మహారాష్ట్రలో మరఠ్వాడ, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్‌లోని కొన్ని ప్రాంతాలకు శనివారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు - telangana rain news
తెలంగాణలో ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలోని కొన్ని చోట్ల ఆదివారం, సోమవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా తాండూరులో 6.3 సెంటిమీటర్లు, తాండ్రలో 5.2, నర్సాపూర్‌లో 5.2, లింగపూర్‌లో 4.6, కుంటాలలో 4.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.