తెలంగాణ

telangana

By

Published : Oct 18, 2021, 1:31 PM IST

ETV Bharat / city

నేడు, రేపు మద్యం దుకాణాలు బంద్​

నేడు, రేపు మద్యం దుకాణాలు బంద్​
నేడు, రేపు మద్యం దుకాణాలు బంద్​

13:25 October 18

నేడు, రేపు మద్యం దుకాణాలు బంద్​

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, దాని సమీపంలోని బార్లు, మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలను నేడు, రేపు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్ అధికారులను ఈ మేరకు ఆదేశించారు.

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, దీనికి సమీపంలోని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను రెండు రోజులు మూసివేయాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని అబ్కారీ అధికారులకు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details