ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు యాదాద్రీశుడు కనులముందు కొలువయ్యే తరుణం ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారమైంది. ఎంతో మంది కళాకారుల కఠోర శ్రమ నేడు కళ్ల ముందు కనిపిస్తోంది. ఏడేళ్లుగా వెయ్యికళ్లతో వేచిచూస్తున్న భక్తుల ఎదురుచూపునకు నేడు తెరపడింది. అద్భుత యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునర్వైభవంతో నేడు భక్తులకు సాక్షాత్కరిస్తోంది ఎన్టీఆర్ కారు బ్లాక్‌ఫిలిం తొలగింపుహైదరాబాద్ జూబ్లీహిల్స్, గచ్చిబౌలి వరుస ప్రమాదాల అనంతరం నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలపై దృష్టి పెట్టారు. బ్లాక్ ఫిలిం ఉన్న కార్లను నిలిపివేసి అక్కడికక్కడే తొలగిస్తున్నారు. ఇలా ఆదివారం రోజున జూబ్లీహిల్స్‌లో తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు జూనియర్ ఎన్టీఆర్‌కు చెందిన కారుకు ఉన్న నలుపు తెరను తొలగించారు.వాటితో ఆర్టీసీకి రూ.కోటి అదనపు ఆదాయం ష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీని గట్టెక్కించడానికి అధికారులు నానాకష్టాలు పడుతున్నారు. ఛార్జీలు పెంచి ఆదాయం సమకూర్చుకుందామనుకున్న ఆర్టీసీ.. వాటి పెంపుదలకు ముందే మరో ప్లాన్‌తో ముందుకొచ్చారు. టికెట్ ధరలను రౌండప్ చేసి ఓవైపు.. మరోవైపు టోల్ పేరుతో, రక్షణ ఛార్జీల పేరుతో ఓ రూపాయిని పెంచి రోజుకు అదనంగా కోటి రూపాయల ఆదాయం గడిస్తోంది. 'నాకు దక్కని నువ్వు.. ఎవరికి దక్కడానికి వీల్లేదు'ప్రేమించమని వెంటబడ్డాడు. తనంటే ఇష్టం లేదని చాలా సార్లు అతడికి నచ్చజెప్పింది ఆ యువతి. అయినా రాక్షసుడిలా వెంబడించాడు. ఎక్కడ కనిపిస్తే అక్కడ వేధించడం మొదలుపెట్టాడు. ఇక లాభం లేదనుకుని ఇంట్లో అతడి గురించి చెప్పింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ యువకుణ్ని మందలించారు. విడగొట్టి.. తోలు బొమ్మ ప్రభుత్వాలు ఏర్పాటు ఉక్రెయిన్‌పై దాడి తర్వాత.. తన అధీనంలోకి వచ్చిన ప్రాంతాలపై పట్టు నిలుపుకోవడానికి రష్యా ఏం చేయబోతోంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సామ, దాన, భేద, దండోపాయాలతో స్థానిక పాలనా యంత్రాంగాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్ దృశ్యాన్ని కళ్లకు కడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారుపోలాండ్ పర్యటనకు బైడెన్Biden Poland Visit: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వారం ఐరోపా పర్యటనకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ పొరుగు దేశం పోలాండ్ అధ్యక్షునితో సమావేశం కానున్నారు. యుద్ధ సమయంలో నాటో దేశాలు ఉక్రెయిన్‌కు అందిస్తున్న సాయం గురించి చర్చించనున్నారు.దేశంలో కరోనా తగ్గుముఖం Covid Cases India: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కొత్తగా 1549మంది వైరస్ బారినపడ్డారు. మరో 31మంది వైరస్ కారణంగా మరణించారు.నష్టాల్లో మార్కెట్లుstock market live updates: అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 78 పాయిట్ల నష్టంతో 57,785 వద్ద కొనసాగుతోంది. మరో సూచీ నిఫ్టీ 16 పాయింట్లు కోల్పోయి 17,270 వద్ద ట్రేడవుతుంది.నటుడి సోదరుడు అరెస్ట్..! Suresh Gopi's brother arrested: ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ సోదరుడు సునీల్ గోపీని పోలీసులు అరెస్ట్ చేశారు. భూకుంభకోణానికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేశారు.ఆ పని చేసినందుకు సస్పెండ్ అయ్యాGoutham Gambhir: తనను రెండు నెలల పాటు పాఠశాల నుంచి సస్పెండ్ చేశారంటూ.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. తాను చేసిన ఓ పని వల్ల ప్రధానోపాధ్యాయుడు కన్నీరు పెట్టుకున్నాడని చెప్పాడు. ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అతడు ఈ విషయాల్ని పంచుకున్నాడు.