తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2019, 5:10 AM IST

Updated : Dec 25, 2019, 7:05 AM IST

ETV Bharat / city

ఇవాళ క్రిస్మస్‌ పర్వదినం

తెలంగాణ వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే సంబురాలు మొదలయ్యాయి. చర్చిలన్నీ విద్యుత్‌దీపాలతో మెరిసిపోతూ పండుగ శోభను సంతరించుకున్నాయి. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

today-is-christmas-day
ఇవాళ క్రిస్మస్‌ పర్వదినం

ఇవాళ క్రిస్మస్‌ పర్వదినం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో క్రిస్మస్‌ వేడుకలు అంబరాన్నంటాయి. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారాయణ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌, పొన్నం ప్రభాకర్‌, జగ్గారెడ్డి తదితరులు కేక్​ కట్​చేసి వేడుకల్లో పాల్గొన్నారు. నాంపల్లి తెజస కార్యాలయంలో కోదండరాం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ సంబురాలు జరిగాయి.

"క్రిస్మస్‌.. క్రీస్తు జననాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు జరుపుకొనే గొప్ప పండుగ. శాంతికి మారు పేరు ఏసుక్రీస్తు. కరుణ, దయాగుణం ఆయన సొంతం. బానిసత్వం, దోపిడీ, హింస, మహిళలపై అత్యాచారాలు ప్రబలిపోతున్న తరుణంలో జన్మించి.. శాంతి, దయ, కరుణ, ప్రేమను పంచిన దయామయుడు"

అంబరాన్నంటిన సంబురం
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో క్రిస్మస్‌ కోసం ప్రత్యేకంగా అలంకరించిన ప్రాంతంలో.. ప్రయాణికులు సెల్ఫీలు దిగుతూ సంబురాలు చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని అన్ని చర్చిల్లోనూ ప్రత్యేక ఆరాధనలతో భక్తి భావం చాటుకున్నారు. కూకట్‌పల్లి పినాకిల్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో.. 50 మంది విద్యార్థులు కలిసి భారీ కేక్‌ను తయారుచేశారు.

కేక్స్​ అదుర్స్​

క్రిస్మస్ పర్వదిన వేడుకల కోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మెథడిస్ట్ చర్చిని సర్వసుందరంగా అలంకరించారు. ఇంగ్లాండు నుంచి తెప్పించి అలంకరించిన అద్దాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పండుగ సందర్భంగా.. క్రైస్తవులకు ప్రేమవిందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఆటపాటలతో యువత సందడి

మహబూబాబాద్‌లో యువతీ, యువకులు ఆటపాటలతో ఆనందంగా గడిపారు. నిజామాబాద్‌లోని చర్చిలన్నీ పండుగ కోసం సుందరంగా ముస్తాబయ్యాయి. డిచ్‌పల్లిలో క్రైస్తవులకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి క్రిస్మస్‌ కానుకలు అందించారు.

మేరీ క్రిస్మస్​..!

ఏసు ఆగమనాన్ని కీర్తిస్తూ పాటలు పాడుతూ వరంగల్‌లో పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా ఎన్కూరులో బైబిల్‌ సందేశాన్ని వివరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చర్చిలన్నీ క్రైస్తవ సోదరులతో కిటకిటలాడనున్నాయి.

గవర్నర్‌, సీఎంల క్రిస్మస్‌ శుభాకాంక్షలు

రాష్ట్రంలో క్రైస్తవులు క్రిస్మస్‌ పండుగను ఆనందంగా జరుపుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ఆకాంక్షించారు. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన క్రీస్తు జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన బోధించిన ప్రేమ, ధర్మం, దయ, కరుణ అందరికీ మార్గదర్శకమని చెప్పారు.

ఇవీ చూడండి:యాదాద్రి ప్రాకారాలపై దేవతామూర్తుల విగ్రహాలు

Last Updated : Dec 25, 2019, 7:05 AM IST

ABOUT THE AUTHOR

...view details