ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు'రేపు ఈడీకి సమాధానం చెబుతా' క్యాసినో వ్యవహారంపై నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ స్పందించారు. ఈడీ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని.. సోమవారం మళ్లీ విచారణకు హాజరుకావాలని చెప్పినట్లు తెలిపారు. మూసారాంబాగ్ వంతెనకు మరమ్మతులు హైదరాబాద్‌లో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహించటంతో ధ్వంసమైన మూసారాంబాగ్ వంతెనపైన అధికారులు మరమ్మతులు చేపట్టారు. పూర్తిగా బురద, రాళ్లు పేరుకుపోవడంతో వాటిని తొలగిస్తున్నారు.జంట జలాశయాలకు తగ్గిన ఉద్ధృతి.. హైదరాబాద్‌లో జంట జలాశయాలకు వరద ఉద్ధతి తగ్గుతోంది. ఉస్మాన్‌సాగర్ జలాశయం 10 గేట్లు.. హిమాయత్‌సాగర్ ఒక గేట్ తెరిచి మూసీలోకి నీటిని వదులుతున్నారు.విగ్గు, అమెరికా ఉద్యోగం.. 8 మందిని పెళ్లాడిన ఘరాన మోసగాడి కథఉన్నత చదువు..అమెరికాలో ఉద్యోగం..అంటూ యువతులను నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకోవడం..మోజు తీరిన తర్వాత ముఖం చాటేయడం. ఈ విషయం తెలిసిన బాధితులు కేసు పెడతామంటే డబ్బులిచ్చి సెటిల్‌మెంట్ చేసుకోవడం ఎదురు తిరిగిన వారిని నీలి చిత్రాలు తీసి బెదిరింపులకు పాల్పడడం..ఇది నిత్య పెళ్లికొడుకు బాగోతం. జపనీయుల ప్రత్యేక యాగం.. తమిళనాడులోని తిరువణ్నామలై నగర సమీపంలో అరుదైన ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. దేవనాంపాటు గ్రామంలో వెలసిన స్వయంభు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో లోక కల్యాణార్థం జపనీయులు ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. టకా యికి ఓషి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పది మందికి పైగా జపనీయులు హాజరయ్యారు. 'అధీర్' వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం..రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరీ చేసిన వ్యాఖ్యలపై ఉభయసభల్లో తీవ్ర దుమారం రేగింది. రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యానించిందుకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలంటూ భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు.39 మంది పిల్లలకు ఒకే సిరంజీతో కరోనా టీకా.. పాఠశాల విద్యార్థులకు కరోనా టీకా వేసే వ్యక్తి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఏకంగా 39 మంది పిల్లలకు ఒకే సిరంజీతో వ్యాక్సిన్ వేశాడు. ఇదేంటని అడిగేసరికి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి, అతడి కోసం గాలిస్తున్నారు.'ఇక అణ్వాయుధాలతోనే జవాబు!'.. ఆ దేశాలకు కిమ్ వార్నింగ్అమెరికా, దక్షిణ కొరియాతో ఉద్రికత్తలు పెరిగిన వేళ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. తీవ్ర హెచ్చరికలు చేశారు. శత్రు దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అమెరికా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని దుయ్యబట్టారు. హిట్‌మ్యాన్ రికార్డ్ బ్రేక్ చేసిన కివీస్ ప్లేయర్.. న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గుప్టిల్ టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు.చిరు వర్సెస్ బాలయ్య.. మరోసారి బాక్సాఫీస్ వార్‌కు రెడీ!మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..