వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.
కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించాలి.
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆంజనేయ దర్శనం చేయడం మంచిది.
సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం పఠించాలి.
సమయం అనుకూలంగా ఉంది. తోటివారి సహకారం ఉంటుంది. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతిని ఆరాధిస్తే మంచిది.
పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును ఇబ్బంది పెడుతుంది. అకారణ కలహ సూచన ఉంది. దైవారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మానకండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.