తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana News: టాప్​న్యూస్ @3PM - 3PM టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

By

Published : Jul 29, 2022, 2:58 PM IST

  • 'కట్నం కోసం భార్యపై గ్యాంగ్ రేప్.. లిఫ్ట్​లో ఉండగానే ముమ్మారు తలాక్!'

అదనపు కట్నం తీసుకురాలేదని బంధువులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ భర్త. ఆ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, అదనపు కట్నం కోసం లిఫ్ట్​లోనే భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పేశాడు ఓ భర్త. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.

  • శాశ్వత పరిష్కారం జరిగే వరకు పోరాడతాం: చంద్రబాబు

ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినప్పుడే... రాజకీయ నేతలు భవిష్యత్‌కు బాటలు వేసిన వారమవుతామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి నిర్మించిన కరకట్టలే... ఇటీవల గోదావరి వరదల నుంచి భద్రాచలాన్ని కాపాడినట్లు తెలిపారు.

  • 'నా ఆటోనే తీయమంటావా..'

సిటీ బస్​ డ్రైవర్​పై ఓ ఆటో డ్రైవర్​ విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన హైదరాబాద్ మాసబ్​ట్యాంక్​ వద్ద చోటుచేసుకుంది. ఎన్​ఎమ్​డీసీ బస్​స్టాప్​ వద్ద ఆర్టీసీ బస్సులు ఆగే చోట ఆటో నిలపడంతో బస్సు డ్రైవర్.. వాహనాన్ని పక్కకు తీయమని కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆటో డ్రైవర్ దాడికి దిగాడు.

  • జయశంకర్ వర్సిటీలో ర్యాగింగ్..

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. జూనియర్లను తమకు గదికి పిలిచి వికృతంగా ర్యాగింగ్ చేయడంతో జూనియర్లు సీనియర్లపై ర్యాగింగ్ స్క్వాడ్‌కు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ చేసిన 20 మంది సీనియర్లపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

  • 'మోదీకి ముందుచూపు లేకే దేశంలో బొగ్గు కొరత'

కాలికి గాయం కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై మరోసారి విరుచుకు పడ్డారు. మోదీ సర్కార్ ప్రణాళికా లోపంతో దేశీయంగా బొగ్గు కొరత ఏర్పడిందని విమర్శించారు.

  • కిడ్నాప్ చేసి మైనర్​పై గ్యాంగ్ రేప్.. రాత్రంతా నరకం!

మార్కెట్​కు కూరగాయల కోసం వెళ్లిన ఓ మైనర్​ను ఆరుగురు యువకులు కిడ్నాప్​ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్​లో జరిగింది. మరోవైపు, హరియాణాలో పానీపత్​​కు చెందిన ఓ వివాహిత.. అత్తింటి వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది.

  • బురదలోకి దూసుకెళ్లిన విమానం!

ఇండిగోకు చెందిన మరో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ఫ్లైట్​ టేకాఫ్​ అవుతుండగా.. రన్​వే పైనుంచి జారింది. దీంతో టైర్లు పక్కనే ఉన్న బురదలో చిక్కుకున్నాయి.

  • పెరిగిన బంగారం, వెండి ధరలు..

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. రూ. 53,160 వద్ద ఉంది. మరోవైపు స్టాక్​ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. మరో మూడో సెషన్​లో సానుకూలంగా కదలాడుతున్నాయి.

  • 'జైలుపై ఉక్రెయిన్​ బాంబు దాడి.. 40 మంది మృతి.. అందరూ సొంతవాళ్లే!'​

ఉక్రెయిన్ చేసిన​ బాంబు దాడి వల్ల ఓ జైలులో ఉన్న 40 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని రష్యా మద్దతు గల వేర్పాటువాదుల ప్రతినిధి తెలిపారు. ఆ ఘటనలో 130 మంది గాయపడ్డారని కూడా చెప్పారు.

  • మోటో '200 మెగాపిక్సల్‌' ఫోన్‌.. ప్రపంచంలోనే తొలిసారిగా..

ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ మోటోరోలా.. 200 మెగాపిక్సల్‌ సెన్సర్‌తో ఓ ఫోన్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. మోటో X30 Pro పేరిట తీసుకురానున్న ఈ ఫోన్​ను ఆగస్టు 2న చైనాలో లాంచ్​​ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని వివరాలను మోటోరోలా అధికారికంగా వెల్లడించగా.. మరికొన్ని స్పెసిఫికేషన్లు లీకయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details