ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. మీ మీ రంగాల్లో విజయం సొంతమవుతుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఇంటగెలిచి రచ్చగెలుస్తారు. చంద్ర గ్రహ అష్టోత్తరం పఠిస్తే మంచిది.
శ్రమతోకూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగు ముందుకు వేయండి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఆరోగ్యం కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి
మంచి సమయం. కీలకమైన పనుల్లో తోటివారి సహకారం లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. సూర్యాష్టకము చదివితే బాగుంటుంది.
మీ మీ రంగాల్లో శుభఫలితాలు అందుకుంటారు. సమయం అనుకూలంగా ఉండడం వల్ల పనులు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. గణపతి స్తోత్రం చదవితే మంచి జరుగుతుంది.