తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - today horoscope

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

ఈ రోజు రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు

By

Published : May 3, 2021, 4:31 AM IST

మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో బుద్ధి చాంచల్యంతో వ్యవహరిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విష్ణు నామస్మరణ ఉత్తమం.

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించేవారున్నారు జాగ్రత్త. సాయి నామాన్ని జపించాలి.

ఒక శుభవార్త వింటారు. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. దైవారాధన మానవద్దు.

ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది.

అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించినా, జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. దుర్గాధ్యానం శుభప్రదం.

కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య ఈ వారం పరిష్కారమవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. గణపతిని పూజిస్తే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు.

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఫలిస్తుంది. సమయానుకూలంగా ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. ప్రశాంతంగా ఆలోచిస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులను కలుపుకొనిపోవాలి. దుర్గాధ్యానం శుభప్రదం.

మీలోని పట్టుదలే మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవ్వరినీ విశ్వసించవద్దు. శ్రీరామ నామాన్ని జపిస్తే ఉత్తమం.

శుభకాలం. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. ధర్మ కార్యాచరణ చేస్తారు. నూతన వస్తుప్రాప్తి ఉంది. సూర్య ఆరాధన చేస్తే మంచిది.

మిశ్రమ కాలం. చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ ఆలయ సందర్శనం మేలు చేస్తుంది.

శుభకాలం. అనుకూల ఫలితాలున్నాయి. ఉన్నత అధికారుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహవంతమైన వాతావరణం ఉంటుంది. ఇష్టదైవారాధన చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.

దైవబలం అనుకూలిస్తోంది. ఆపదలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. ఈశ్వర సందర్శనం శుభదాయకం.

ABOUT THE AUTHOR

...view details