తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - today horoscope

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

today horoscope
today horoscope

By

Published : May 23, 2021, 5:06 AM IST

అభివృద్ధిని సాధిస్తారు. మీరు తీసుకునే కీలక నిర్ణయాల్లో ఫలితాలు వస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. దుర్గా దేవిని సందర్శిస్తే మంచి జరుగుతుంది.

ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. నిందారోపణలు చేసేవారున్నారు. కలహాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతత కోసం సాయిబాబా సందర్శనం ఉత్తమం.

మంచి ఫలితాలున్నాయి. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. లక్ష్మీ గణపతి ధ్యానం శుభప్రదం.

మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం శ్రేయోదాయకం.

శుభకాలం. ముఖ్య పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సలహాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం చదవడం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది.

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోకూడదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.

కృషికి తగ్గ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడిని పెంచే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవాలి.

అనుకున్నది సాధించడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీ రామ నామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది.

మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఈశ్వరుడిని ఆరాధిస్తే మంచిది.

ప్రశాంతమైన మనసుతో ముందుకు సాగితే.. మంచి ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. హనుమాన్ చాలీసా జపించడం మంచిది.

ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థిక లాభాలున్నాయి. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. సూర్య స్తుతి శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details