తెలంగాణ

telangana

ETV Bharat / city

నేడు 16,200 మందికి టీకాలు.. ఒక్కో కేంద్రంలో 50 మందికి - తెలంగాణ కరోనా వ్యాక్సినేషన్​

రాష్ట్రంలో రెండో రోజు వ్యాక్సినేషన్​కు ఆరోగ్యశాఖ సర్వసన్నద్ధమైంది. రెండోరోజు 184 కేంద్రాలను కొత్తగా నెలకొల్పడం వల్ల మొత్తం కేంద్రాల సంఖ్య 324కు చేరింది. రెండో రోజు ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున 16,200 మంది వైద్యసిబ్బందికి టీకా వేయనున్నారు.

vaccine
vaccine

By

Published : Jan 18, 2021, 7:41 AM IST

రాష్ట్రంలో కొవిడ్‌ టీకా పంపిణీ మలిరోజుకు ఆరోగ్యశాఖ సర్వసన్నద్ధమైంది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం తిరిగి టీకాలు వేయనున్నారు. రెండోరోజు 184 కేంద్రాలను కొత్తగా నెలకొల్పారు. మొత్తం కేంద్రాల సంఖ్య 324కు పెరిగింది. రెండో రోజు ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున 16,200 మంది వైద్యసిబ్బందికి టీకా వేయనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

టీకా కేంద్రాలు అత్యధికంగా హైదరాబాద్‌లో 42 ఉండగా.. 10 కంటే ఎక్కువగా టీకా పంపిణీ కేంద్రాలున్న జిల్లాల జాబితాలో ఆదిలాబాద్‌ (13), భద్రాద్రి కొత్తగూడెం (14), ఖమ్మం (15), మహబూబ్‌నగర్‌ (11), మేడ్చల్‌ మల్కాజిగిరి (11), నల్గొండ (18), నిజామాబాద్‌ (14), రంగారెడ్డి (14), సంగారెడ్డి (12), సిద్దిపేట (12), సూర్యాపేట (10), వరంగల్‌ నగర (14) జిల్లాలున్నాయి.

క్షేమ సమాచారాల ఆరా

తొలిరోజు టీకా పొందిన 3,962 మందిలో 11 మందికి స్వల్ప దుష్ఫలితాలు ఎదురయ్యాయి. వీరికి తగిన వైద్యసేవలు అందించారు. మొత్తం టీకాల పొందిన వారి ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని శ్రీనివాసరావు తెలిపారు. ఎవరికీ అనారోగ్య సమస్యలు లేవని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి :కొవిడ్ టీకా రెండు డోసుల మధ్య ఎంత వ్యవధి ఉండాలి?

ABOUT THE AUTHOR

...view details