AP corona cases today: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా రోజూ 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 41,771 నమూనాలు పరీక్షించగా.. 13,474 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి కొత్తగా 9 మంది మరణించారు.
మహమ్మారి నుంచి కొత్తగా 10,290 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,09,493 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
దేశంలో..
Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా 2,86,384 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 573 మంది మరణించారు. 3,06,357 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:4,03,71,500
- మొత్తం మరణాలు:4,91,700
- యాక్టివ్ కేసులు:22,02,472
- మొత్తం కోలుకున్నవారు:3,76,77,328
Vaccination in India