తెలంగాణ

telangana

ETV Bharat / city

AP CORONA CASES: ఏపీలో కొత్తగా 503 కరోనా కేసులు, 12 మరణాలు - ఏపీ కొవిడ్ వార్తలు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 32 వేల 846 మంది కొవిడ్​ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 503 కరోనా పాజిటివ్ (AP CORONA CASES)వచ్చింది. వైరస్​ బారిన పడి మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

AP CORONA CASES
AP CORONA CASES

By

Published : Oct 12, 2021, 10:29 PM IST

ఏపీలో గడిచిన 24 గంటల్లో 32,846 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ (ap corona bulletin) తెలిపింది. కొత్తగా 503 మందికి కరోనా సోకిందని వెల్లడించింది. వైరస్‌ ప్రభావంతో మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఏపీవ్యాప్తంగా కొవిడ్ నుంచి 817 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 6,932 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ్టి వరకు ఏపీలో 2,88,00,809కి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఏపీ వైద్యారోగ్య శాఖ బులిటెన్​

ఇదీచూడండి:attack on Asha worker: కరోనా వ్యాక్సిన్​ వేసుకున్నాక జ్వరం వచ్చిందని.. ఆశావర్కర్​పై దాడి

ABOUT THE AUTHOR

...view details