Today is TRS BJP munugode election nomination: మునుగోడు ఉపఎన్నికలో బరిలో నిలిచి తెరాస, భాజపా అభ్యర్థులు ఇవాళ నామినేషన్ వేయనున్నారు. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ ఎన్నికలపై ఎన్నికల సంఘం గట్టి నిఘా పెట్టినందున నామినేషన్ల కార్యక్రమం మునుగోడులో సాదాసీదాగానే నిర్వహించాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. సీపీఎం, సీపీఐ ముఖ్యనాయకులతో కలిసి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ను సమర్పించనున్నారు. నామినేషన్ల చివరి రోజైన ఈ నెల 14న మరో సెట్ నామినేషన్ వేయనున్నట్లు తెలిసింది.
నేడే తెరాస, భాజపా అభ్యర్థుల నామినేషన్.. నెలాఖరులో భారీ బహిరంగ సభలకు ప్లాన్స్! - ఈ రోజు మునుగోడు ఎన్నిక నామినేషన్
Today is TRS BJP munugode election nomination: రసవత్తంగా మారిన మునుగోడు ఎన్నికలు ముఖ్య ఘట్టానికి చేరుకున్నాయి. నేడు తెరాస, భాజపా అభ్యర్థుల నామినేషన్లు వేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం ఎప్పుడు నామినేషన్ వేస్తారో ఇంకా అధిష్ఠానం నిర్ణయించలేదు.
మునుగోడు ఎన్నిక
భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఉదయం 11 గంటలకు నామపత్రం సమర్పించనున్నారు. మునుగోడు నుంచి చండూరు వరకు భారీ ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. నామినేషన్ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్‌తో పాటూ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్, ఈటల రాజేందర్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, భుపేంద్ర యాదవ్, లక్ష్మణ్, డీకే. అరుణ హాజరుకానున్నారు.
ఇవీ చదవండి: