

  • సొంతపార్టీలో రేవంత్ వ్యాఖ్యల కుంపటి..

కులాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే కుంపటి పెట్టాయి. పలువురు నేతలు ఇప్పటికే రేవంత్​ వ్యాఖ్యలను తప్పుబట్టగా.. ఇప్పుడు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్​ మధుయాస్కీ తీవ్రంగా ఖండించారు. రేవంత్​ వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తాయని.. వాటిపై వివరణ ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

  • బాత్‌రూంలో రహస్యంగా కెమెరా పెట్టి..

మహిళల ఆత్మగౌరవానికి భంగం కల్గించే మరో ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. చుట్టూ పొంచి ఉన్న పోకిరీలతో ఎంత అప్రమత్తంగా ఉన్నా.. ఏదో ఓ రూపంలో మహిళలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు

  • వేగంగా నైరుతి రుతుపవనాలు

Monsoon in Kerala: మే 20 నుంచి స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు.. వేగం పుంజుకున్నాయి. దక్షిణ శ్రీలంకను పూర్తిగా కమ్మేశాయి. మరో రెండ్రోజుల్లో కేరళకు చేరుకోనున్నాయి. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి.

  • గవర్నర్​కు మమత షాక్..!

Bengal universities VC governor: బంగాల్​లో సీఎం, గవర్నర్ మధ్య నెలకొన్న వివాదం మరో స్థాయికి చేరింది. గవర్నర్​ను రాష్ట్ర యూనివర్సిటీల ఛాన్స్​లర్​గా తొలగించి.. ఆ స్థానంలో సీఎంను నియమించేలా రూపొందించిన ముసాయిదా చట్టానికి కేబినెట్ ఆమోద ముద్రవేసింది.

  • ' ఇదో ఫ్లాప్​ సినిమా!'

Congress On Govt 8th Anniversary: నరేంద్ర మోదీ నేతృత్వంలోని 8 ఏళ్ల భాజపా పాలనపై నివేదిక విడుదల చేసింది కాంగ్రెస్​. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ విమర్శలు గుప్పించింది. అన్ని రంగాల్లో దేశం నాశనమైందని, ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల సంపద మాత్రమే భారీగా పెరిగిందని ఆరోపించింది.

  • రాజస్థాన్​లో అత్యాచార బాధితురాలికి కన్యత్వ పరీక్ష

Rajasthan kukari ki rasam: రాజస్థాన్​లో అంధ విశ్వాసాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తొలిరాత్రి రక్తస్రావమైతేనే మహిళ కన్యగా భావించే కొందరు.. అత్యాచార బాధితురాలిపై వివక్ష ప్రదర్శించారు. మరోవైపు, గుర్తుతెలియని ఓ మహిళ టాయిలెట్​లో శిశువుకు జన్మనిచ్చింది. చిన్నారిని అందులోనే వదిలేసి వెళ్లింది.

  • 'అతని ఆట అస్సలు అర్థం కాలేదు'

KL Rahul Ravisastri: ఐపీఎల్​ 15వ సీజన్​లో గతరాత్రి బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్​ మ్యాచ్​లో లఖ్​నవూ ఓటమిపాలై ఇంటిబాట పట్టింది. అయితే ఈ మ్యాచ్​లో లఖ్​నవూ ఆటతీరుపై టీమ్​ఇండియా మాజీ హెడ్​ కోచ్​​ రవిశాస్త్రి స్పందించాడు. జట్టు సారథి రాహుల్​ ఆటతీరును విమర్శలు గుప్పించాడు. అతడి ఆట తనకు అర్థం కాలేదని పేర్కొన్నాడు.

  • బాలకృష్ణ మరో కొత్త అవతారం

Balakrishna As producer: ఇప్పటికే నటుడిగా, వ్యాఖ్యతగా జోరు చూపిస్తున్న హీరో బాలకృష్ణ.. ఈ సారి మరో కొత్త అవతారం ఎత్తనున్నారు. నిర్మాతగా మారి ఓ కొత్త సినిమాను రూపొందించునున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా శనివారం తెలపనున్నారు.

ABOUT THE AUTHOR

...view details