రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 11న ఉత్తర, పరిసర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈరోజు దక్షిణ ఛత్తీస్ గఢ్ పరిసరాలు, దక్షిణ ఒడిశా ప్రాంతాలలో కేంద్రీకృతమైందని ఐఎండీ సంచాలకులు వివరించారు.
Telangana Rains: రాష్ట్రంపై వరుణాగ్రహం.. ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు..! - హైదరాబాద్ వాతావరణ కేంద్రం
భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే మూడు రోజులుగా కురుస్తున్న వానలతో.. పలు నగరాలు జలమయమయ్యాయి. ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
![Telangana Rains: రాష్ట్రంపై వరుణాగ్రహం.. ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు..! today and tomorrow heavy rains in telangana said imd hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12994876-956-12994876-1631009501622.jpg)
ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ. వరకు కేంద్రీకృతమై ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి స్థిరంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ తీవ్ర అల్ప పీడనం రాగల 2 నుంచి 3 రోజులలో పశ్చిమ- వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. అదే విధంగా రుతుపవనాల ద్రోణి ఈరోజు బికనూర్, భిల్వార్, ఇండోర్, భోపాల్, గొండియా, దక్షిణ ఛత్తీస్గఢ్.. పరిసర దక్షిణ ఒడిశాలోని అల్పపీడనం, గోపాల్పూర్ మీదగా తూర్పు ఆగ్నేయ దిశగా.. తూర్పు మధ్య బంగాళా ఖాతం వరకు కొనసాగుతుందని వివరించారు.
ఇదీ చూడండి: