తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​కు ఏపీ జాలర్లు... మరికొన్ని గంటల్లో విజయవాడకు - పాక్ చెర నుంచి విడుదలైన ఏపీ జాలర్ల వార్తలు

పాకిస్థాన్​ చెర నుంచి విడుదలైన ఏపీకి చెందిన జాలర్లు హైదరాబాద్​కు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ను కలుస్తారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.

Fishermen
Fishermen

By

Published : Jan 7, 2020, 6:41 PM IST

పాక్​ చెర నుంచి విడుదలైన ఏపీ మత్స్యకారులు మరికొద్ది గంటల్లో విజయవాడకు చేరుకోనున్నారు. హైదరాబాద్​ చేరుకున్న వారు ముఖ్యమంత్రి జగన్​ను కలుస్తారని మంత్రి మోపిదేవి తెలిపారు. 14 నెలలుగా పాకిస్థాన్​ చెరలో మగ్గుతున్న జాలర్లను నిన్న వాఘా సరిహద్దు వద్ద మంత్రి మోపిదేవి వెంకటరమణ బృందానికి అప్పగించింది. మరో ఇద్దరు జాలర్లు కూడా త్వరలో విడుదలవుతారని వెల్లడించారు.

ఏపీ ప్రభుత్వం అన్నివిధాలా వారికి అండగా ఉంటుందని మంత్రి మోపిదేవి అన్నారు. 20 మంది జాలర్లకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనున్నట్లు చెప్పారు.

హైదరాబాద్​కు ఏపీ జాలర్లు... మరికొన్ని గంటల్లో విజయవాడకు

ఇదీ చదవండి:ఆంధ్రా జాలర్లను భారత్​కు అప్పగించిన పాక్​.. రేపు స్వగ్రామాలకు...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details