AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 19,432 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 253 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకి చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 14,718కి చేరింది. 24 గంటల వ్యవధిలో కరోనా బారినుంచి 635 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,181 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో కరోనా కొత్త కేసులు
Covid cases in india: దేశంలో కరోనా కొత్త కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు.. 15,102 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 278 మంది మరణించారు. 31,377 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.28శాతానికి పరిమితమైంది. దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,76,19,39,020కు చేరింది.
- మొత్తం మరణాలు: 5,12,622
- యాక్టివ్ కేసులు: 1,64,522
- మొత్తం కోలుకున్నవారు: 4,21,89,887